దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సామ్ వరుసపెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది. ఎప్పుడూ సన్నగా మల్లెతీగలా నాజూకుగా కనిపించే సామ్ గురించి ప్రతీ విషయం ఆసక్తికరంగానే ఉంటుంది. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. భయంకరమైన మయోసైటిస్ వ్యాధి బారిన పడి క్షేమంగా కోలుకుని ఎందరికో స్పూర్తిగా నిలిచింది. ఈ వ్యాధి నుంచి ఆమె కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది సామ్ ఫాలో అయ్యే డైట్ విధానమే.


సామ్ శాఖాహారి. కరోనా సమయంలో తన ఇంటి మీద టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్న వీడియోస్ కూడా గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తనే స్వయంగా పండించుకుని తినేది. ఒకసారి అభిమానులతో మాట్లాడినప్పుడు సామ్ తను ఫాలో అయ్యే డైట్ గురించి చెప్పుకొచ్చింది. ‘నేను శాఖాహారిని, మాంసాహారం తీసుకొను. కేవలం కూరగాయలు మాత్రమే తీసుకుంటాను. అన్నం ఎంతో ఇష్టంగా తింటాను’ అని చెప్పుకొచ్చింది. సామ్ ఫిట్ నెస్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందుకు ఆమె జిమ్ లో పడే కష్టమే చెప్తుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు సామ్ తీసుకున్న ఆహార పదార్థాల జాబితా ఇక్కడ ఉంది.


కొల్లాజెన్ షేక్


పోషకమైన ఆకు కూరలు, ఫ్రీజింగ్ అరటి పండు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, చియా విత్తనాలు, అవిసె గింజలు, శాఖాహార కొల్లాజెన్ పౌడర్ కలిపి ప్రోటీన్ షేక్ చేసుకుంటుంది. ఈ కొల్లాజెన్ షేక్ సామ్ పొద్దున్నే తీసుకుంటుందట. ఇవన్నీ ఆరోగ్యకరంగా, ఫిట్ గా ఉండేందుకు దోహదపడేవి.


మాచా జీడిపప్పు వెన్న


మాచా అంటే గ్రీన్ టీ పౌడర్. యాంటాక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కేలరీలు చాలా తక్కువ. మాచా, జీడిపప్పు కలగలిసిన మిశ్రమం ఈ వెన్న. ఇది టోస్ట్ లేదా పాన్ కేక మీద రాసుకుని తింటుంది. కొవ్వులతో నిండిన వెన్నకు ఇది చక్కని ప్రత్యామ్నాయం.


వేగన్ ఐస్ క్రీమ్


ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సామ్ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. అయితే తను తీసుకునే ఐస్ క్రీమ్ కూడా వేగన్. అందరిలాగే తను కూడా తీపి తినేందుకు ఇష్టపడుతుంది. కానీ ఆరోగ్యంతో కూడిన ఐస్ క్రీమ్ తినేందుకు మొగ్గు చూపుతుంది. రుచికరమైన పండ్లతో ఈ వేగం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు.


మయోసైటిస్ వ్యాధి నుంచి సామ్ ఇంత త్వరగా కోలుకున్నారంటే అందుకు ప్రధానమైన కారణం ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంభించడమే. తను కనీసం డైరీ ఉత్పత్తులు కూడా తీసుకోదు. సామ్ సొంతంగా బాదం మిల్క్ తయారు చేసుకుని తాగుతుంది. తన గార్డెన్ లో పెంచిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటుంది.  


Also Read: టీతో మీరోజుని స్టార్ట్ చేస్తున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా?