Restaurant Style Chicken Leg Roast : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు టేస్టీగా, హాట్​గా ఏమైనా తినాలనే క్రేవింగ్స్ పెరుగుతాయి. పైగా ఆదివారం. ఈ సండే రోజు చికెన్ లేకపోతే చాలామందికి ముద్ద కూడా దిగదు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే కచ్చితంగా చికెన్ లెగ్ రోస్ట్ ట్రై చేయండి. ఆర్డర్ చేసి.. వాళ్లు ఎలా చేసినా తినడం కాకుండా.. ఇంట్లోనే టేస్టీగా, జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ రోస్ట్ సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు 

ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు

జీలకర్ర - 1 టీస్పూన్ 

Continues below advertisement

దాల్చిన చెక్క - 2

లవంగాలు - 6

యాలకులు - 4

ఎండుమిర్చి - 25-30

చికెన్ లెగ్స్ - 8

ఉప్పు - రుచికి తగినంత 

పసుపు - అర టీస్పూన్ 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

నిమ్మరసం - (ఒకటి పూర్తిగా)

నూనె - 4 లేదా 5 టేబుల్ స్పూన్లు 

షాజీరా - అర టీస్పూన్

లవంగాలు - 4

యాలకులు - 3

దాల్చిన చెక్క - 1

ఉల్లిపాయలు - 2

పచ్చిమిర్చి - 5

కరివేపాకు - ఒక రెబ్బ 

కొత్తిమీర - 1 చిన్న కట్ట

తయారీ విధానం

ముందుగా కడాయి తీసుకుని దానిలో ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిరపకాయలు వేసి.. మీడియం మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తర్వాత చికెన్ లెగ్స్ కడిగి.. మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి.. అన్నీ బాగా కలిపాలి.

Also Read : టేస్టీ, జ్యూసీ బటర్ చికెన్ రోస్ట్.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే

మసాలాలు కలిపిన మ్యారినేట్ చేసిన చికెన్​ను అరగంట పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ తర్వాత కడాయి లేదా పాన్ స్టౌవ్ మీద పెట్టి.. నూనె వేసుకోవాలి. దానిలో జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్స్ కూడా వేసుకోవాలి. 

Also Read : వంట సరిగ్గా రానివారు కూడా ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై రెసిపీ.. ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా

చికెన్​ లెగ్స్ మీడియం మంట మీద మాడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చి.. ఉడికేవరకు వేయించుకోవాలి. చివరగా సన్నగా, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి.. మరోసారి తిప్పి స్టౌవ్ ఆపేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ రోస్ట్ రెడీ. దీనిని మీరు అన్నంలో, రోటీలో కలిపి తినవచ్చు. మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసేయండి.  

ఇలాంటి టేస్టీ, మరిన్ని రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.