Brahmamudi Serial Today Episode:  కావ్య కోసం వెళ్లిన ఇందిరాదేవి, సీతారామయ్య కోసం ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తుంటారు. ఇంతలో వాళ్లు ఇద్దరే రావడంతో అందరూ షాక్‌ అవుతారు. రుద్రాణి, రాహుల్‌ మాత్రం హ్యాపీగా ఫీలవుతారు. చూశావా? నేను ఆ కావ్య రాదని చెప్పాను కదా అని రుద్రాణి చెప్తుంది. ఇంట్లోకి వచ్చిన ఇందిరాదేవిని రాజ్‌ ఆ మహారాణి ఎక్కడ? అని అడుగుతాడు. దీంతో వాళ్లు కావ్య రానంది అని చెప్తారు. దానికి కారణం నువ్వు కాదా? అంటూ రాజ్‌ న ప్రశ్నిస్తారు. మేము వెళ్లి పిలిచినా రాదని అపర్ణ చెప్పినా వినకుండా వెళ్లాము.. అంటారు.


సీతారామయ్య: కావ్య ఇంటికి రావాలంటే వెళ్లాల్సింది నువ్వు.


రాజ్‌: నేను వెళ్లాలా? అది మాత్రం జరగదు.


ఇందిరాదేవి: వెళ్లి తీరాలి. తనను అవమానించి మనసు గాయపరచి ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది నువ్వు అందుకే వెళ్లాల్సింది నువ్వే.


రాజ్‌: ఇలా అడగమని మీ మనవరాలు మీకు చెప్పి పంపించిందా?


ఇందిరాదేవి: పోనీ అలాగే అనుకో.. నువ్వు చేసిన పనిని సరిద్దిదుకో.. వెళ్లి బతిమిలాడుకుంటావో ఏం చేస్తావో కావ్యను ఇంటికి తీసుకురా రాజ్‌.


రాజ్‌: అంటే ఏంటి నాన్నమ్మా నేనిప్పుడు వెళ్లి ఆవిడ గారి కాళ్లు పట్టుకుని తప్పైందని క్షమించమని అడగాలా?


అపర్ణ: అడిగినా తప్పు లేదు. మీ మగవారికి ఆడదాని మనసు ముక్కలు చేయడమే తెలుసు. కానీ అతికించడం తెలియదు.


 అని అపర్ణ కరాకండిగా చెప్పగానే రాజ్‌ సరే అంటాడు. తన కాళ్లు పట్టుకుని బతిమిలాడమంటే బతిమిలాడతాను కానీ ఆవిడ గారు రాకపోతే మాత్రం నన్ను వదిలేయండి. రాకపోతే నన్ను వదిలేయండి. మీరందరూ అడగమన్నట్లుగా అడుగుతాను. ఇప్పుడే వెళ్తున్నాను. అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. మరోవైపు రూంలోకి వెళ్లిన రాహుల్‌, రుద్రాణి బాధపడుతుంటారు.


రాహుల్‌: ఏంటి మమ్మీ ఇలా జరిగింది. తాతయ్య, అమ్మమ్మ వెళ్లితే ఆ కావ్య రాదని సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు ఆ రాజ్‌ వెళితే కావ్య తప్పకుండా వస్తుంది.


రుద్రాణి: నాకు అదే అర్థం కావడం లేదురా? రాజ్‌ వెళ్లకుండా ఉండటానికి చాలా అడ్డు పడ్డాను. కానీ స్వప్న వచ్చి అడ్డుపడింది.


రాహుల్‌: అది శకునికి ఎక్కువ, సైందవుడికి తక్కువ అన్నట్లు తయారైంది. ప్రతి విషయంలోనూ అడ్డుపడుతుంది.


రుద్రాణి: నువ్వు చెప్పింది నిజమేరా.. కానీ దానిచేతే కావ్య ఇంటికి రాకుండా  చేయించాలి. ( స్వప్న రూంలోకి వస్తుంది) రాహుల్‌ అవకాశం తనంతట తానే వెతుక్కుంటూ వస్తుంది చూడు. నువ్వు చెప్పినట్లు చేయ్‌.


రాహుల్‌: ఓకే మమ్మీ..


