రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల వాసనలు వస్తుంటాయి. అది చెత్త వాసన కావచ్చు.. లేదా మంచి వాసన కావచ్చు. అయితే, ఈ రోడ్డు మీద ప్రయాణిస్తే మాత్రం మిమ్మల్ని మీరే మైమరిచిపోతారు. ఎందుకంటే ఈ రోడ్డు స్ట్రాబెర్రీ వాసనను వెదజల్లుతుంది. అదేంటీ ఆ మార్గంలో ఏమైనా స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయా అనేగా మీ సందేహం? కానే కాదు.. ఈ వాసన వచ్చేది తారు రోడ్డు నుంచే. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, మీరు రష్యాలోని ఈ రోడ్డు గురించి తెలుసుకోవల్సిందే. 


తారు వాసన ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిందే ఆ వాసన వల్ల ఊపిరి ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా శ్రామికులు.. తారు రోడ్డు పనులు చేస్తుంటారు. అయితే, రష్యాలోని లెనిన్‌గ్రాడ్ ప్రాంతంలోని ఒక సంస్థ ఇటీవల స్ట్రాబెర్రీ-సువాసన గల తారును రూపొందించింది. ఆ తారుతో రోడ్డు వేస్తున్నప్పుడు ఆ వాసన గుప్పమని కొడుతుంది. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఆ మార్గంలో రోడ్డు నుంచి వాసన వస్తూనే ఉంటుంది. 


Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్‌’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!


ఈ మార్గంలో ప్రయాణికులకు ఎలాంటి దుర్వాసన రాకూడదనే ఈ ప్రయోగాత్మకంగా ఈ రోడ్డును వేశారు. కొత్తగా రోడ్డు వేసిన తర్వాత చాలా రోజులపాటు ఆ తారువాసన అలాగే ఉండిపోతుంది. వాహనదారులకు కూడా అది ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే, రోడ్డు నిర్మాణ సంస్థకు ఈ ఐడియా వచ్చింది. సేఫ్ హై-క్వాలిటీ రోడ్స్ నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగంగా జూన్ 30న లెనిన్‌గ్రాడ్‌లోని వ్సెవోలోజ్స్క్ జిల్లాలో 700 మీటర్ల పొడవైన రహదారిని నిర్మించారు. ఈ ప్రయోగం కోసం దాదాపు 300 టన్నుల స్ట్రాబెర్రీ-సువాసన గల తారు మిశ్రమాన్ని ఉపయోగించారు. అయితే, ఈ వాసన ఎన్ని రోజులు ఉంటుందనేది మాత్రం స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు మాత్రం హాయిగా స్ట్రాబేర్రీ వాసనను ఎంజాయ్ చేస్తున్నారు.  



Also Read: వృద్ధుడి వృషణాల నుంచి విజిల్స్, కారణం తెలిసి షాకైన డాక్టర్లు!