Brahmaji's Hang Man OTT Streaming : ఆరేళ్ల క్రితం షూటింగ్ పూర్తైన మూవీ. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈవెంట్స్‌లో ప్రీమియర్ అయిన మూవీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అనుకోని కారణాలతో థియేటర్లలో రిలీజ్ కాని సినిమాను ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. శుక్రవారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన మూవీ ట్రెండ్ అవుతోంది. ఇంతకూ ఆ మూవీ ఏంటంటే...

Continues below advertisement

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సోషల్ డ్రామా టైటిల్ హ్యాంగ్ మ్యాన్ (Hang Man). ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (sunNXT)లో శుక్రవారం (జులై 3) నుంచి అందుబాటులోకి వచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్ స్టోరీపై బిగ్ హైప్ క్రియేట్ చేయగా... స్ట్రీమింగ్ తర్వాత సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Continues below advertisement

Also Read : Sing Geetham OTT : సింగ్ గీతం ఓటీటీ రిలీజ్ - థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

ఈ మూవీకి విహాన్ దర్శకత్వం వహించగా... బ్రహ్మాజీతో పాటు బన్నీ అభిరాన్, వినయ్ నల్లకడి తదితరులు కీలకపాత్రలు పోషించారు. క్లోరో ఫిల్మ్ పిక్చర్స్, డార్క్ హార్స్ విజువల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఉరి శిక్ష పడే ఖైదీలను ఉరి తీసే తలారి పాత్రలో బ్రహ్మాజీ నటించారు.

స్టోరీ ఏంటంటే?

ఖైదీ ఉరి శిక్ష వేసే ముందు ఆ తలారి పడే మానసిక సంఘర్షణ. అతని జీవితం ఎలా ఉంటుంది? సమాజం వారిని చూసే చూపు. ఖైదీని ఉరి తీసేటప్పుడు తలారి మానసికంగా ఎలా సిద్ధమవుతాడు? అనేదే స్టోరీ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. తండ్రి నుంచి వారసత్వంగా తలారి పని చేసుకుంటాడు శివయ్య (బ్రహ్మాజీ). తన కొడుకుకు కూడా ఈ పని ఎలా చేయాలో నేర్పిస్తుంటాడు. ఒక రోజు బస్టాప్‌లో గతంలో చనిపోయిన తన కూతురిని పోలిన అమ్మాయి కనిపిస్తుంది.

దీంతో శివయ్య ఆమెను అలానే చూస్తూ ఉంటాడు. దీంతో అతని ప్రవర్తనను ఆమె తప్పుపడుతుంది. అయితే, అనుకోని విధంగా ఆ అమ్మాయి దారుణంగా లైంగిక దాడికి గురవుతుంది. ఈ ఘటనతో తీవ్రంగా కుంగిపోయిన శివయ్య తప్పు చేసిన వారిని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సమాజంలో చీడ పురుగులను శివయ్య ఏం చేశాడు? దీనికి అతని కొడుకు చేసిన సాయం ఏంటి? తలారిగా వారిని శిక్షించాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Pragya Nagra : బంగారు కాంతుల్లో అందాల ప్రగ్యా - తమిళ బ్యూటీ క్యూట్ లుక్స్... వెయిటింగ్ ఫర్ టాలీవుడ్ ఛాన్సెస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.