రుద్రాణి: ఇప్పుడు కావ్య ఇక్కడికి వస్తే.. అప్పుడు గొడవ పెద్దదవుతుంది. దీంతో వదిన ఆరోగ్యం పాడవుతుంది. దీంతో రాజ్‌ శాశ్వతంగా కావ్యను వదిలేస్తాడు.


అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే స్వప్న విని వెంటనే పక్కకు వెళ్లి కావ్యకు ఫోన్‌ చేస్తుంది. తాము అనుకున్నది జరగబోతుందని అని దొంగచాటుగా వింటారు. కానీ స్వప్న మాత్రం కావ్యకు ఫోన్‌ చేసి నువ్వు ఇక్కడికి రావొద్దు నువ్వు వచ్చావంటే మా రుద్రాణి అత్తయ్య ప్లాన్స్‌ అన్ని బెడిసికొడతాయి అని చెప్పడంతో రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు. ఫోన్‌ కట్‌ చేసిన స్వస్న వాళ్ల దగ్గరకు వెళ్లి నేను ఇలాగే మాట్లాడాలని మీరు అనుకున్నారు కదా? మీరేం చేసినా కావ్యను ఇంటికి రాకుండా ఆపలేరు అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు కనకం, కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ బయట కూర్చుని ఉంటారు. ఇంతలో రాజ్‌ వస్తాడు.


కనకం: రండి అల్లుడు గారు లోపల కూర్చుందురు..


రాజ్: పూజ్యశీ మామయ్యగారు. గంగాభగీరథీ సమానురాలైన అత్తయ్యగారు.


కనకం: అయ్యో ఆ మాట నన్ను అనకూడదు బాబు..


రాజ్‌: మా ఇంటి మహాలక్ష్మీ మీ ఇంటికి వెకేషన్‌ కు  వచ్చింది ఎక్కడ సేద తీరుతుంది. పాలసముద్రం పైన పసిడి పాన్పు పైన


కనకం: మీరన్న ఒక్కమాట అర్థం కాలేదు. కానీ మీరు అడుగుతుంది మా అమ్మాయి గురించే అని అర్థం అయింది.


 ఇంతలో కావ్య లోపలి నుంచి వస్తుంది. రాజ్ చూసి పలకకుండా పక్కకు వెళ్లి బొమ్మలకు పెయింట్‌ వేసుకుంటుంది. కనకం, మూర్తి లోపలికి వెళ్లిపోతారు.


రాజ్‌: ఏంటి నేనొస్తే పట్టించుకోకుండా పని చేసుకుంటున్నావు.


కావ్య: ఏం చేయమంటారు? చేతిలో ఉన్న బొమ్మను ఏత్తేసి.. మీ కాళ్ల మీద పడి నా జన్మ ధన్యం అయిపోయింది అని చెప్పాలా?


రాజ్‌: మా ఇంటికి రా..


కావ్య: అయ్యో మీ ఇంటికి నేనేందుకు మా ఇల్లు ఉండగా..


 అంటూ ఇక నేను రానని.. మళ్లీ వచ్చి మళ్లీ చచ్చేంత ఓపిక నాకు లేదని కావ్య అంటుంది. దీంతో రాజ్‌ అన్ని రకాలుగా కావ్యను ఎన్నో రకాలుగా బతిమాలుతాడు. కావ్య మాత్రం నన్ను తీసుకెళ్లడానికి వచ్చారా? ఇక ఎప్పటికీ రాకుండా చేయడానికి వచ్చారా? అని అడగ్గానే రాజ్‌  ఫోన్‌ తీసి కావ్యకు ఇచ్చి నువ్వు రానని మా అమ్మకు చెప్పు అంటుంది. నేనెందుకు చెప్పాలి. అది మీ ప్రాబ్లమ్‌, నాకు మీకు ఎలాంటి రిలేషన్‌ లేదు. అని కావ్య చెప్పడంతో రాజ్ షాక్‌ అవుతాడు. ఏ సంబంధం లేదా? అని రాజ్‌ అడగడంతో అవి నువ్వు అన్న మాటలే మహాశయా ఇక జీవితంలో ఆ ఇంటి గడపే తొక్కను అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: శోభ గదిలోకి వెళ్లిన భూమి – గగన్ కు పెళ్లిచూపులు అరెంజ్ చేసిన శారద