మన దైనందిన జీవితంలో కుటుంబంతో సమయం గడపడమే గగనమైపోతుంది. అందుకే ఫ్యామిలో కచ్చితంగా గడిపేందుకు.. ఉన్న సమస్యలను దూరం చేసుకునేందుకు మంచి ట్రిప్​కి వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు. కుటుంబంతో కలిసి మధురమైన జ్ఞాపకాలు క్రియేట్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులతో, పిల్లలతో, భాగస్వామితో కలిసి ఎలాంటి ప్లేస్​లకు వెళ్లొచ్చు.. అక్కడ ఎలాంటి వసతులున్నాయో.. బడ్జెట్​ ఫ్రెండ్లీ ట్రిప్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


గోవా 


ఫ్యామిలీతో కలిసి బీచ్ విహారానికి వెళ్లాలనుకుంటే గోవా అనువైన ప్రదేశం. బీచ్​కు దగ్గర్లో స్టే తీసుకుంటే మీరు ఎలాంటి వెహికల్ లేకుండా బీచ్​కు చేరుకోవచ్చు. బీచ్​ నుంచి హోటల్​కి చేరుకోవచ్చు. అక్కడ పిల్లలతో కలిసి వాటర్ స్పోర్ట్స్, ప్రకృతి, సాంస్కృతిక కార్యక్రమాలను ఎంజాయ్ చేయవచ్చు. బీచ్​లలో ఆడుకునేందుకు పిల్లలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. పేరెంట్స్​ అక్కడ బీచ్​లలో విశ్రాంతి తీసుకోవచ్చు. లేదంటే స్పా చేయించుకోవచ్చు. గోవాలో సీ ఫుడ్ అస్సలు మిస్​ కావొద్దు.




Unlock the best of Goa – Choose from a diverse collection of family-friendly resorts and hotels.


4 నైట్స్ హాలీడే ప్యాకేజీతో మునుపెన్నడూ లేని విధంగా గోవాను ఎంజాయ్ చేయవచ్చు. ఇది మీకు, మీ ఫ్యామిలీకి మరపురాని విహారయాత్ర అవుతుంది.


జైపూర్




పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన జైపూర్ మీ ఫ్యామిలీ ట్రిప్​కు మంచి స్పాట్​. ఈ ప్రాంతం సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు. రాచరిక శైలిని అనుభవించాలనుకుంటే ఇక్కడ హెరిటేజ్ హోటళ్లు మీకు ఎల్లప్పుడూ స్వాగతం చెప్తాయి. చారిత్రాత్మక కోటలు, రాజభవానాలు, ఆ ప్రాంత ట్రెడీషనల్ ఉట్టిపడే మార్కెట్లలో షాపింగ్ చేయవచ్చు. పిల్లల కోసం ఏనుగు సవారీలు, తోలు బొమ్మ ప్రదర్శనలు, సిటీ ప్యాలెస్ సందర్శించవచ్చు. పేరెంట్స్​తో కలిసి రాజస్థానీ వంటకాలు ఆస్వాదించవచ్చు. ఈ నగర చరిత్రను ఎక్స్​ప్లోర్​ చేయవచ్చు. 


 


మీరు గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ ప్యాకేజీని బుక్​ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి పర్​ఫెక్ట్ ట్రిప్ అనుభవాన్ని పొందుతారు. ఇది మిమ్మల్ని జైపూర్, ఆగ్రా, న్యూఢిల్లీ మీదుగా మీరు వెళ్లొచ్చు. 


కేరళ 




"గాడ్స్ ఓన్ కంట్రీ"గా పిలువబడే కేరళ.. మీరు కుటంబంతో కలిసి ప్రశాంతంగా హాలీడే స్పెండ్ చేసేందుకు అనువైన ప్రదేశం. మీరు అక్కడ బ్యాక్ వాటర్స్‌లో హౌస్‌బోట్‌లలో స్టే చేయవచ్చు. లష్ ల్యాండ్‌స్కేప్‌ల ప్రశాంతమైన రైడ్‌ చేయవచ్చు. వన్యప్రాణుల సఫారీలకు, సహజమైన బీచ్‌లకు ఇది అనువైన ప్రదేశం. అంతేకాకుండా అక్కడ రుచికరమైన వంటకాలు ఆస్వాదించవచ్చు. పెద్దవారు స్పా చేయించుకోవచ్చు. అక్కడి తేయాకు తోటల్లో వాకింగ్​కి వెళ్లొచ్చు.  


Fly in Comfort and Style to Kochi with AirVistara! Enjoy Premium Economy at Unbeatable Prices. కేరళలో లగ్జరీ హోటళ్లలో బడ్జెట్​ ఫ్రెండ్లీ కాస్ట్​తో స్టే చేసేందుకు ఇప్పుడే మీరు బుక్ చేసుకోవచ్చు. 


కేరళలో వారం రోజుల పాటు జరిగే అడ్వెంచర్ టూర్​కోసం బుక్ చేసుకోవచ్చు. కొచ్చిలోని ఐకానిక్ డచ్ ప్యాలెస్​ను, మున్నార్​లోని జలపాతాలను, తేక్కడిలో రాఫ్టింగ్ చేయవచ్చు. అలెప్పీలో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. కోవలం, పూవార్​లోని బీచ్​లలో పిల్లలతో కలిసి గేమ్స్ ఆడుకోవచ్చు. 


