Lifestyle Changes for High Blood Pressure : హై బీపీ లేదా అధిక రక్తపోటు అనేది ఎందరినో సైలెంట్​గా ఇంపాక్ట్ చేస్తుంది. అయితే దీనిని కంట్రోల్ చేసుకునేందుకు వైద్యులు సూచించే మందులు ఉపయోగించడంతో పాటు.. లైఫ్​స్టైల్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేదంటే బీపీ గుండె సమస్యలు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలను పెంచి.. ప్రాణాంతకమవుతుంది. అయితే లైఫ్​స్టైల్​లోని కొన్ని మార్పులు, ఇంటి చిట్కాలు, ఫుడ్ విషయంలో కొన్ని టిప్స్ పాటిస్తే రక్తపోటు కొంతవరకు సహజంగా కంట్రోల్ చేయవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

వ్యాయామం.. 

రోజూ వ్యాయామం చేయండి. దీనివల్ల గుండె స్ట్రాంగ్ అవుతుంది. బీపీ ఎఫెక్ట్ గుండెపై తగ్గుతుంది. గుండె బలంగా ఉంటే రక్తాన్ని పంపించడానికి తక్కువ ఒత్తిడి పడి బీపీ తగ్గుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక లేదా యోగా చేస్తే మంచిది.

ఉప్పు

ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిల్వ ఉంచి బీపీని పెంచుతుంది. కాబట్టి ఉప్పు తగ్గిస్తే రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

Continues below advertisement

మద్యం 

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బీపీ పెరుగుతుంది. మద్యం తగ్గిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడి రక్తపోటు స్థిరంగా ఉంటుంది. స్మోకింగ్ పూర్తిగా మానేస్తే గుండెపై ప్రెజర్ భారీగా తగ్గుతుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. 

కాఫీ 

కాఫీ, టీ వంటి పానీయాల్లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలికంగా బీపీని పెంచుతుంది. కాఫీ తగ్గించడం లేదా మానేయడం వల్ల బీపీ స్పైక్స్ తగ్గుతాయి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలను రిలాక్స్ చేసి బీపీ తగ్గించడంలో సహాయపడతాయి. కానీ ఎక్కువగా కాకుండా చిన్న మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. 

బరువు తగ్గండి 

అధిక బరువు ఉన్నవారికి బీపీ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గితే గుండెపై ఒత్తిడి తగ్గి బీపీ సహజంగా తగ్గుతుంది. కేవలం 5 నుంచి 10 శాతం బరువు తగ్గినా మంచి ఫలితం కనిపిస్తుంది.

వెల్లుల్లి 

వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే పదార్థం రక్తనాళాలను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే బీపీ తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

నిమ్మరసం 

నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే రక్తనాళాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అందుకే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి రోజూ ఉదయం తాగడం మంచిదిగా చెప్తారు. 

ఆకుకూరలు 

పాలకూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు అయినా ఆకుకూరలు తినాలి.

అరటి పండు

అరటిపండులో ఉన్న పొటాషియం బీపీని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అందుకే రోజుకు ఒక అరటిపండు తీసుకోవడం మంచిది. ఇది అలసటను దూరం చేసి వెంటనే ఎనర్జీ ఇస్తుంది. 

ధ్యానం & యోగా 

స్ట్రెస్ ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం. అలాగే ఒత్తిడి బీపీని కూడా రెట్టింపు చేస్తుంది. కాబట్టి రోజూ 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం లేదా యోగా చేస్తే రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.

ఈ ఇంటి చిట్కాలు అన్నీ.. బీపీని కంట్రోల్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్​గా ఫాలో అయితే అధికరక్తపోటు అదుపులో ఉంటుంది. అంతే కానీ ఇవి బీపీని పూర్తిగా తగ్గించవు. కాబట్టి వైద్యుని సూచనలు, వారు సూచించిన మందులు తప్పక ఫాలో అవ్వాలి. అలాగే బీపీ మందులు వైద్యుల సలహా లేకుండా మానకూడదు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.