బిగ్ బాస్ సీజన్ 8 లోని తాజా ఎపిసోడ్ డే 16లో జరిగిన బెలూన్ టాస్క్ క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టింది. బెలూన్ టాస్క్ లో సంచాలక్ గా సోనియా ఉండగా..  అభయ్, నిఖిల్ ఒకరితో ఒకరు పోటీ పడాల్సి వచ్చింది. దీంతో ముగ్గురి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఫలితంగా "నేను ఇప్పటి నుంచి ఏ గేమ్స్ ఆడను. నన్ను బయటకు పంపించాలంటే పంపించండి" అంటూ అభయ్ బిగ్ బాస్ పై ఫైర్ అయ్యాడు. 


చిచ్చురేపిన బెలూన్ టాస్క్ 
గత వీకెండ్ మంచి స్నేహితులైన అభయ్, నిఖిల్ ఇద్దరూ రెండు క్లాన్స్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య పోటీ వస్తే ఏం చేస్తారో చూడాలని అనుకున్న ప్రేక్షకుల కల ఎట్టకేలకు నెరవేరింది. తాజాగా లగ్జరీ రేషన్ కోసం బెలూన్ టాస్క్ లో పాల్గొన్నారు నిఖిల్, అభయ్. టాస్క్ లో భాగంగా అభయ్ ఒంటిపై ఆరెంజ్ కలర్ బెలూన్స్, నిఖిల్ ఒంటిపై వైలెట్ కలర్ బెలూన్స్ అంటించారు. అయితే ఇద్దరూ ఒకరి వంటి పైనున్న బెలూన్స్ ను మరొకరు పగలగొట్టాల్సి ఉంటుంది. బజర్ మోగే వరకు ఎవరి ఒంటిపై అయితే బెలూన్ ఉంటుందో వారే విన్నర్ అని ప్రకటించారు బిగ్ బాస్. దీనికి సంచాలక్ గా ఇటు నిఖిల్, అటు అభయ్ కి క్లోజ్ గా ఉండే సోనియాను నియమించారు. గేమ్ లో అభయ్ ఎన్నిసార్లు చెప్పినా "నా ఇష్టం నేను ఇలాగే ఆడతాను" అంటూ గీత దాటి వెళ్లడం, మధ్యలోనే నిఖిల్ బాట్ విరిగిపోవడం వంటి కొన్ని తప్పులు జరిగాయి. దీంతో మొత్తానికి ఈ టాస్క్ విన్నర్ గా నిఖిల్ క్లాన్ శక్తిని ప్రకటించాలని డిసైడ్ అయింది సోనియా. 


Read Also : Bigg Boss 8 Day 16 Promo 2: కొత్త లవ్ స్టోరీ, చిన్నోడికి యష్మి గౌడ - సీతతో నిఖిల్ పులిహోర... సోనియాతో ఇద్దరూ కటీఫ్ ?




బిగ్ బాస్ పై అభయ్ ఫైర్... 
అయితే ఈ విషయం గురించి ముందుగా అభయ్ సైలెంట్ గానే ఉన్నాడు. కానీ అతని టీంలో మణికంఠ, యష్మి గౌడ, ప్రేరణ, నబిల్ మాత్రం ఒంటిపై ఉన్న బెలూన్ లెక్క పెట్టాలి అంటే అభయ్ ఒంటి పైనే ఉంది, అంతే కాకుండా టాస్క్ ఆడుతున్నప్పుడు బెలూన్లను ఆ సర్కిల్లోకి పంపాలి. కానీ ఎందుకు పంపలేదు అంటూ సంచాలక్ పై విరుచుకుపడ్డారు. ఇక ఆ తర్వాత పలుమార్లు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా అభయ్ కూడా మరోసారి బుక్ తీసి రూల్స్ చదివి తమకేం అర్థమైంది అనే విషయాన్ని సంచాలక్ సోనియాతో పాటు నిఖిల్ కి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ సంచాలక్, నిఖిల్ కూడా ఒప్పుకోకపోవడంతో "ఆమె ఆల్రెడీ వాళ్ళు విన్నర్స్ అని ఫిక్స్ అయిపోయింది. నేను ఆమెను ఒక్క మాట కూడా అనను. కానీ ఇప్పటి నుంచి నేను ఒక్క గేమ్ ఆడను. కావాలంటే నన్ను బయటకు పంపించుకున్నా సరే బిగ్ బాస్" అంటూ ఫైర్ అయ్యాడు అభయ్. ఆ తర్వాత యష్మి గౌడ విష్ణు ప్రియతో కూర్చుని మళ్లీ చెప్పిందే చెప్పింది. అయితే సోనియా మాట్లాడదామని ట్రై చేసినా యాటిట్యూడ్ తో సమాధానం ఇస్తూ యష్మి కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ సోనియా మాత్రం క్లారిటీ గానే ఉంది. "రూల్స్ ఫాలో అవ్వాలి, అభయ్ అలా ఫాలో అవ్వకుండా నా ఇష్టం అంటూ సమాధానం చెప్పాడు. పైగా నిఖిల్ బ్యాట్ విరిగిపోయినప్పుడు ఆగకుండా బెలూన్స్ ని పగలగొట్టాడు. అంతే కాకుండా చేతులతో కూడా బెలూన్స్ ని పగలగొట్టాడు" అంటూ తన వెర్షన్ చెప్పింది. మరి ఫైనల్ డెసిషన్ ఏం ఉంటుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ అండ్ సి.


Read Also : Bigg Boss 8 Telugu Day 16 Promo: అతడి హగ్‌ కంఫర్టబుల్‌గా లేదు - యష్మి గౌడ ఎమోషనల్ - ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్ లో పృథ్వీ, నబిల్ ఫైట్