Sterilization Family Planning Surgery : ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలోని సిచ్యూవేషన్ బట్టి చాలామంది ఇక పిల్లలు వద్దనుకుంటారు. అలాంటి దంపతులు శాశ్వత పరిష్కారంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించుకుంటారు. ప్రభుత్వం కూడా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ని ప్రోత్సాహిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ మగవారి కంటే ఆడవారే ఎక్కువగా చేయించుకుంటున్నారని తెలుసా? ఆపరేషన్ ప్రాసెస్ అంత కష్టమా? ఎవరు చేయించుకుంటే మంచిది? నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం. 

Continues below advertisement

కుటుంబ నియంత్రణ కోసం స్టెరిలైజేషన్ ఆపరేషన్ ఎక్కువమంది ఆడవారే చేయించుకుంటున్నారని డాక్టర్ రష్మితా ఇన్​స్టాగ్రామ్ వీడియో షేర్ చేశారు. 97 శాతం మంది ఆడవారు ఈ ఆపరేషన్ చేయించుకుంటే.. కేవలం 2 లేదా 3 శాతం మంది మాత్రమే స్టెరిలైజేషన్ చేయించుకుంటున్నారంట. ఇంతకీ ఈ స్టెరిలైజేషన్ అంటే ఏమిటి? పిల్లలు పుట్టకుండా ఆడవారు, మగవారు చేయించుకునే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం.

స్టెరిలైజేషన్ 

పిల్లలు పుట్టకుండా శాశ్వతంగా నిరోధించే వైద్య ప్రక్రియను కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ను స్టెరిలైజేషన్ అంటారు. ఇది రెండు విధాలుగా ఉంటుంది. మగవారికి అయితే వాసెక్టమీ (Vasectomy) ఆడవారికి ట్యూబెక్టమీ (Tubectomy) అనే ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్ ఎవరు చేయించుకోవడం ఈజీనో.. ఈ రెండు ప్రాసెస్​ ఎవరు చేయించుకుంటే బెస్టో చూసేద్దాం. 

Continues below advertisement

మగవారికి చేసే వాసెక్టమీ 

వాసెక్టమీ అనేది చాలా చిన్న సర్జరీ. దీనిలో భాగంగా మగవారి ప్రైవేట్ పార్ట్​కి చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. వీర్యకణాలు వెళ్లే నాళాలను కట్ చేసి క్లోజ్ చేస్తారు. ఈ ప్రక్రియ కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది. పెద్దగా కట్స్ ఉండవు. కాబట్టి త్వరగా రికవరీ అవుతారు. రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇది చాలా సేఫ్, సింపుల్ ప్రాసెస్‌గా వైద్యులు చెబుతున్నారు.

ఆడవారికి ట్యూబెక్టమీ 

ట్యూబెక్టమీలో భాగంగా.. ఫలోపియన్ ట్యూబ్స్‌ను కట్ చేసి బ్లాక్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇది పెద్ద సర్జరీగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేసేందుకు వెన్నుపూసకు అనస్థీషియా ఇస్తారు. అలాగే కట్ చేసి ఆపరేషన్ చేస్తారు కాబట్టి రికవరీకి కొంత సమయం పడుతుంది. అలాగే కొంత రిస్క్ ఉంటుంది. 

ఎవరు చేయించుకుంటే మంచిది?

నిపుణుల ప్రకారం మగవారు వాసెక్టమీ చేయించుకుంటే సింపుల్, సేఫ్, త్వరగా పూర్తైపోతుంది. అలాగే తర్వాత శృంగార జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆడవారికి చేసే ట్యూబెక్టమీ కొంచెం కాంప్లికేటెడ్​గా చెప్తారు. మెడికల్‌గా చూస్తే మగవారు వాసెక్టమీ చేయించుకోవడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. కానీ ఈ విషయంపై సరైన అవగాహన లేక ఆడవారే ఎక్కువగా చేయించుకుంటున్నారని అంటున్నారు. 

అలాంటి వారికి నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే.. కుటుంబ నియంత్రణ అనేది ఇద్దరి బాధ్యతగా తీసుకోవాలని.. ఎవరికి సౌకర్యంగా ఉంటుందో, ఆరోగ్యపరంగా సేఫ్‌గా ఉంటుందో కలిసి నిర్ణయం తీసుకుని అప్పుడు ఈ ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.