వర్నమెంట్ జాబ్ కొట్టేసి.. కాళ్ల మీద కాళ్లు వేసుకుని పనిచేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలు.. ఇక లైఫ్ సెటిలైపోయినట్లేనని కలలుగనేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ, అది అంత ఈజీ కాదని తెలిసిందే. ఈ రోజుల్లో చిన్న ఉద్యోగాన్ని కూడా కోట్లు వెచ్చించి, పలుకబడిని ఉపయోగించి సొంతం చేసుకుంటున్నారు. దీంతో ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రకటన చేసేసరికి.. వయస్సు కూడా మీదపడిపోతుంది. నోటిఫికేషన్ పడినా.. ఆ జాబ్స్ వారికి వస్తాయో, లేదో కూడా తెలీదు. అందుకే, చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ బతికేస్తున్నారు. 


అయితే, TCS (Tata Consultancy Services)లో ఉద్యోగాలు.. గవర్నెమెంట్ జాబ్‌కు ఏ మాత్రం తీసిపోవంటూ ఒకరు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ‘ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఉద్యోగం టీసీఎస్’ అనే క్యాప్షన్‌తో ఒకరు.. ప్రభుత్వ కార్యాలయాలు, టీసీఎస్ ఆఫీస్‌కు మధ్య ఉండే సారూప్యాన్ని తెలియజేస్తూ ఈ పోస్ట్ చేశాడు. 


‘‘నేను ప్రస్తుతం టీసీఎస్‌లో పనిచేస్తున్నా. దీని గురించి నేనే బాగా చెప్పగలను’’ అంటూ ఈ కింది పాయింట్స్ చెప్పాడు. 
1. టాటా కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించనంత వరకు మీ ఉద్యోగం సేఫ్. 
2. మీకు సమయానికి జీతం వస్తుంది.
3. మీ పని, ప్రతిభ ఆధారంగా మీ మేనేజర్ మిమ్మల్ని జడ్జ్ చేయడు. 
4. మీరు ఇతర అంశాలపై దృష్టిపెట్టేందుకు కావలసినంత సమయం మీకు దొరుకుతుంది. ఆఫీసులో CAT ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నవారిని కూడా చూశా. 
5. మీరు ఎలాంటి ప్రొడెక్టివ్ వర్క్ చేయకపోయినా మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటారు. (మీ మేనేజర్‌తో మీకు ఉన్న రిలేషన్‌షిప్‌పై ఇది ఆధారపడి ఉంటుంది). 
6. అన్‌లిమిటెడ్ లంచ్, చాయ్ బ్రేక్స్ ఉంటాయి. 
7. అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే.. మీకు ఇల్లు కంటే టీసీఎస్ ఆఫీస్ సదుపాయంగా ఉంటుంది. నాకు కూడా అదే అభిప్రాయం ఉంది.
8. మీరు రూల్స్ బ్రేక్ చేయనంత వరకు.. మీరు ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. 
9. ‘‘నా సొంత ఇంట్లో కంటే.. ఆఫీస్‌లో ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉంటున్నా’’ అని మా మెనేజర్ చెబుతుంటారని పేర్కొన్నాడు. 


అయితే, టీసీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు కొందరు దీన్ని కండించారు. అందులో పేర్కొన్నవన్నీ అసత్యాలని, టీసీఎస్‌లో పని చాలా హార్డ్‌గా ఉంటుందని అన్నారు. బహుశా, కొన్ని ప్రాజెక్టుల్లో చేసేవారికి అలా ఉండి ఉండవచ్చు. కానీ, ఎక్కువమంది గ్యాప్ లేకుండా పనిచేస్తూనే ఉంటారని అంటున్నారు. అందుకే మేము ఇండియన్ టెక్ కంపెనీల్లో.. అన్ని మెట్రిక్‌లలో నంబర్ వన్‌గా ఉండగలుగుతున్నామని అంటున్నారు. ఇలాంటి అవాస్త ప్రచారాలను నమ్మొద్దని అంటున్నారు. అది కూడా నిజమే. ఎవరో ఏదో పోస్ట్ చేశారని, అందులో అంతా ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవడం పొరపాటే. ఏ ఉద్యోగంలో ఉండే కష్టం ఆ ఉద్యోగంలో ఉంటుంది.






Also Read: లేజీ ఫెలో, చెప్పులేసుకోడానికి బద్దకమేసి ఏం చేశాడో చూడండి
Also Read: ఈ ఇల్లు వరదల్లో మునగదు, చుక్క నీరు కూడా ఇంట్లోకి చేరదు