శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. మరి మీరు ప్రోటీన్ తింటున్నారా? తాగుతున్నారా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఎందుకంటే ఆహార పదార్థాల ద్వారా కొంతమంది ప్రోటీన్ పొందుతారు. ఇంకొంతమంది ప్రోటీన్ షేక్స్ ఇతరత్రా ద్వారా తీసుకుంటారు.సహజమైన, కృత్రిమమైన ఏ రూపంలోనైనా ప్రోటీన్ శరీర సాధారణ విధులు నిర్వహించడానికి అవసరం. వయసు, బరువు, లింగం, శారీరక శ్రమ స్థాయిని బట్టి వ్యక్తి ప్రోటీన్ అవసరం మారుతూ ఉంటుంది. పెద్దలకు 46-63 గ్రాములు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు 65 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరి.


సహజ ప్రోటీన్ మూలాలు, ప్రోటీన్ సప్లిమెంట్స్( పౌడర్, రసాలు, షేక్స్) రెండూ పూర్తి ప్రోటీన్లు. కానీ వాటి పోషకాహార ప్రొఫైల్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రోటీన్ సప్లిమెంట్లు మాక్రోన్యూట్రీయెంట్లు. అవి 18-25 గ్రాముల ప్రోటీన్ ను అందిస్తాయి. కొవ్వు, కార్బోహైడ్రేట్, విటమిన్లు, ఖనిజాలు ఏవీ ఉండవు. ఎందుకంటే ఇవి ప్రాసెస్ చేసినవి. సహజ ప్రోటీన్లు ప్రాసెస్ చేయబడవు. కానీ కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు కొంతవరకు ఉంటాయి. ఈ పోషకాలు శరీరాన్ని క్రియాత్మకంగా ఉంచుతాయి. కణజాలాలు రిపేర్ చేయడం, బరువు నిర్వహణ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కండరాలని నిర్మించడానికి అవసరమైన మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ప్రోటీన్ ను ఇస్తుంది. కొన్ని సార్లు అమైనో ఆమ్లాలు అందించలేకపోవచ్చు. సహజ ప్రోటీన్ మూలాలు జంతు ఆధారితమైనవి.


ప్రోటీన్ సప్లిమెంట్స్


ఇవి కృత్రిమమైనవి. అవసరమైన పరిమాణంలో అమైనో ఆమ్లాలను అందిస్తాయి. ప్రోటీన్ రసాలు సులభంగా జీర్ణమవుతాయి. అంతే కాదు ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే చాలా ప్రోటీన్ సప్లిమెంట్లలో కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్ ఉంటాయి. ఇవి శరీరానికి హానికరం. ప్రోటీన్ సప్లిమెంట్లు అతిగా తీసుకుంటే దీర్ఘకాలికంగా అనేక సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణ సమస్యలు, వికారం, ఉబ్బరం మొదలైన సమస్యలు వస్తాయి. అందుకే మంచి బ్రాండ్ ప్రోటీన్ సప్లిమెంట్ ఎంచుకోవడం ముఖ్యం.


ఈటింగ్ ప్రోటీన్ Vs డ్రింకింగ్ ప్రోటీన్?


ప్రోటీన్ సప్లిమెంట్లు కండరాలని నిర్మించేందుకు మాత్రమే సహాయపడతాయని అనుకుంటారు. ఇవి రోజువారీ ప్రోటీన్ అవసరాలని తీరుస్తాయి. ప్రతి ఒక్కరికీ ప్రోటీన్ సప్లిమెంట్ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆహారం ద్వారా మాత్రమే రోజువారీ ప్రోటీన్ అవసరాలు తీర్చుకోవాలంటే కాస్త సవాలుతో కూడుకున్న విషయం. ఇది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. అటువంటి సమయంలో ప్రోటీన్ సప్లిమెంట్లు ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉంటాయి. ఎక్కువ శ్రమ ఉండడు. ప్రత్యేకించి ప్రయాణంలో లేదా ప్రోటీన్ అధికంగా ఉండే భోజనం సిద్ధం చేసుకునేంత టైమ్ లేనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల ఫిట్ నెస్ లక్ష్యాలని సులభంగా సాధించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: అమెజాన్ అడవుల్లో ఆ చిన్నారులను 40 రోజులు బతికించిన ఆహారం ఇదే - ఎంత ఆరోగ్యకరమో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial