Happy Birthday Samantha Puth Prabhu Fitness Tips : సమంత రూత్ ప్రభు ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటుంది. సమంత సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయిన్స్​లో ఒకరిగా ఇమేజ్ సంపాదించుకుంది. 2010లో ఏమి మాయ చేశావే సినిమాతో తెలుగులో హీరోయిన్​గా కెరీర్​ను ప్రారంభించి.. ఇప్పటికీ తన హవా కొనసాగిస్తుంది. మొదటిసినిమాతోనే ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈభామ.. తెలుగు, తమిళం భాషల్లో దశాబ్ధానికి పైగా తన నటనతో ఫ్యాన్స్​ను అలరిస్తూ వస్తుంది. ప్రొఫిషనల్​గా, పర్సనల్​గా ఎన్నో స్ట్రగుల్స్​ని ఫేస్​ చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతరులకు రోల్​ మోడల్​గా నిలిచింది. కేవలం నటన, వ్యక్తిత్వంలోనే కాదు.. ఫిట్​నెస్​ విషయంలో కూడా సమంత తనదైన గోల్స్ సెట్ చేస్తూ ఉంటుంది. 


సమంత ఏ విషయంలో రాజీపడినా.. తన ఫిట్​నెస్ విషయంలో రాజీపడదు. ఆ విషయం తనని ఫాలో అయ్యోవారికి కచ్చితంగా తెలుస్తుంది. హీరోయిన్​గా కొనసాగాలంటే ఫిట్​గా, అందంగా కనిపించడమనేది ఓ బాధ్యత. కానీ వాటిని బాధ్యతగానే తీసుకుంటే ఎక్కువకాలం వాటిని మెయింటైన్ చేయలేరు. దానిని ఒక లైఫ్​స్టైల్​గా మార్చుకుంటే.. దాని ఫలితాలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి. ఈ సిద్ధాంతాన్నే తన జీవితంలో అప్లై చేసింది ఈ స్టార్ హీరోయిన్. 


రెగ్యూలర్ వ్యాయామాలు ఇవే..


తాజాగా ఓ ఇన్​స్టాపోస్ట్​లో ఆమె వయసు 36 అయినా.. బయోలాజికల్ ఏజ్ 23 అని.. బరువు 50.1 కిలోలుగా పేర్కొంది. ఆమె ఫిట్​నెస్​ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆమె ఈ స్టేజ్​కి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనకు ఆటో ఇమ్యూన్ మైయోసిటిస్   వ్యాధి ఉన్నా.. ఎప్పుడూ తన వర్క్​అవుట్​ను గివ్​ అప్ చేయలేదు. సమంత ఎక్కువగా జంపింగ్, స్టాటిక్ స్క్వాట్స్, బర్ఫీలు, లైగ్ రైజర్స్, మౌంట్ క్లైంబ్స్ ఎక్కువగా చేస్తుంది. ఇవి కేలరీలను బర్న్ చేయడమే కాకుండా.. కండరాలకు మంచి బూస్ట్ ఇస్తాయి. మెటబాలీజంను పెంచుతాయి. పైగా వీటిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 




 


వెయిట్ లిఫ్టింగ్​ ఎక్కువగా చేస్తుంది.. ఎందుకంటే?


యోగాకూడా సమంత జీవితంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. కేవలం యోగానే కాకుండా ఏరియల్ యోగాకు కూడా ఆమె ప్రాధాన్యం ఇస్తుంది. ఇది తను మానసికంగా స్ట్రాంగ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుందని సమంత తెలిపింది. సమంత ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. తన ఫిట్​నెస్ లైఫ్ స్టైల్ ప్రారంభించినప్పటినుంచి సమంత వెయిట్స్​పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇవి శరీరాన్ని టోన్ చేసి.. సరైన ఆకృతిలో ఉండేలా చేస్తాయని తెలిపింది. అంతేకాకుండా కండర ద్రవ్యరాశి పెరిగి.. ఎముకలు, కీళ్లు బలంగా మారుతాయి. మెటబాలీజంను పెంచుతాయి కాబట్టి.. మీ విశ్రాంతి తీసుకుంటున్నా కేలరీలను బర్న్ చేయవచ్చు. సైక్లింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఫుడ్ విషయంలో కూడా రాజీపడదు. స్వీట్స్ చాలా తక్కువగా తీసుకుంటుంది. వెజిటెబుల్స్​ని ఎక్కువగా తన డైట్​లో తీసుకుంటూ ఉంటుంది సమంత. ఇవన్నీ విషయాలు ఆమె ఫిట్​గా, మానసికంగా హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేశాయని తెలిపింది సమంత. 


Also Read : శరీరంలోని ఈ భాగాల్లో వాపు? జాగ్రత్త, మీ లివర్ ప్రమాదంలో పడినట్లే!