ఫ్రిజ్ తెరవగానే అందులో చాక్లెట్లు, ఐస్ క్రీములు, చీజీ పిజ్జాలు దర్శనమిస్తాయి. వాటిని చూడగానే నోరూరిపోతుంది. బరువు తగ్గాలనుకునే లక్ష్యం ఆ ఐస్ క్రీమ్ లాగా నీరుగారిపోతుంది. ఎందుకంటే వాటి వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. అలా కాకుండా ఈ పదార్థాలు మీ ఫ్రిజ్ లో ఎప్పుడు పెట్టుకుని తినండి. మీకు తినాలనే కోరిక తీరుతుంది. బరువును కూడా సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయి. మీ రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసుకునే కొన్ని ఆహార పదార్థాల జాబితా ఇది..
ఉడకబెట్టిన/ రోస్ట్ చేసిన గింజలు
ఉడికించిన శనగలు, పచ్చి బఠానీలు ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు. శనగలు ఉడకబెట్టుకుని మసాలా పొడి వేసుకుని కాస్త ఛాట్ లాగా స్పైసీగా చేసుకోవచ్చు. వీటిని వేయించుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉడకబెట్టుకుని వాటిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నోరూరించే వంటకాలు చేసుకోవచ్చు. ఆకలిగా అనిపించినప్పుడల్లా వాటిని తినొచ్చు.
గుడ్లు
ఆరోగ్యకరమైన ప్రోటీన్లు అందించే జాబితాలో గుడ్డు మొదటి స్థానం అనే చెప్పుకోవాలి. బాగా కాగిన నూనెలో వేయించిన బయట చిరుతిండి తినడం కంటే ఆరోగ్యకరమైన గుడ్డు తినడం మంచిది. ఎప్పుడు గుడ్లు ఫ్రిజ్ లో ఉండేలా చూసుకోండి ఎప్పుడైనా తినాలని అనిపిస్తే ఆమ్లెట్, ఉడికించుకుని కొద్దిగా పెప్పర్ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఆకలిని తీర్చదమే కాదు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
బెర్రీలు
తీపి తినాలని ఇష్టపడే వారికి బెర్రీలు లేదా డ్రై ఫ్రూట్స్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇది శుద్ధి చేసిన చక్కెర తీసుకోవడం తగ్గిస్తుంది. వీటి వల్ల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరానికి అందిస్తుంది. స్వీట్లు తినాలనో కోరిక ఇది భర్తీ చేసేందుకు సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
సీజనల్ కూరగాయలు
అర్థరాత్రి ఆకలిగా అనిపించే చాలా మంది చేసే పని ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకుని తినేస్తారు. ఇది కొవ్వుని తగ్గించే ప్రయత్నాలని నాశనం చేస్తుంది. అందుకే ఫ్రిజ్ లో ఎప్పుడు కూరగాయలు ఉంచుకోవాలి. అన్ని రకాల కూరగాయల ముక్కలతో రుచికరమైన వెజ్జీ టాస్ చేసుకుని తినొచ్చు. ఇందులో కాసింత పెప్పర్ పొడి వేసుకుంటే ఆ రుచి అద్భుతం.
పెరుగు
ఐస్ క్రీమ్ తినాలనే కోరిక కలిగినప్పుడు పెరుగు తినెయ్యండి. సూపర్ గా ఉంటుంది. ఇంట్లోని ఫ్రిజ్ లో ఉండే పండ్లు ముక్కలుగా కోసుకుని వాటిని పెరుగులో కలుపుకుని కాస్త తేనె జోడించుకుని తింటే చాలా బాగుంటుంది. చక్కెర తినాలనే కోరిక తీరిపోతుంది, రుచికరమైన ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోబయాటిక్స్ ఉన్నాయి. పేగులని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాని ప్రేరేపిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా కనిపిస్తున్నాయా? ఈ కెచప్‌తో తోమారంటే అద్దాల్లా మెరిసిపోతాయ్!