Tips to Boost Active Mornings : రాత్రి త్వరగా పడుకున్నా.. ఆలస్యంగా నిద్రపోయినా.. ఉదయాన్నే నిద్రలేవాలంటే మాత్రం చాలామందికి కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్ తర్వాత మార్నింగ్ నిద్రలేవడమంటే సాహసమనే చెప్పాలి. బెడ్ నుంచి కిందకి దిగాలన్నా మూఢ్ కూడా రాదు. ఆఫీస్‌లకు, స్కూల్‌కి వెళ్లేవారికి ఇది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. కాసేపు పడుకొని నిద్ర లేవాలనుకుంటే టైమ్ అయిపోతుంది. దానివల్ల పనులు ఆలస్యమవుతాయి.
ఈ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది. పనులు యాక్టివ్‌గా చేయలేరు. ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అన్నట్టు ఉంటారు. ఇవన్నీ కాకుండా ప్రొడెక్టివ్గా రోజును ప్రారంభించుకోవాలనుకుంటే నిద్రమత్తును ఉదయాన్నే వదిలించుకోవాలి. అసలు నిద్రమత్తుకు కారణాలు ఏంటో గుర్తించి.. వాటిని కంట్రోల్ చేస్తూ.. కొన్ని టిప్స్ ఫాలో అయితే దీనిని దూరం చేసుకోవచ్చు.
నిద్రమత్తుకు గల కారణాలివే..
లైఫ్‌స్టైల్ : రాత్రి నిద్రవేళ ఎక్కువగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వంటివి నిద్రపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవి స్లీపింగ్ షెడ్యూల్‌ని డిస్టర్బ్ చేసి.. నిద్రమత్తును పెంచుతాయి.
స్లీపింగ్ షెడ్యూల్ : నిద్రపోవడానికి ఓ షెడ్యూల్ అంటూ లేకుంటే ఈ నిద్రమత్తు సమస్య బాధిస్తూ ఉంటుంది. లేట్ షిఫ్టులలో వర్క్ చేయడం, పడుకునే ముందు స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల సిర్కాడియన్ రిథమ్ నెగిటివ్‌గా ఎఫెక్ట్ అవుతుంది.
క్వాలిటీ స్లీప్ : నాణ్యమైన నిద్రలేకపోవడం, రాత్రి నిద్ర కలతగా ఉండడం వల్ల కూడా మార్నింగ్ ఇబ్బందిగా ఉంటుంది. పడుకున్నది తక్కువే అయినా క్వాలిటీ స్లీప్ బాగుంటే నిద్ర మత్తు ఉండదు.
నిద్ర లేమి : తగినంత నిద్రలేకపోవడం, నిద్ర సమస్యలు ఉన్నవారికి ఉదయాన్నే నిద్రమత్తు ఎక్కువగా ఉంటుంది. స్లీపింగ్ డిజార్డర్స్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగానే ఉంటుంది. కానీ పడుకున్నా ఉదయం నిద్ర రాదు.
మెడికల్ సమస్యలు : స్లీప్ ఆప్నియా, హైపోథైరాయిడిజం, రక్తహీనత వంటి కొన్ని మెడికల్ కండీషన్స్ వల్ల పగలు కూడా నిద్ర సమస్య వేధిస్తూ ఉంటుంది. స్లీపింగ్ పిల్స్, యాంటిడిప్రెసెంట్ మెడిసిన్స్ నిద్ర నాణ్యతతో పాటు.. నిద్ర మత్తుపై ఎఫెక్ట్ చూపిస్తాయి.
నిద్రమత్తును ఇలా దూరం చేసుకోండి..
స్నూజింగ్ : చాలామంది చేసే అతిపెద్ద కామన్ మిస్టేక్ ఏంటి అంటే.. అలారం బటన్ని స్నూజ్ చేసి మళ్లీ పడుకుంటారు. కానీ మీరు ఓ టైమ్‌కి లేవాలనుకుంటే.. అలారం మోగిన వెంటనే.. దానిని ఆపేసి నిద్రలేవండి. ఇలా స్నూజ్ చేస్తూ పడుకోవడం వల్ల మీ బ్రెయిన్ ఆ కలత నిద్రకు అలవాటై డే అంతా నిద్రమత్తులో ఉండేలా చేస్తుంది.
