Signs of Ageing: "వాడేంటో అప్పుడే బట్టతల వచ్చేసింది. ఇంత తొందరగా ముసలాడు అయిపోయాడు" అని కామెంట్స్ చేస్తుంటారు. కొందరైతే మరీ దారుణంగా బాడీషేమింగ్ చేస్తారు. రియాల్టీ ఏంటంటే ప్రతి ఒక్కరూ లైఫ్‌లో ముసలోళ్లు అవుతారు. కానీ...అందరికీ ఈ వృద్ధాప్యం రెండు సార్లు వస్తుందట. ఇటీవల జరిగిన ఓ రీసెర్చ్‌లో ఇదే విషయం వెల్లడైంది. సాధారణంగా రిటైర్ అయ్యే ఏజ్ వస్తే అప్పుడు ముసలితనం వచ్చేసినట్టు భావిస్తుంటాం. కానీ...అంత కన్నా ముందు నుంచే మన శరీరంలోని కణాల్లో శక్తి తగ్గిపోతుంది. Nature Ageing జర్నల్ ఈ నిజాన్ని తేల్చి చెప్పింది. వేలాది మందిపై పరిశోధనలు చేసి మరీ ఈ రిపోర్ట్ విడుదల చేసింది.
25-75 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ల శరీరాల్లోని కణాల పని తీరుని ట్రాక్ చేశారు. ఆ క్రమంలోనే చాలా మందిలో 44 ఏళ్ల నుంచే కణాల్లో వృద్ధాప్య ఛాయలు కనిపించడం మొదలైంది. 60 ఏళ్లకు పూర్తి స్థాయిలో వృద్ధాప్యం వచ్చేసిందని గుర్తించారు. అంటే దాదాపు రెండు సార్లు ముసలితనం వచ్చేసినట్టే లెక్క. ఇలా శరీరంలోని కణాల్లో శక్తి మెల్లగా తగ్గిపోవడాన్ని linear ageing గా చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా 40 ఏళ్లు వచ్చాక మహిళల్లో మెనోపాజ్ ఆగిపోతుంది. అప్పటి నుంచే వాళ్లకు వృద్ధాప్యం వచ్చినట్టు పరిగణిస్తారు. అయితే...పురుషుల్లోనూ 40 ఏళ్లు దాటాక ఇదే పరిస్థితి వస్తున్నట్టు ఈ పరిశోధన వెల్లడించింది.
44 ఏళ్లకే వృద్ధాప్యం..
44 ఏళ్లకు ఎప్పుడైతే వృద్ధాప్యం మొదలవుతుందో అప్పటి నుంచి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. మద్యం సేవించే వాళ్లకు ఈ ముప్పు మరింత ఎక్కువ. ఇదే వయసులో మిగతా వ్యాధులు వచ్చేందుకూ ఆస్కారముంటుంది. 40-59 మధ్య వయసున్న వాళ్లలో 40% మందికి హార్ట్ అటాక్‌లు వచ్చే అవకాశముందని వివరించింది. 60 ఏళ్లు దాటాక ఈ రిస్క్ 75% వరకూ పెరుగుతుందని తేల్చి చెప్పింది. సరిగ్గా ఇదే వయసులో పార్కిన్‌సన్, అల్జీమర్స్ లాంటి వ్యాధులూ అటాక్ చేసే ప్రమాదముంది. 40 ఏళ్లు దాటగానే కొందరిలో చర్మం ముడతలుబడిపోతుంది. అదే వృద్ధాప్యానికి సంకేతం. ఈ వయసులోనే మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. గాయాలైతే అవి మానడానికీ చాలా సమయం పడుతుంది. (Also Read: Happy Independence Day 2024 : స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో షేర్ చేసుకునేందుకు బెస్ట్ కోట్స్ ఇవే)
వృద్ధులు పెరిగిపోతున్నారు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..అంతర్జాతీయంగా 40 ఏళ్లకే వృద్ధాప్యం వస్తున్న దాఖలాలు పెరుగుతున్నాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. 2019లో 60 ఏళ్లకు వృద్ధాప్యం వచ్చిన వాళ్ల సంఖ్య 100 కోట్లుగా ఉండగా 2030 నాటికి ఇది 140 కోట్లకి, 2050 నాటికి 200 కోట్లకు చేరుకుంటుందని WHO అంచనా వేసింది. ఇలా 40 ఏళ్లకి ముసలితనం వచ్చేయడాన్ని సైంటిఫిక్‌గా suddenly ageing గానూ పిలుస్తున్నారు. తీసుకునే ఆహారంలో పోషకాలు తక్కువగా ఉంటే వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుందని మరి కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి.
Also Read: Jackfruit Health Benefits: నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే పనసను డైట్లో చేర్చుకోండి