రిషికేశ్




కుటుంబంతో కలిసి అడ్వెంచర్​, ఆధ్యాత్మిక టూర్ వేయాలనుకుంటే రిషికేశ్ బెస్ట్ ఛాయిస్. హిమాలయాల్లోని రిషికేశ్ మీకు సాహసోపేతమైన, ఆధ్యాత్మిక అనుభవాన్ని ఒకేసారి పొందవచ్చు. ఇక్కడ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, యోగా వంటివి ఎక్స్​పీరియన్స్ చేయవచ్చు. రిషికేశ్​ ఢిల్లీకి బాగా దగ్గర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా బస్సు ప్రయాణం చేయవ్చచు. మీ సాహసయాత్ర కోసం బస్​ బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రశాంతమైన ప్రాంతంలో మీరు మంచి వసతులు ఎంచుకోవచ్చు. ఇక్కడ పర్యావరణ అనుకూలమైన రిసార్ట్​లు, హోటళ్లు, నదీతీర శిబిరాలు మీ ట్రిప్​ ఫీల్​ని మరింత రెట్టింపు చేస్తాయి. 


ఇక్కడ పిల్లలతో కలిసి గంగానదిలో రివర్ రాఫ్టింగ్, బీటిల్స్ ఆశ్రమం సందర్శించవచ్చు. కుటుంబంతో కలిసి యోగా, ధ్యానం శిబిరాలు సందర్శించవచ్చు. ఇవి ప్రశాంతతను అందిస్తాయి. గంగా ఆర్తి, ఆధ్యాత్మిక ఆశ్రమాలు, ఆయుర్వేద చికిత్సలు, నదీ తీర ప్రాంతాలు వెళ్లొచ్చు. రిషికేశ్​కు మీ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే.. డెహ్రాడూన్​కు ఫ్లైట్ బుక్ చేసుకోండి.


కులు మానాలి




కులుమనాలి సహజమైన సౌందర్యం, థ్రిల్లింగ్ సాహసాలకు పెట్టింది పేరు. ఇది కుటుంబంతో హాయిగా గడిపో అందమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు. ఇక్కడ మీరు కుటుంబంతో కలిసి స్టే చేసేందుకు రిసార్ట్​లు, హోటళ్లు, హాయినిచ్చే హోమ్​స్టేలు ఎంచుకోవచ్చు. ఇది మీ ప్రియమైన వారితో మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది. ఇక్కడ నదిలో రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, యాపిల్ పికింగ్ వంటి ప్రోగామ్స్​లో పాల్గొనవచ్చు. ఇవన్నీ మీ కుటుంబానికి మరపురాని అనుభూతిని ఇస్తాయి. 


ఇక్కడ స్నోలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. బియాస్ నదిలో రివర్ రాఫ్టింగ్, సోలాంగ్ వ్యాలీ వద్ద పారాగ్లైడింగ్, హడింబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడ ఫుడ్ మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 


అండమాన్ - నికోబార్ దీవులు




అండమాన్, నికోబార్ దీవులు మీ ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేసేందుకు అనువైనవి. ఇక్కడ సహజమైన బీచ్‌లు, క్రిస్టల్-క్లియర్ వాటర్​ మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. వాటర్ స్పోర్ట్స్  కుటుంబాలకు అంతిమ స్వర్గంగా మారింది. వాటర్ స్పోర్ట్స్‌తో అడ్వేంచర్ చేయవచ్చు. బీచ్​లలో మీ ప్రియమైన వారితో, పిల్లలతో హాయిగా గడపవచ్చు. 


ఈ మరపురాని ప్రయాణానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే అతి తక్కువ ధరలతో ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. అలాగే గరిష్టంగా ₹800 తగ్గింపు పొందండి! పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ & నీల్ ఐలాండ్‌లో 5N బసతో అండమాన్‌లో మీ బీచ్ సెలవులను ఎంజాయ్ చేయవచ్చు. 


డార్జిలింగ్




డార్జిలింగ్ తేయాకు తోటలు, హిమాలయాలలోని కాంచనజంగా వంటి ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రశాంతమైన ప్రదేశాల్లో వలసరాజ్యాల కాలం నాటి హోటల్‌లు, బోటిక్ రిసార్ట్‌లలో ఉండండి. టీ ఎస్టేట్‌లు ఆకట్టుకుంటాయి. ఫ్యామిలీతో కలిసి డార్జిలింగ్‌లో బెస్ట్ ప్లేస్​లు చుట్టేయొచ్చు. టాయ్​ ట్రైన్ రైడ్​లు, పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్​ను సందర్శించవచ్చు. డార్జిలింగ్ టీ తాగడం మాత్రం మరిచిపోకండి. 


