Solar Eclipse of April 8 2024 : సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడుతుంది. ఉగాదికి ముందు రోజు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో చాలామంది ఈ ఎఫెక్ట్ పండుగపై ఉంటుందనే అనే కన్​ఫ్యూజన్​లో ఉన్నారు. మరి దీని ఎఫెక్ట్ నిజంగానే పండుగపై ఉంటుందా? పండుగకు సంబంధించిన పనులు గ్రహణం రోజు చేసుకోవచ్చా? చేసుకోకూడదా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంపూర్ణగ్రహణం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఫ్యాక్ట్స్​పై కూడా ఓ లుక్కేద్దాం. 


ఉగాదిపై ప్రభావం ఉందా?


ఉగాదిపై ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నకు.. అలాంటి ప్రభావాలు ఏమాత్రం లేదని పురోహితులు చెప్తున్నారు. అసలు గ్రహణం ఎఫెక్ట్ ఇండియాపై లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది కేవలం ఉత్తర అమెరికాలోనే జరుగుతుందని.. ఆ సమయంలో ఇండియాలో రాత్రి కాబట్టి.. దానికి సంబంధించిన ఎలాంటి ప్రభావం పండుగపై కానీ.. ఇండియాపై కానీ ఉండదని చెప్తున్నారు. పండుగకు సంబంధించిన పనులను బేషుగ్గా చేసుకోవచ్చని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదంటున్నారు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణంపై శాస్త్రవేత్తలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇలాంటి సూర్యగ్రహణం ఏడు సంవత్సరాలలో అమెరికాలో ఎక్కడ జరగలేదని.. పైగా ఇలా సూర్యగ్రహణాన్ని చూసేందుకు మరో రెండు దశాబ్దాలు ఆగాల్సి ఉంటుందని చెప్తున్నారు. 


పట్టపగలే.. చిమ్మచీకట్లు.. అంతా సూర్యగ్రహణం ఎఫెక్టే


ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో గ్రహణం ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో పగటిపూటే చిమ్మచీకట్లు అలుముకుంటాయని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనివల్ల కొద్ది నిమిషాలు చీకటిగా ఉంటుందని.. ఇది జంతువులను గందరగోళానికి గురిచేస్తుందని తెలిపారు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు అక్కడి గవర్నమెంట్ పర్యాటకులకు వివిధ సౌకర్యాలు అందిస్తుంది. అమెరికాలో సంపూర్ణ గ్రహణాన్ని మళ్లీ చూడాలంటే 2024వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పుడు ఉన్న సూర్యగ్రహణం అంత ఎఫెక్ట్ ఉండదట. ప్రస్తుత సూర్యగ్రహణానికి ముందు 2017లో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినట్లు నాసా తెలిపింది. 


సురక్షితంగా ఎలా చూడాలంటే.. 


పాక్షిక సూర్య గ్రహణాల మాదిరిగా కాకుండా.. సంపూర్ణ గ్రహణం చూసేందుకు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అలా చూడటం వల్ల చూపు కోల్పోయే ప్రమాదం లేనప్పటికీ.. నేరుగా చూడటం, సూర్య కిరణాలు వల్ల రెటీనాకు కొంత నష్టం ఉండొచ్చు. కాబట్టి సరైన కళ్లద్దాలు ధరించి.. దీనిని వీక్షించవచ్చు. సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్​ను మీరు పెట్టుకోవచ్చు. 


ఆ మూఢ నమ్మకాలు పెట్టుకోవద్దు


గ్రహణం సమయంలో రేడియేషన్ వల్ల ఫుడ్ విషపూరితమవుతుందనే వాదనలను శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు. అలా అయితే ఆరుబయట పొలాల్లో ఉండే ఫుడ్ కూడా విషం కావాలి కదా అని అడుగుతున్నారు. రేడియేషన్ ప్రభావం ఉంటుంది కానీ.. ఫుడ్​ పాయిజన్ కాదు అని చెప్తూ.. గ్రహణాల సమయంలో ఫుడ్​ని ఆరుబయటకు తెచ్చుకుని.. గ్రహణాన్ని చూస్తూ తింటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రహణాన్ని చూస్తే అపశకునమనే ఆలోచన తీసేయాలి అంటున్నారు. అలాగే గ్రహణం అంటే చెడుకు సంకేతమని, గర్భిణీ స్త్రీలపై ప్రభావం ఉంటుందని కొందరు భావిస్తారు. ఇవి కూడా అవాస్తవాలేనంటూ వాటిని ప్రజలు నమ్మవద్దని చెప్తున్నారు. 


Also Read : ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం.. ఆ ప్రాంతంలో మళ్లీ దీనిని చూడాలంటే 2079 వరకు ఆగాలట