చాలా రోజుల తరువాత సమంత బయటి ప్రపంచంలోకి వచ్చింది. ఎప్పుడైతే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్టు సోషల్ మీడియా సాక్షిగా ప్రకటించిందో, అప్పట్నించి చికిత్స కోసం ఆసుపత్రుల్లోనే గడిపింది. ఆమె మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఆ రోగం సమంతను చాలా నీరసంగా మార్చేసిందని, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కూడా వచ్చిందని చాలా నివేదికలు చెప్పాయి. శాకుంతలం సినిమా కోసం సమంత బయటికి వచ్చింది. ఆమె ముఖంలోని నీరసం, కళా విహీనత మయోసైటిస్ ఆమెను ఎంతగా బాధపెట్టిందో అర్థమవుతోంది. తెల్లటి చీరలో దేవకన్యలా వచ్చిన సమంతా నడవడానికి ఇబ్బందిపడి, మధ్యలో వేరే వ్యక్తి చేయిని పట్టుకోవడం కూడా అభిమానుల కంట పడింది. ఆమె ఇంకా నీరసంగా ఉంది అని చెప్పడానికి అదే నిదర్శనం. 


కాగా శాకుంతలం ఈవెంట్లో ఆమె కుడిచేయికి రుద్రాక్ష మాలను చుట్టుకుని కనిపించింది.అది ఎంతో మందిని ఆకర్షించింది. ఆమె ఎందుకు రుద్రాక్ష మాల చుట్టుకుంది అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఆరోగ్యం బాగోకపోవడం వల్ల ఆధ్యాత్మిక బాటలోకి వెళ్లిందని కొందరు భావిస్తే, శాకుంతలం సినిమాలో ఆమె ధరించేవి అవే కాబట్టి, ప్రమోషన్ కోసం పట్టుకుని ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఆ రుద్రాక్ష మాలను ఆమె ఆరోగ్యం కోసమే చుట్టుకుందని తెలుస్తోంది. 


మానసిక శక్తి కోసం... 
హిందూ నమ్మకాల ప్రకారం రుద్రాక్షలకు చాలా శక్తి ఉంటుంది. వాటి నుంచి వచ్చే ప్రకంపనలు సానుకూలంగా ఉంటాయి.  రుద్రాక్ష మాల చేతికి కట్టుకున్న, మెడలో ధరించినా అవి దుష్ట శక్తుల నుంచి కవచంలా కాపాడతాయని పెద్దల నమ్మకం. రుద్రాక్షలు పరిస్థితులను తట్టుకునే మానసిక శక్తిని మనిషికి అందిస్తాయని అంటారు. వీటిని ధరించి మనస్సులోనే మంత్రాన్ని జపిస్తే వేయిరెట్లు ఫలితం వస్తుందని, మానసిక ప్రశాంతత లభిస్తుందని హిందూ పురాణాలలో ఉంది. రుద్రాక్ష మాలలో 108 రుద్రాక్షలు ఉంటాయి. మన శరీరంలో 72000 నాడులు ఉంటాయి. అందులో 108 గుండెకు (మనసుకు) సంబంధించినవి. అందుకే మనసుకు, రుద్రాక్ష మాలకు దగ్గర సంబంధం ఉందని అంటారు. రుద్రాక్ష మాల చేత పట్టి కాసేపు కూర్చున్నా చాలు మనసు ప్రశాంతంగా అనిపిస్తుందని, అలాంటి శక్తివంతమైన సంకేతాలను రుద్రాక్షలు ఇస్తాయని అంటారు. అధిక రక్తపోటు ఉన్న వారు రుద్రాక్షలను ధరిస్తే రక్తపోటు వేగం తగ్గుతుందని చెబుతారు. అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా రావని అంటారు. 






Also read: Stress: ఉద్యోగంలో ఒత్తిడి ఉందా? అయితే డిప్రెషన్ త్వరగా వచ్చేస్తుంది జాగ్రత్త