ఆఫీసులో పని చేసో, ఇంట్లో పని చేసో చక్కగా పడుకుందాం అని మంచం మీదకి వెళ్తాం. కొంతమంది వెంటనే నిద్రపోతారు. కానీ, కొంతమందికి నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. అలా నిద్రపట్టని వాళ్ల కోసమే ఈ చిట్కాలు. 


* పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.


* నిద్ర రావడానికి కూడా ఓ చక్కని టీ వచ్చింది. అదే బనానా టీ. అరటిపండుతో ఈజీగా చేసుకొనే ఈ టీని రాత్రి పడుకునే ముందు తాగితే చాలు.. మీరు కంటినిండా నిద్ర పోవచ్చు.


* గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.
 
* ముందుగా ప్రశాంతంగా ఉండేలా మీ బెడ్ రూంలో ఏర్పాట్లు చేసుకోవాలి. బెడ్ షీట్లు, దిండు, బెడ్ రూం లైటింగ్, దుప్పట్లు లాంటివి మీకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.


* చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. 


* నిద్రపోయే ముందు సిగిరేట్ తాగడం, టీ, కాఫీ తాగకూడదు. కెఫిన్ పదార్థాలు నిద్రను దూరం చేస్తాయని.. సాధ్యమైనంతవరకూ వాటికి దూరంగా ఉండాలి. 
 
* చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. 
 
* రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.


* రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి.


* వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది. 


* చిలకడదుంపలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిలోని న్యూట్రిన్స్.. ప్రశాంతంగా నిద్రపట్టడానికి కారణమౌతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు వీటిని తినడం మంచిది.


* నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది.
 
* రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. 


* చమేలీ టీకి.. బెడ్ టైమ్ డ్రింక్ గా మంచి పేరు ఉంది.  ఇది యాంక్సైటీని తగ్గించి.. ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేస్తుంది. చాలా మంది పడుకునే ముందు టీ, గ్రీన్ టీ లాంటివి తాగుతుంటారు. దానికి బదులు ఈ చమేలీ టీ తాగడం వల్ల ప్రశాంతగా నిద్రపడుతుందట.
 
* ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.