MakeMyTrip ద్వారా సిక్కిం డిలైట్ విత్ డార్జిలింగ్ ప్యాకేజీతో.. హిమాలయాల అందాలను చుట్టేయొచ్చు. రెండు ఉత్కంఠభరితమైన గమ్యస్థానాలను కలిసి ఒకేసారి చుట్టేసే అవకాశాన్ని వదులుకోకండి. 


ఊటీ 




తమిళనాడులోని సుందరమైన హిల్ స్టేషన్ ఊటీ. ఇక్కడ తేయాకు తోటలు, వాటి మధ్య కాటేజీలు, రిసార్ట్​లు బెస్ట్ అనుభూతినిస్తాయి. టాయ్​ ట్రైన్ ​రైడ్​లను, బొటానికల్ గార్డెన్​లను ఎక్స్​పీరియన్స్ చేయవచ్చు. నీలగిరి కొండలు సీనరీ లుక్​ని క్యాప్చర్​ చేయడం మరచిపోకండి. నీలగిరి మౌంటైన్ రైల్వే మ్యూజియం సందర్శించవచ్చు. బొటానికల్ గార్డెన్స్​లో పిక్నిక్​కి వెళ్లొచ్చు. పచ్చని తేయాకు తోటల మధ్య టీ తాగొచ్చు. నిర్మలమైన గార్డెన్​లో వాకింగ్​కి వెళ్లొచ్చు. పడవ ప్రయాణాలు, రోజ్ గార్డెన్​ను విజిట్ చేయడం మరిచిపోకండి. 


ఊటీని ఫ్యామిలీతో కలిసి చుట్టేందుకు ఫిక్స్​ అయ్యారా? కోయంబత్తూర్‌కు సాటిలేని విమాన ఆఫర్‌లను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ఊటీకి సమీప విమానాశ్రయం. బ్యాగేజ్ ఇన్సూరెన్స్, 100% రీఫండ్ CT FlexMax, వేగవంతమైన, సురక్షితమైన బుకింగ్స్ చేసుకోవచ్చు. 24-గంటల్లో వాపసు చేసుకోవచ్చు. EMI ఆప్షన్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ ఛార్జీలతో మీ డ్రీమ్ ట్రిప్​ను ప్లాన్ చేసుకోవచ్చు.


ఉదయపూర్




ఉదయపూర్, లేక్స్ నగరం, కుటుంబాలకు రాజరిక అనుభవాన్ని అందిస్తుంది. నిర్మలమైన సరస్సులకు ఎదురుగా హెరిటేజ్ హోటళ్లలో బస చేయవచ్చు. ఇక్కడ ప్యాలెస్‌లు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఆర్ట్ గ్యాలరీలు విజిట్ చేయడం మరచిపోకండి. అక్కడ సరస్సులో పడవ ప్రయాణం బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 


ట్రావెలర్స్ ఛాయిస్​లో భాగంగా 2023 ఉదయపూర్‌లోని అత్యుత్తమ లేక్‌సైడ్ స్టేయింగ్ ప్లేస్​ లను ఇక్కడ కనుగొనవచ్చు. లగ్జరీ, సుందరమైన వసతి గృహాలను ఎంచుకోవచ్చు. 


జగ్ మందిర్ ద్వీపానికి పడవ ప్రయాణం, సిటీ ప్యాలెస్‌, రాజస్థానీ తోలుబొమ్మల ప్రదర్శనలను ఆస్వాదించవచ్చు. అక్కడి భోజన రుచులు, ముఖ్యంగా స్వీట్స్ మీకు మంచి అనుభూతి ఇస్తాయి.  ఆయుర్వేద చికిత్సలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 


కజిరంగా నేషనల్ పార్క్ 




వన్యప్రాణులంటే మీకు ఇష్టమా? అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఒక అద్భుతమైన గమ్యస్థానం. మీరు ఫ్యామిలీతో కలిసి పార్కుకు సమీపంలోని పర్యావరణ అనుకూల లాడ్జీలలో బస చేయవచ్చు. ఇక్కడ కొమ్ములతో కూడిన ఖడ్గమృగం, పులులు, వివిధ పక్షి జాతులు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.


జీప్ సఫారీలు, ఏనుగు సవారీలు, వన్యప్రాణి ఫోటోగ్రఫీ చేయొచ్చు. సమస్యలన్నీ వదిలేసి ప్రకృతి సౌందర్యంలో లీనమై పోవచ్చు. అస్సామీ వంటకాలు ట్రై చేయవచ్చు.


ఢిల్లీ నుంచి గౌహతికి  ప్రయాణించాలనుకుంటే మీరు ఇప్పుడే విమానాన్ని బుక్ చేసుకోండి!


టాప్-నాచ్ శానిటైజేషన్, అసాధారణమైన హాస్పిటాలిటీని మీరు పొందవచ్చు. విద్యార్థులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక తగ్గింపులున్నాయి.



Disclaimer: This is a partnered article. The information is provided to you on an "as-is" basis, without any warranty. Although all efforts are made, however, there is no guarantee to the accuracy of the information. ABP Network Private Limited (‘ABP’) and/or ABP Live make no representations or warranties as to the truthfulness, fairness, completeness, or accuracy of the information. Readers are advised visit to the website of the relevant advertiser to verify the pricing of the goods or services before any purchase.