Russian Security Guard | రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లోని యెల్ట్‌సిన్ సెంటర్‌లో అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లోని పెయింటింగ్‌‌లోని బొమ్మలకు కళ్లు పెట్టి చెడగొట్టిన సెక్యూరిటీ గార్డు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చాడు. ఆ పెయింటింగ్‌లను అలా ఎందుకు చేయాల్సింది వచ్చిందో చెప్పాడు. అతడు చెప్పినదాన్ని బట్టి చూస్తే.. ఇందులో తప్పులేదనిపిస్తోంది. అకతాయి విద్యార్థుల వల్లే అతడు అడ్డంగా బుక్కయ్యాడనిపిస్తోంది.  


ఏం జరిగింది?: ఆ ఎగ్జిబిషన్‌లో అన్నా లెపోర్స్కాయ అనే ఆర్టిస్ట్ గీసిన ‘త్రీ ఫిగర్స్’ అనే పెయింటింగ్ పెట్టారు. ఆ పెయింటింగ్‌లో ఉన్న ముగ్గురు మనుషుల బొమ్మలకు కళ్లు లేవు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్.. ఆ పెయింటింగులోని బొమ్మలకు కళ్లు పెట్టాడు. ఈ విషయం తెలిసి నిర్వాహకులు ఆ సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారు. ఆ పెయింటింగ్‌ విలువ సుమారు 740,000 పౌండ్లు (రూ.7.55 కోట్లు) ఉంటుందని అంచనా. చిత్రకారుడు అన్నా అంత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను అల్ఫా ఇన్సురెన్స్ కంపెనీలో భీమా చేయించాడు. 


ఆ సెక్యూరిటీ గార్డు నిర్వాకం వల్ల అది ఎందుకు విలువలేకుండా పోయింది. దీంతో దాన్ని మస్కోలోని రిస్టోరేషన్ ఎక్స్‌పర్ట్‌కు పంపించారు. కొద్దిగా కూడా ఆ పెయింటింగ్‌ను నష్టం వాటిల్లకుండా దాన్ని మళ్లీ పూర్వ స్థితికి తీసుకొచ్చారు. ఇందుకు 2,470 పౌండ్లు (రూ.2.52 లక్షలు) ఖర్చయ్యాయి. ఈ మొత్తాన్ని ఆ సెక్యూరిటీ గార్డు నుంచే వసూలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. 


Also Read: రూ.7 కోట్లు విలువ చేసే పెయింటింగ్‌‌కు కళ్లు గీసిన సెక్యూరిటీ గార్డు, పాపం జాబ్ పోయింది!


ఆ నిర్వాకానికి పాల్పడింది తానేనని అలెగ్జాండర్ వసిలీవ్ అనే 63 ఏళ్ల  మాజీ సైనికుడు మీడియా ముందుకు వచ్చాడు. సెక్యూరిటీ గార్డుగా తనకు అదే మొదటి రోజని చెప్పాడు. ఆ పెయింటింగ్‌ను అలా మార్చడానికి గల కారణాన్ని కూడా చెప్పాడు. ‘‘ఆ ఎగ్జిబిషన్‌లో పెట్టిన పెయింటింగ్స్ ఏవీ నాకు నచ్చలేదు. అవి చిన్న పిల్లలు గీశారేమో అని అనుకున్నాను. ఇందలో కొంతమంది విద్యార్థులు అక్కడికి వచ్చారు. ముగ్గురు కళ్లులేని మనుషుల పెయింటింగ్‌ను చూసి దీనికి కళ్లు ఎందుకు పెట్టలేదని అన్నారు. దీంతో ఆ పెయింటింగ్ గీసింది మీరేనా అని అడిగాను. ఇందుకు వారు అవునన్నారు. వాటికి కళ్లు ఉంటే బాగుండేదని అన్నాను. దీంతో వారు బాల్ పెన్ నా చేతికి ఇచ్చి మీరే పెట్టండని అన్నారు. సరే, వాళ్ల పెయిటింగే కదా అని ఆ బొమ్మలకు కళ్లు పెట్టా. ఆ తర్వాత ఆ పిల్లలు నన్ను చూసి నవ్వుకుంటూ పెళ్లిపోయారు. అప్పటివరకు వాటిని నేను పిల్లల పెయింటింగులే అనుకున్నా. అధికారులు నన్ను ప్రశ్నించేవరకు అవి ఖరీదైన పెయింటింగ్స్ అని నాకు తెలీదు’’ అని తెలిపాడు. పాపం, ఆ విద్యార్థుల ఆకతాయితనం వల్ల అలెగ్జాండర్ అడ్డంగా బుక్కైపోయాడు. ఉద్యోగాన్ని కోల్పోయాడు. 


Also Read: నగ్నంగా నిద్రపోతే ఇన్ని ప్రయోజనాలా? పరిశోధకులు ఏమంటున్నారు?