మార్నింగ్ రొటీన్ : ఉదయాన్నే నిద్రలేచేందుకు ఓ మోటివ్ పెట్టుకోండి. వ్యాయామం, ధ్యానం, బుక్ రీడింగ్ వంటివి చేస్తే.. మీ శరీరం యాక్టివ్ అవుతుంది. వ్యాయామం చేయడం వల్ల ఎనర్జీ వస్తుంది. దీనివల్ల నిద్రమత్తు వదిలి మార్నింగ్ రొటీన్ ఇంప్రూవ్ అవుతుంది.
సూర్యకాంతి : డోర్స్ వేసుకుని.. డార్క్ రూమ్స్‌లో ఉంటే నిద్రమత్తు ఎక్కువైపోతుంది కాబట్టి.. సన్లైట్కి శరీరం ఎక్స్పోజ్ అయ్యేలా చూడండి. డోర్స్ ఓపెన్ చేసి సూర్యకాంతి లోపలికి వచ్చేలా చూసుకోండి. లేదా మీరే బయటకాసేపు ఉండే.. ఫ్రెష్ గాలి పీల్చుకోండి. దీనివల్ల సిర్కాడియన్ రిథమ్ యాక్టివ్ అవుతుంది. మత్తు వదులుతుంది.
హైడ్రేషన్ : ఉదయాన్నే ఓ గ్లాసు నీటిని తాగండి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా మీరు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. గోరువెచ్చని నీటిని మలాసనంలో తాగితే మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ట్యాపింగ్ : మీ శరీరాన్ని యాక్టివ్ చేసేందుకు మీ చేతులతో ముఖాన్ని, తలను, మీ శరీరాన్ని చిన్నగా టాప్ చేస్తూ యాక్టివ్ చేయండి. తల నుంచి పాదాల వరకు సున్నితంగా టాప్ చేస్తూ ఉంటే.. నిద్రమత్తు ఈజీగా వదులుతుంది.
బ్రేక్‌ఫాస్ట్ : హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి. ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కెఫిన్‌కు దూరంగా ఉండండి. ముఖ్యంగా రాత్రుళ్లు దీనిని అస్సలు తీసుకోకూడదు.
స్లీప్ షెడ్యూల్ : ఉదయాన్నే అలారం మోగినవెంటనే నిద్రలేవడం ఎంత ముఖ్యమో.. రాత్రుళ్లు రోజూ ఓ టైమ్‌కి పడుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి స్లీపింగ్ షెడ్యూల్‌ని ఫాలో అవ్వండి. దీనివల్ల మీ బ్రెయిన్‌కి ఓ టైమ్‌కి పడుకోవడం ఓ టైమ్‌కి నిద్రలేవడం అలవాటు అవుతుంది. కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.
స్లీప్ క్వాలిటీ : నిద్రనాణ్యతను పెంచుకునేందుకు రాత్రుళ్లు స్క్రీన్స్ చూడడం తగ్గించండి. రిలాక్స్‌ని అందించే టెక్నిక్స్‌ని ఫాలో అవ్వండి. పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే ఫుడ్ తీసుకోవడం ఆపేయండి.
ఇవన్నీ ఫాలో అవుతున్నా నిద్రమత్తు వదలట్లేదు.. నిద్ర సమస్యలు పోవట్లేదు అంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించండి. ఎందుకంటే ఈ సమస్య లాంగ్ రన్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ వర్క్‌పై ఎఫెక్ట్ చూపిస్తుంది.
Also Read : వేగంగా నడిస్తే బరువు తగ్గుతారా లేదా వెనక్కి నడిస్తే చేస్తే మంచిదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే