Jagadhatri  Serial Today Episode: షర్మిల టాగూర్‌ తాను పట్టుకున్న కాచి, బూచి, నిషికలను కౌషికి దగ్గరకు తీసుకొస్తుంది. వాళ్లను చూసిన కౌషికి షాక్‌ అవుతుంది. వీళ్లు ఇక్కడికి ఎలా వచ్చారని కోపంగా చూస్తుంది. దీంతో కౌషికిని చూసిన కాచి, బూచి, నిషికలు భయపడుతుంటారు. మరోవైపు ఫైల్‌ కోసం కేదార్‌, ధాత్రి వెతుకుతుంటారు. మరోవైపు  కౌషికి కోపంగా మీరిక్కడేం చేస్తున్నారు. అని అడగ్గానే


షర్మిల: మీతో పాటు మీ కారులోనే లోపలికి వచ్చారు. మనం ఇంటర్వూ చేస్తుంటే ఇదిగో ఈ కెమెరాతో రికార్డ్‌ చేస్తున్నారు.


కౌషికి: షర్మిల గారు చెప్పింది నిజమేనా? మీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఎవరికీ తెలియకుండా లోపలికి ఎందుకు వచ్చారు.


నిషిక: మిమ్మల్ని అడిగితే వద్దన్నారు. అందుకే మీకు తెలియకుండా వచ్చేశాము.


కౌషికి: ఆ కెమెరాలో అసలు ఏం షూట్‌ చేస్తున్నారు. అడుగుతుంది మిమ్మల్నే చెప్పండి


అని కౌషికి గట్టిగా అడగ్గానే  దివ్యాంక డబ్బులు ఇస్తానంటే అని కాచి చెప్తుండగానే కాచి చెంప పగులగొడుతుంది కౌషికి. దీంతో అందర్నీ తిడుతుంది. మీరు చేసింది ఎంత పెద్ద తప్పొ తెలుసా? అనగానే తప్పు కాదు కౌషికి అంటూ గట్టిగా అరుస్తుంది షర్మిల. ప్రమాదమైన పని కొంచెంలో నిషిక ప్రాణాలతో తప్పించుకుందని మీవాళ్లు కాకపోతే ఇప్పుడే షూట్‌ చేసేదాన్ని అంటుంది షర్మిల. కౌషికి ధాత్రి, కేదార్‌ లు ఎక్కడ అని అడుగుతుంది. వాళ్లు ఈ ఇన్సిడెంట్‌ కు సంబంధించిన స్టేట్‌మెంట్‌ రాస్తున్నారు. అని షర్మిల ఠాగూర్‌ చెప్తుంది. మరోవైపు ధాత్రి, కేదార్‌ ఫైల్‌ కోసం  జేసీబీతో  బావి తవ్విస్తుంటారు. ఇంకోవైపు బూచి మొత్తం ఊడుస్తుంటాడు. కాచి, నిషిక బెటాలియన్‌ లో వంట చేస్తుంటారు. బూచి కుంటుతూ షర్మిల దగ్గరకు వస్తాడు.


బూచి: మేడం వికలాంగుల కోటాలో పనిష్మెంట్‌ ఏమైనా తగ్గుతుందా? ఒక్కసారి నా పొజిషన్‌ చూసి క్షమించండి మేడం ఫ్లీజ్‌ మేడం.


షర్మిల: భలే టైంకి గుర్తు చేశావు. ఉదయ్‌ సార్‌ కు కన్సెషన్‌ ఇవ్వాలట. ఆ కారు క్లీనింగ్‌ అయ్యాక. మన వాళ్ల షూస్‌ ఉన్నాయిగా వాటన్నింటినీ పాలీస్‌ చేయమని చెప్పు. ఏం సార్‌ సరిపోతుందా?


బూచి: మేడం మీ స్కీం నాకు అర్థం అయిపోయింది. నాకేం వద్దు మీరు చెప్పిన పని బుద్దిగా చేసేసి వస్తాను.


 అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు ధాత్రి టెన్షన్‌ పడుతుంది.


కేదార్‌: ధాత్రి దొరుకుతుంది టెన్షన్‌ పడకు. ఆపు.. ధాత్రి ఫైల్‌..


ధాత్రి: ఇదే కేదార్‌ ఫైల్‌ ఇదే.. అమ్మా థాంక్యూ.. ఫైనల్లీ గాట్‌ ఇట్‌..


 అని ధాత్రి ఏడుస్తూ.. మా అమ్మ నిజాయితీని నిరూపించే సాక్ష్యం మా అమ్మ గురించి ప్రపంచానికి నిజం చెప్పే సాక్ష్యం. అంటూ ఎమోషనల్‌ అవుతుంది ధాత్రి. కేదార్‌ హ్యపీగా ఫీలవుతుంటాడు. ధాత్రి వాళ్ల అమ్మను అవమానించిన విషయం గుర్తు చేసుకుంటుంది.


కేదార్‌: ఊరుకో ధాత్రి. ఈ ఫైల్‌ లో నిజం ఉందో లేదో నీ బాధను తీరుస్తుందో లేదో నాకు తెలియదు కానీ నమ్మకాన్ని మాత్రం ఇస్తుంది.


ధాత్రి: అవును కేదార్‌ ఇరవై ఏళ్ల నా కష్టం. నా ఎదురు చూపులు ఏ ఫైల్‌.


అంటూ ఫైల్‌ ఓపెన్‌ చేసి  అందులో ఉన్న ఏదో లాంగ్వేజ్‌ చూసి అర్థం కావడం లేదని  ఇంకా ఓపెన్‌ చూడగానే అందులో కౌషికి వాళ్ల నాన్న ఫోటో కనిపిస్తుంది. దీంతో ఈ ఫోటో ఇక్కడ ఎందుకుందని ఆలోచిస్తారు. మా అమ్మ చావుకు పెద్దమామయ్య కు ఏదైనా లింక్‌ ఉంటుందా? అని అనుమానిస్తుంది ధాత్రి. కేదార్‌ అలా జరిగి ఉండదు అంటాడు. అసలు కారణం తెలుసుకోవాలి. అని ఇద్దరూ డిసైడ్‌ అవుతారు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?