వేసవిలో ఏం తినాలి, ఏం తినకూడదని తెలుసుకోవాలి. లేదంటే కొన్ని ఆహార పదార్థాలు శరీరానికి వేడి కలిగిస్తాయి. అందుకే వేడి ఉష్ణోగ్రత సమయంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే చలువ చేసే పోషకాహారం, ద్రవాలు తీసుకోవాలి. వేసవిలో చాలా మంది గుడ్లు తినకుండ ఉంటారు. అవి వేడి చేస్తాయని చెప్తుంటారు. కానీ పోషకాలు నిండిన గుడ్లు తినకుండా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు. వాటిని తినేందుకు సమయం ఉంది. గుడ్లు అత్యంత బహుముఖ ప్రయోజనాలు అందించే ఆహారం.  ప్రోటీన్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కండరాల బలాన్ని అందిస్తాయి. మెదడు, ఆలోచనా పనితీరుని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అయితే వేసవిలో గుడ్లు తీసుకోవడం సురక్షితమేనా? అంటే నిపుణులు సమాధానం ఏంటో తెలుసా?


జీర్ణసమస్యలు కలిగిస్తాయ్


వేడి, తేమతో కూడిన వాతావరణంలో గుడ్లు తినడం వల్ల కలిగే ప్రభావం ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు వ్యక్తులు వేడి వాతావరణంలో గుడ్లు తినడం వల్ల అసౌకర్యంగా లేదా జీర్ణ సమస్యలు కలిగిస్తుందని చెప్తుంటారు. అటువంటి సమయంలో అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం నివారించడం ఉత్తమం. ఇది జీవక్రియ సమస్యల్ని ప్రేరేపిస్తుంది. కొంత ప్రోటీన్ పొందాలని అనుకుంటే గుడ్డులోని తెల్లసొన లేదంటే ఏదైనా మొక్కల ఆధారిత ప్రోటీన్ తీసుకోవడం మంచిది.


అపోహ


చాలా మంది గుడ్లు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య వస్తుందని నమ్ముతారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని అనుకుంటారు. అయితే గుడ్లు తీసుకోవడం వల్ల హెచ్డీఎల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ స్థాయిలను పెంచవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కానీ నిజానికి ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.


ఎప్పుడు తినాలి?


గుడ్లు వెచ్చని శక్తిని కలిగి ఉంటాయి. అలాగే పోషకాలతో నిండి ఉంటుంది. ఐరన్ అందిస్తుంది. గుడ్డులో విటమిన్ ది పుష్కలంగా ఉంటుంది. కాల్షియం శోషణ పెంచుతుంది. వేసవిలో రెండు కంటే ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల పేగు కదలికలకు ఆటంకం ఏర్పడుతుంది. శరీరంలో అధిక వేడి ఏర్పడటానికి దారి తీస్తుంది. జీవక్రియ ఆరోగ్యంపై గుడ్ల పడకుండా ఉండాలంటే వాటిని తీసుకునేందుకు అనువైన సమయం ఉంటుంది. బరువు తగ్గించుకోవాలని గుడ్లు తినాలని అనుకుంటే ఉదయం పూట వాటిని తినడం మంచిది. ఇది పోషకాలని బాగా గ్రహించి సంతృప్తిని అందిస్తుంది. కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ తో కలిపి గుడ్లు తీసుకుంటే శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.


అందుకే అల్పాహారం సమయంలో గుడ్లు తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం. అటువంటి సమయంలో ఆహారం జీవక్రియ చేయడానికి తక్కువ అవకాశం ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: సహజ ప్రోటీన్ Vs కృత్రిమ ప్రోటీన్స్, వీటిలో ఏది ఆరోగ్యకరం


Join Us on Telegram: https://t.me/abpdesamofficial