పెదవులు పొడిబారడం, తల తిరగడం, అలసటగా అనిపించడం, శరీరంలోని శక్తి మొత్తం ఆవిరైపోతున్న ఫీలింగ్.. ఇవన్నీ ప్రాణాంతకమే. ఎందుకంటే, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అది చివరికి ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి, ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకుని.. ఈ వేసవిలో జాగ్రత్తగా ఉండండి.
శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే కీళ్లు, కళ్లు లూబ్రీకేటెడ్ గా ఉంటాయి. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. వ్యర్థాలు, టాక్సిన్స్ సమయానికి శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. చర్మం ఆరోగ్యంగా నునుపుతేలి ఉంటుంది. మెదడు పనితీరు బావుండి ఎల్లప్పుడు చురుకుగా ఉంటారు. ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు తగ్గి మరింత ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడుతుంది.
అయితే తగినన్ని నీళ్లు తాగకపోయినా లేక ద్రవపదార్థాలు తగినన్ని తీసుకోకపోయినా శరీరంలో ఏంజరుగుతుంది? హైడ్రేటెడ్ గా ఉండేందుకు మార్గాలెమిటి? అనే విషయాల గురించి నిపుణులు ఎలాంటి విషయాలు చెబుతున్నారో తెలుసుకుందాం.
డీహైడ్రేషన్ అంటే ఏమిటి?
మన శరీరంలో తగినన్నంత ఫ్లూయిడ్ లేకపోతే కలిగే మార్పులను డీహైడ్రేషన్ అంటారు. దాహంగా అనిపిస్తుంది అంటే శరీరంలో డీహైడ్రేషన్ ప్రక్రియ స్వల్పంగా మొదలైందని అర్థం. అయితే వయసు మళ్లే కొద్దీ దాహంగా అనిపించే సెన్స్ తగ్గిపోతుంటుంది. అలాంటపుడు గుర్తుపెట్టుకొని నీళ్లు తాగుతుండాలి. పెద్ద వాళ్లు మన ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి తరచుగా నీళ్లు తాగమని గుర్తుచేస్తుండాలి. లేదంటే వారు డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
శరీరంలో తగినన్ని నీళ్లు లేకపోతే పోషకాలు శరీరం అంతటా ప్రసరించడం, శరీర ఉష్టోగ్రత నియంత్రణ ఉండకపోవడం, మూత్రం చిక్కబడడం వంటి జరుగుతాయి. ఇది ఇలాగే ఎక్కువ కాలం పాటు కొనసాగితే మూత్రపిండాల్లో రాళ్ల వంటి సమస్యలు కూడా రావచ్చు.
నీళ్లు అంత ముఖ్యమా?
మన శరీరంలో 60 శాతం నీటితో ఉంటే, మెదడు 70 నుంచి 75 శాతం వరకు నీటితోనే ఉంటుంది. మనం ప్రతి క్షణం ఎంతో కొంత నీటిని శరీరం నుంచి కోల్పోతూనే ఉంటాము. ఊపిరి పీల్చుకున్నపుడు, చెమట ద్వారా, మల మూత్ర విసర్జన ద్వారా, ఏడ్చినపుడు ఇలా నీరు రకరకాల కారణాలతో బయటకు పోతూనే ఉంటుంది. మానసికంగా స్పష్టంగా ఉండడం నుంచి బీపీ, కిడ్నీల ఆరోగ్యం వరకు అన్నింటికి నీళ్లు అవసరమే. అందుకే శరీరంలో నీటి నిల్వలు ఎప్పుడూ తగ్గనివ్వ కూడదు.
ఎన్ని నీళ్ల తాగాలి?
ఒక వ్యక్తి కి సగటున రోజుకు 1.8 నుంచి 2 లీటర్ల వరకు నీటి అవసరం ఉంటుంది. వ్యాయామం మరింత చేసేవారు లేదా రోజువారీ పనులలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవారు మరింత ఎక్కువ నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా స్టీమ్ బాత్ లు స్పాలు వినియోగించే వారు కూడా తప్పకుండా మరింత ఎక్కువ నీరు తాగాల్పి ఉంటుంది. వాతావరణం వేడిగా ఉండే రోజుల్లో రోజుకు తప్పకుండా మూడు లీటర్ల వరకు నీళ్లు తాగాలి.
చిన్న పిల్లలకు 1.2 నుంచి 1.5 లీటర్ల వరకు నీళ్లు తాగాల్సిన అవసరం ఉంటుంది. 13,14సంవత్సరాల వయసు నుంచి పెద్ద వాళ్లు తాగిన మొత్తంలోనే నీళ్లు తాగాల్సి ఉంటుంది.
డీహైడ్రేషన్ లక్షణాలు
అలసటగా ఉండడం, నోరు, పెదవులు పొడిబారడం, డీహైడ్రేషన్ ఎక్కువైతే కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఏం తాగాలి?
నీళ్లు లేదా హెర్బల్ టీలు మంచివి. నీళ్లే మరింత రుచిగా తాగాలని అనుకుంటే కొద్దిగా పుదినా ఆకులు, కాస్త బెర్రీలు, సిట్రస్ పండ్ల ముక్కుల కలుపుకుని తాగవచ్చు. ఒకటి రెండు చుక్కల స్క్వాష్ కూడా కలుపుకోవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండేందుకు నీటివినియోగం పెంచడం ముఖ్యం. కెఫిన్ పరిమికి మంచి తీసుకోకూడదు. ఇది మూత్ర విసర్జన ను పెంచుతుంది. ఫలితంగా శరీరంలో నుంచి నీరు వేంగంగా బయటకు వెళ్లిపోతుంది. సూపులు, కూరగాయాలు, పండ్ల ముక్కలు కూడా కూడా తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండొచ్చు.
ఎప్పుడు నీళ్లు తాగాలి?
కాస్త దాహంగా అనిపించినా సరే వెంటనే నీళ్ల లేదా మరేదైనా లిక్విడ్ ఫూడ్ తీసుకోవడం అవసరం అని గుర్తించాలి. దాహం అన్నింటికంటే ముందుగా కనిపించే డీహైడ్రేషన్ లక్షణం అని మరచిపోవద్దు.