Solar eclipse of April 8, 2024 : మార్చి 25వ తేదీన చంద్రగ్రహణం అయిన రెండోవారానికి సంపూర్ణ సూర్యగ్రహణ జరుగుతోంది. అంటే ఏప్రిల్ 8, 2024న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అసలు సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏమిటి? దీనిని చూడవచ్చా? భారత్​పై దీని ప్రభావం ఉంటుందా? ఇప్పుడు జరిగే సూర్యగ్రహణం గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


సంపూర్ణ సూర్యగ్రహణం..


చంద్రుడు.. భూమికి, సూర్యునికి మధ్య స్థానంలో ఉన్నప్పుడు దాని నీడ భూమిపై పడుతుంది. దీనినే సూర్యగ్రహం అంటారు. సూర్యగ్రహణాల్లో వివిధ రకాల గ్రహణాలు ఉంటాయి. పాక్షిక గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా సూర్యుని కాంతిని నిరోధించలేదు. దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుని వెలుతురు భూమిపై పడకుండా.. చంద్రుడు పూర్తిగా అడ్డుకుంటాడు. సూర్యునికి ఎదురుగా చంద్రుడు ఉన్నప్పుడు ఉపరితలం మొత్తాన్ని కవర్ చేయదు. అప్పుడు అగ్నివలయం కనిపిస్తుంది. దీనిని హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటారు. దీనిని అరుదైన సూర్యగ్రహణంగా చెప్తారు. 


సూర్యగ్రహణం అమావాస్య సమయంలో మాత్రమే జరుగుతుంది. NASA ప్రకారం ప్రతి సంవత్సరం రెండు నుంచి ఐదు సూర్యగ్రహణాలు ఉంటాయి. అయితే ప్రతి గ్రహణం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. చాలా గ్రహణాలు ఒకే ప్రదేశం నుంచి పాక్షికంగా కనిపిస్తాయని నాసా తెలిపింది. సగటున ఒకే స్థలం నుంచి రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించడానికి సుమారు 375 సంవత్సరాలు గడిచిపోతాయని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ కూడా కావొచ్చని పేర్కొంది. అయితే ఈసారి ఆసక్తికరంగా యూఎస్​లోని అనేక ప్రాంతాల గుండా వెళ్తోంది. 2017, 2023 కూడా అక్కడ గ్రహణాలు కలిగాయి. 


ఫుడ్ తినొచ్చా? 


గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవాలా? వద్దా అనేది చాలామందిలో ఉండే అపోహ. అయితే ఆ సమయంలో తయారు చేసి ఉన్న ఆహారంపై రేడియేషన్ ప్రభావం ఉంటుందని.. అది విషపూరితంగా మారుతుందనే అపోహ ఉంది. అందుకే కొందరు గ్రహణం సమయంలో ఫుడ్ తినరు. నాసా ఈ అపోహను తొలగించడానికి ఎప్పటినుంచే ప్రయత్నిస్తుంది కానీ.. కొందరిలో ఎలాంటి మార్పు లేదు. 


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. 


చంద్రగ్రహణం చూసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనవసరం లేదు కానీ.. సూర్యగ్రహణం చూడాలనుకుంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోలార్ వ్యూయర్​ని చూపించగలిగే హ్యాండ్ హెల్డ్​ర్స్ ఎంచుకోవాలి. ఎక్లిప్స్ గ్లాసెస్​లో చూడవచ్చు. ఇవి సన్​గ్లాసెస్​ కంటే భిన్నంగా ఉంటాయి. ఫోటోగ్రాఫర్​లు గ్రహణం సమయంలో సూర్యుడిని కెమెరా లెన్స్​తో చూడకూడదని నాసా పేర్కొంది. అలాగే చూడలనుకునేవారు టెలిస్కోప్, బైనాక్యులర్​లు లేదా ఏదైనా ఆప్టికల్స్ ద్వారా ఎక్​లిప్స్ అద్దాలు పెట్టుకుని చూడాలని తెలిపింది. లేదంటే.. కళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 


2079 వరకు చూడలేమా?


ఈ సోలార్ ఎక్లిప్స్​కి ఓ ప్రత్యేకత ఉంది. నయాగరా జలపాతం నుంచి వెళ్లే ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన కాకుంటే.. దీనిని చూసేందుకు 2079వరకు వేచి చూడాలి. అయితే ఇక్కడ సంపూర్ణ గ్రహణం లేదని 90 శాతం మాత్రమే ఉందని చెప్తున్నారు. 


భారత్​పై దీని ప్రభావముందా?


సూర్యగ్రహణం పూర్తిగా టెక్సాస్ మీదుగా యూఎస్​లోకి ప్రవేశించి ఈశాన్య దిశగా సాగుతుంది. యూఎస్ నుంచి మైనే ద్వారా వెళ్లిపోతుంది. అయితే దీనిప్రభావం ఇండియాపై లేదని చెప్తున్నారు నాసా పరిశోధకులు. యూఎస్​లో డే టైమ్ అంటే.. ఇక్కడ నైట్​ అవుతుంది కాబట్టి.. ఇండియాపై దాని ప్రబావం ఉండదంటున్నారు. 


Also Read : అబార్షన్ చేయించుకోవడమంటే మానవ హక్కులను ఉల్లంఘించడమే.. గర్భస్థ శిశువులను చంపే హక్కు ఎవరికీ లేదు