వయస్సు పెరిగే కొద్ది.. కొత్త కొత్త వ్యాధులు మనల్ని పలకరిస్తుంటాయి. కొన్ని అలా వచ్చి.. ఇలా పోతే. మరికొన్ని మాత్రం తిష్ట వేస్తాయి. వీటిలో కొన్నింటిని ముందుగా కనిపెట్టలేం. బాగా ముదిరిన తర్వాతే తెలుస్తుంది. కాబట్టి, 40 ఏళ్లు దాటిన తర్వాత ఏడాదిలో ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇక వయస్సుతోపాటు ముదిరే మతిమరపు వ్యాధిని కూడా ముందుగానే తెలుసుకుని అప్రమత్తం కావచ్చు. ఇందుకు చిన్న ఆన్‌లైన్ బ్రైన్ టెస్ట్ సరిపోతుంది. అదెలాగో చూడండి. 


ఈ టెస్ట్‌ను ‘ది థింక్ బ్రైన్ చెక్ ఇన్’ అని అంటారు. దీనికి కేవలం పది నమిషాల సమయం పడుతుంది. మీలో మెరుగు పరుచుకోవాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటే మీరు రిస్క్‌లో ఉన్నారని అర్థం. పైబడుతున్న వయసుతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. అల్జీమర్స్ కు సంబంధించిన పరిశోధనల్లో ఉన్న నిపుణులు చెప్పిన దాన్ని బట్టి మనం తీసుకునే ఆహారం ఇతర విషయాలు 40 శాతం వరకు డిమెన్షియా సమస్య మీద ప్రభావం చూపుతాయని తేలింది. సోషల్ ఐసోలేషన్ వల్ల డిమెన్షియా రిస్క్ పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒంటరితనం కూడా ఇందుకు ఒక కారణమట.


ఈ పరీక్షలో మొదటి భాగంలో మెదడుకు పని కల్పించే పనులు మీరు ఎంత తరచుగా చేస్తారు వంటి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో చదవడం, ఏదైనా వాయిద్యం వాయించడం, పజిల్ సాల్వ్ చెయ్యడం వంటివి ఉంటాయి. క్రమం తప్పకుండా ఇలాంటి బ్రైన్ చాలెంజింగ్ ఆక్టివిటి తప్పనిసరి. ఇలాంటి చాలెంజెస్ డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారించడం మాత్రమే కాదు అప్పటి వరకు ఏదైనా చిన్నపాటి నష్టం వాటిల్లినా తిరిగి కోలుకునేందుకు దోహదం కూడా చేస్తాయి.


ఆ తర్వాత నిద్రకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువ కాలం పాటు నిద్ర పొయ్యే అలవాటు డిమెన్షియాకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరి భాగంలో మీ మానసిక ఆరోగ్యానికి మీరు తీసుకునే జాగ్రత్తలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో స్థాయిలో మీరు ఎన్ని సార్లు మిత్రులను కలుస్తుంటారు, లేదా మాట్లాడుతుంటారు వంటి ప్రశ్నలు ఉంటాయి.


ఈ టెస్ట్ లో సాధారణంగా అడిగే ప్రశ్నలు



  • చివరి సారిగా ఎప్పుడు బీపీ చెకప్ చేసుకున్నారు?

  • చివరి సారిగా ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకున్నారు?

  • ఎంత తరచుగా మద్యం తీసుకుంటారు?

  • మీరు ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నారు? ఎంత రేటింగ్ ఇస్తారు?

  • మీరు వారంలో ఎన్ని సార్లు శ్రమతో కూడిని వ్యాయామం చేస్తారు?


పరీక్ష చివరిలో మీకు పర్సనలైజ్డ్ ప్లాన్ ఇస్తారు. దీని సాయంతో మీరు మీ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.  ఉదాహరణకు మీరు నిద్రకు సంబంధించిన సమస్యల్లో ఉంటే అందుకు ఉపయోగపడే చిట్కాలు, ఉపాయాలు చెబుతారు.


అల్జీమర్స్ ప్రమాదంలో ఉన్న వారిలో కేవలం 30 శాతం మందికి మాత్రమే వ్యక్తి స్థాయిలో ఈ రిస్క్ నుంచి బయటపడటం గురించి అవగాహన ఉందట. కొంత మందిలో జన్యు కారణాలు ఉంటాయి. ఈ సమస్య రావడానికి ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియా రిస్క్ ను సవరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.


డిమెన్షియా కారణాల్లో దాదాపు 12 కారణాలను సవరించడం ప్రస్తుతం వీలవుతుందని నిపుణులు అంటున్నారు. డిమెన్షియా కు సంబంధించిన అన్ని లక్షణాలను తప్పకుండా తెలుసుకోవాలి. రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటిని త్వరగా గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలి.



  • జ్ఞాపక శక్తి తగ్గడం

  • ఏకాగ్రత తగ్గడం

  • రోజు వారీ పనుల్లో సైతం కన్ఫ్యూస్ కావడం

  • మాటల్లో సరైన పదం గుర్తురాక ఇబ్బంది పడడం

  • సమయం, స్థలం గుర్తించడంలో ఇబ్బంది పడడం

  • త్వరత్వరగా మూడ్ మారిపోవడం


ఈ లక్షణాలు చిన్నవిగా చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కాలం గడిచే కొద్దీ తీవ్రం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్థాయిలోనే జాగ్రత్త పడడం అవసరం.


Also read: ఈ ఆహారాలను రోజూ తింటే మీరు త్వరగా ముసలివాళ్లు కారు










































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.