Satya Dev's Rao Bahadur Two Days Box Office Collections : టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' రెండో రోజు కూడా కలెక్షన్స్ పరంగా మంచి నెంబర్స్ సాధించింది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించగా... రెండో రోజు కూడా అదే జోష్ కంటిన్యూ చేసింది.

Continues below advertisement

రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

'రావు బహదూర్' ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.3.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు కూడా అంతే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.5.61 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వీకెండ్ కావడంతో ఆదివారం ఇవి మరింత పెరగొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

ఇండియా వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.1.6 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా... రెండో రోజు రూ.75 లక్షల వరకూ వసూలైనట్లు తెలుస్తోంది. దాదాపు రూ.3 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అటు, ఓవర్సీస్‌లోనూ కలెక్షన్స్ పరంగా అదరగొడుతోంది. ఫస్ట్ డే ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.1.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా... రెండో రోజు రూ.కోటి కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

Also Read : Venky Anil 5 : అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్

కలెక్షన్స్ వివరాలు ఇలా...

  • వరల్డ్ వైడ్ సెకండ్ డే కలెక్షన్స్ : రూ.2.50 కోట్లు - రూ.3 కోట్ల గ్రాస్
  • వరల్డ్ వైడ్ టోటల్ గ్రాస్ కలెక్షన్స్ : రూ.5.60 కోట్లు
  • ఇండియావ్యాప్తంగా నెట్ కలెక్షన్స్ : రూ.3 కోట్లు
  • ఓవర్సీస్ 2 డేస్ గ్రాస్ కలెక్షన్స్ : రూ.2.50 కోట్లు (ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం).

ఈ మూవీలో డిఫరెంట్ రోల్స్‌లో సత్యదేవ్ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఫేం వెంకటేశ్ మహా దర్శకత్వం వహించగా... దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, మాస్టర్ కిరణ్, ప్రణయ్ వాక తదితరులు కీలకపాత్రలు పోషించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది.

మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read : Hang Man OTT : ఓటీటీలో బ్రహ్మాజీ 'హ్యాంగ్ మ్యాన్' - ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.