Morning Habits to Boost Your Mind and Body : ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తారు కానీ.. రోజుని యాక్టివ్‌గా ఉంచుకోలేరు కొందరు. బెడ్‌పై నుంచి దిగినా.. మైండ్ ఇంకా నిద్ర దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. దీంతో వారు రోజంతా మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టే ఉంటారు. లేదంటే ఏమి చేయకపోయినా అలసిపోయినట్లు ఫీల్ అవుతూ.. చేయాల్సిన పనిపై ఫోకస్ చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరా? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి.
చిన్న చిన్న మార్పులే జీవితంలో పెద్ద ఫలితాన్ని ఇస్తాయని గుర్తించుకోవాలి. అయితే ఈ చిన్న పనిని చేయడం కష్టంగా అనిపించొచ్చు. కానీ ఫాలో అయితే వర్త్ వర్మ వర్త్ అంటారు. మీ ఉదయాన్ని ప్రశాంతంగా.. రోజుని యాక్టివ్‌గా.. వర్క్‌లో ఫోకస్ ఉండేలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే ఈ 5 సింపుల్ టిప్స్‌ని ఫాలో అయిపోండి. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వాటి వల్ల కలిగే మార్పు ఏంటో చూసేద్దాం.
డోపమైన్ డిటాక్స్ (Dopamine Detox)
చాలామంది ఉదయాన్నే చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫోన్‌తో ప్రారంభిస్తారు. దీనివల్ల మీ మైండ్‌కి నిద్రలేచి ప్రాసెస్ అయ్యే టైమ్ ఉండదు. పైగా నెగిటివ్ ఆలోచనలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ. ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ జోలికి వెళ్లకుండా ఓ ఐదు నిమిషాలు నిటారుగా కూర్చోంది. మీ బ్రెయిన్ కామ్ అవ్వడానికి.. రోజుని ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు లేకుండా మొదలు పెట్టడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఏమి చేయకుండా రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది మీకు పాజిటివిటీని ఇచ్చి.. మెదడు రష్ అవ్వకుండా క్లియర్‌గా ఉండేలా హెల్ప్ చేస్తుంది.
హైడ్రేషన్ (Hydration Boost)
మీ డేని కాఫీ, టీలతో ప్రారంభించే బదులు.. ఓ పెద్ద గ్లాసు నీటితో ప్రారంభించండి. కుదిరితో దానిలో ఓ చిటికెడు ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకుని తాగొచ్చు. ఇది మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. నిద్ర తర్వాత శరీరానికి కావాల్సిన హైడ్రేషన్‌ని అందించి యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. రాగి గ్లాసులో రాత్రంతా నీరు ఉంచి ఉదయం తాగినా మంచిదే.
సూర్యకాంతి.. (Natural Light Exposure)
నిద్రలేచిన తర్వాత చాలామంది రూమ్‌లోనే ఉంటారు. అలా కాకుండా.. సహజమైన కాంతి కోసం బాల్కనీలోకి వెళ్లాలి. కనీసం ఇంటి నుంచి బయటకు వస్తే సహజమైన సూర్యకాంతి మీ సొంతమవుతుంది. ఓ పదినిమిషాలు సూర్యరశ్మిని తీసుకోండి. దీనివల్ల సిర్కాడియన్ రిథమ్ రెగ్యులేట్ అవుతుంది. సంతోషాన్ని ఇచ్చే డోపమైన్ హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది మీ డేకి కిక్ స్టార్ట్ అని చెప్పవచ్చు.
ఒక్క మూమెంట్.. (Explosive Movement)
రోజూ ఒక హై ఇంటెన్సిటీ మూవ్ చేయండి. జంప్ స్క్వాట్, క్లాప్ పుష్ అప్ వంటివి చేయొచ్చు. కనీసం రోజుకు 10 నుంచి 15 సెకన్లు ఈ మూవ్స్‌లో ఏదొకటి చేయడానికి ట్రై చేయండి. రోజూ వ్యాయామం చేస్తే మరీ మంచిది. కానీ చేయడానికి సమయం దొరకని వాళ్లు కనీసం రోజులో బాడీ మొత్తాన్ని కదల్చగలిగే ఒక్క మూమెంట్ చేస్తూ ఉండండి. మీ ఎనర్జీ రీసెట్ అవుతుంది. బ్రెయిన్‌కి ఆక్సిజన్ అంది యాక్టివ్‌గా ఉంటారు.
కోల్డ్ షాక్ (Cold Shock Reset)
వీలైనంత వరకు ఉదయాన్నే ఫ్రెష్ అయి.. స్నానం చేసేయండి. చాలామంది రిలాక్స్ అవ్వడం కోసం వేడి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. మీరు కూడా అలాంటి వారు అయితే.. చివర్లో మాత్రం చల్లని నీటిని ఒంటిపై పోసుకోండి. దీనిని కోల్డ్ షాక్ అంటారు. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మైండ్, బాడీ రెండూ యాక్టివ్ అవుతాయి.
ఇవన్నీ చాలా సింపుల్ టిప్స్. కానీ రోజూ చేస్తూ ఉంటే మీలోని మార్పులు కచ్చితంగా మీకు తెలుస్తాయి. మీ బెటర్ వెర్షన్‌ని చూసుకోవాలనుకుంటే రోజూ వీటిని ఫాలో అవ్వండి. పనిపై ఫోకస్ పెరగడంతో పాటు.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. శారీరకంగా, మానసికంగా హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయడానికి ఇవి బేబి స్టెప్స్ అనుకోండి. మంచి ఫలితాలు తప్పక వస్తాయి.