Easy And Tasty Chicken Fry Recipe : చికెన్ ఫ్రైని టేస్టీగా, సింపుల్​గా ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేయవచ్చు. రెగ్యులర్ చికెన్ ఫ్రై రెసిపీలకు, కాస్త కష్టంతో కూడిన వంటకు బాయ్ చెప్తూ.. హాయిగా బ్యాచిలర్స్ నుంచి వంట సరిగ్గా రానివాళ్లు కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇక్కడ ఉంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

చికెన్ - 500 గ్రాములు

నూనె - రెండు స్పూన్లు

Continues below advertisement

కారం - 1 టేబుల్ స్పూన్ 

ధనియాల పొడి - 1 1/2 టేబుల్ స్పూన్

గరం మసాలా - 1 టేబుల్ స్పూన్

జీలకర్ర పొడి - అరటీస్పూన్ 

మిరియాల పొడి - అర టీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

అల్లం - వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

కొత్తిమీర - 1 చిన్న కట్ట

తయారీ విధానం

ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. పాన్ పెట్టి వేడి కానివ్వాలి. కాస్త నూనె వేసి.. శుభ్రం చేసుకున్న చికెన్ దానిలో వేసి మూతపెట్టాలి. మధ్యలో తిప్పుతూ ఉడికించాలి. కొన్ని నిమిషాలు ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి అన్ని బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. రెండు లేదా మూడు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. 

ఇప్పుడు స్టౌవ్ మీడియం మంట పెట్టి.. పది నుంచి పదిహేను నిమిషాలు చికెన్ ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయాలి. అంతే చాలా సులభంగా చేసుకోగలిగే.. టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. దీనిని మీరు రోటీలు, పరోటాలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే నేరుగా కూడా ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఆస్వాదించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని త్వరగా ట్రై చేసేయండి.  

మరిన్ని టేస్టీ, ఈజీ రెసిపీల కోసం దీనిని క్లిక్ చేయండి.