Benefits of Rice Water for Hair Fall Control : సీజన్ మారుతున్నప్పుడు జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు, జీవనశైలిలో మార్పులు వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఒత్తిడి, ఆందోళన బోనస్ అనే చెప్పాలి. ఎందుకంటే వీటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. జుట్టురాలడానికి రీజన్ ఏదైనా కావొచ్చు. కానీ వెంటనే వాటిని గుర్తించి.. కంట్రోల్ చేస్తే కచ్చితంగా హెయిర్ ఫాలో కంట్రోల్ అవుతుంది. అయితే ఇదే కాకుండా కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయినా కూడా జుట్టు రాలదంటున్నా జపనీస్. వాటిలో ఒకటి రైస్ వాటర్.
ఎన్నో ఏళ్లుగా బ్యూటీ, హెయిర్ బెనిఫిట్స్ కోసం రైస్ వాటర్‌ను ఉపయోగిస్తున్నారు. దీని జపాన్ వారి చూసి మిగిలిన వారు రైస్ వాటర్‌ను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిగురించి విస్తృత ప్రచారం జరుగుతుంది. రైస్ వాటర్ జుట్టుకుని చాలా మంచిదంటూ.. హెయిర్ ఫాలో కంట్రోల్ అయిందంటూ చాలామంది పోస్టులు పెట్టేస్తున్నారు. నిజంగానే రైస్ వాటర్‌తో అన్ని ప్రయోజనాలున్నాయా? అసలు దీనిని ఎలా వాడాలి. జుట్టుకు అప్లై చేయాలంటే రైస్ వాటర్‌ని ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు
రైస్ వాటర్‌లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మాత్రమే కాకుండా పలు రకాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది జుట్టుకు మంచి ప్రయోజనాలు ఇస్తుందట. దీనిలో ఇనోసిటాల్ ఉంటుంది. దీనినే విటమిన్ బి7 అని కూడా అంటారు. ఇది జుట్టుకు చాలా మంచిది. అంతేకాకుండా రైస్ వాటర్‌లోని ఫైబర్ స్కాల్ప్‌లోకి చొచ్చుకుపోయే సామార్థ్యాన్ని కలిగి ఉన్నాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. దీనివల్ల జుట్టుకు బలం అందుతుందట. అంతేకాకుండా మంచి మెరుపు, ప్రకాశవంతంగా మారుతుందట.
ఆ సమస్యలు కూడా దూరం
చుండ్రు సమస్యలను దూరం చేసుకోవడంలో కూడా రైస్ వాటర్ మంచి ప్రయోజనాలు చూపిస్తుంది. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. పొడవాటి జుట్టు కోరుకునేవారు దీనిని రెగ్యూలర్‌గా ఉపయోగిస్తే మంచిదట. రైస్ వాటర్ మాత్రమే కాకుండా గంజి కూడా జుట్టుకు మంచి ప్రయోజనాలు ఇస్తుందంట. జుట్టుకు హైడ్రేషన్‌ను అందించి పొడిబారడాన్ని, ఫ్రిజ్‌ను తొలగిస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలంటే..
అయితే ఈ రైస్ వాటర్‌ని బయటకొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక డబ్బాలో ముడిబియ్యాన్ని, పాలిష్ చేయని రైస్‌ను ఉంచి.. దానిలో నీళ్లు వేయాలి. బియ్యాన్ని బాగా కలిపి.. కంటైనర్‌ను మూసి 12 నుంచి 24 గంటలు అలాగే పులియబెట్టాలి. తర్వాత నీటిని వడకడితే అదే రైస్ వాటర్. ఆ బియ్యాన్ని మీరు వండుకోవచ్చు కూడా.
లేదంట్ రైస్ వండి.. వార్చిన గంజిని కూడా హెయిర్‌కి అప్లై చేయవచ్చు. గంజిని కూడా ఓ రోజంత పక్కన పెట్టేయాలి. అనంతరం జుట్టుకి అప్లై చేసి.. గంట తర్వాత వాష్ చేసేయాలి. వారానికి ఇలా రెండుసార్లు చేస్తే చాలు. జుట్టు విషయంలో మీరే మార్పులు చూస్తారు.
ఇలా స్టోర్ చేయండి
రైస్ వాటర్ లేదా గంజిని వినియోగించకపోతే మీరు వాటిని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వారం పాటు వీటిని ఉపయోగించుకోవచ్చు. స్ప్రే బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ప్రతి రోజు రాత్రి తలపై దీనిని స్ప్రే చేసుకోవచ్చు. తలస్నానం చేయకపోయినా పర్లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం పైసా ఖర్చులేని ఈ ప్రాసెస్‌ను మీరు కూడా ట్రై చేసి మంచి ఫలితాలు పొందేయొచ్చు.
Also Read : చర్మం డల్‌గా మారి.. జుట్టు ఊడిపోతుందా? శరీరంలో అది తక్కువైతేనే ఈ వృద్ధాప్యఛాయలు వస్తాయట