Tips to Reduce Spice in Curries : కొన్నిసార్లు కూరలలో తెలియకుండానే కారం ఎక్కువ వేసేస్తారు. అది తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే కొందరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడరు. కారం ఎక్కువగా తీసుకున్నా సరే అది జీర్ణ సమస్యలు తీసుకువస్తుంది. అందుకని ఎంతో ఇష్టంగా వండుకున్న కర్రీని పారేయాలేము కదా. అయితే అనుకోకుండా జరిగే ఈ పొరపాటుని కొన్ని చిట్కాలతో సరిచేసుకోవచ్చు. ఇవి మీ కర్రీలో కారాన్ని తగ్గించి కూరకు మరింత రుచిని అందిస్తాయి. 


తప్పులు చేసినా సరే.. వాటిని సరిదిద్దుకునే చాతుర్యం మీలో ఉండాలి. అనవసరంగా కంగారుపడితే.. ఉన్నదే పారేసుకోవాల్సి వస్తుంది. కానీ కాస్త ఆలోచించి ట్రై చేస్తే.. దానిని మరింత టేస్టీగా మార్చుకోవచ్చు. దానినిన డస్ట్​బిన్​లో వేయాలనే ఆలోచనను పక్కన పెట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. 


బంగాళాదుంపలతో..


మీ కర్రీలో ఉప్పు లేదా కారం లేదా మసాలా ఎక్కువైనప్పుడు మీరు వాటిలో బంగాళ దుంపలు వేయొచ్చు. ఇది పూర్వం నుంచి ఆచరిస్తున్న చిట్కానే కానీ.. ఎక్కువమందికి తెలియదు. అయితే కేవలం ఆలుగడ్డలే కాదు.. బియ్యం, బ్రెడ్ వంటి ఇతర పిండి పదార్థాలు కూర రుచులను గ్రహించి వాటిని సమానం చేయడంలో సహాయం చేస్తాయి. కాబట్టి ఈసారి మీ కూరలో కారం లేదా ఉప్పు ఎక్కువైతే.. బంగాళ దుంపను కట్​ చేసి.. కర్రీలో వేసి కాసేపు ఉడికించండి. 


పెరుగుతో..


కొన్నికూరల్లో పెరుగును వేస్తూ ఉంటాము. ఇది కూరలకు మంచి టేస్ట్ ఇస్తుంది. అంతేకాక మసాలాల వల్ల కలిగే వేడిని, కారాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే మీకు తెలుసా? కర్రీలో కారం ఎక్కువ ఉన్నప్పుడు పెరుగు వేస్తే అది కారాన్ని సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా టేస్టీ గ్రేవీని మీ సొంతమవుతుంది. కేవలం పెరుగే కాకుండా క్రీమ్ కూడా మీరు కూరల్లో వేయొచ్చు. ఇది సులభంగా మీ కర్రీలోని ఎక్కువైన మసాల, ఉప్పు, కారాన్ని సమతుల్యం చేస్తుంది.


కెచప్​తో..


టొమాటో కెచప్​ సాధారణంగా తీపి రుచిని కలిగి ఉంటుంది. దీనిని మనం వివిధ స్నాక్స్​తో కలిపి తీసుకుంటూ ఉంటాము. అయితే ఎవరికీ తెలియని ట్రిక్​ ఏంటంటే దీనితో కూరలో కారం తగ్గించుకోవచ్చు. ఇది కూడా మీ కర్రీకి మంచి టేస్ట్​ని అందిస్తుంది. లేదంటే మీ కర్రీలో చక్కెర వేసి కూడా కారాన్ని తగ్గించుకోవచ్చు కానీ.. స్వీట్​గా అనిపిస్తే తినలేము అనుకున్నప్పుడు మీరు కెచప్​ను వేయొచ్చు. 


నిమ్మకాయతో..


మసాలాలు, ఉప్పు, కారం ఇలా ఏది ఎక్కువైనా దానిని తగ్గించి.. తినే ఆహారానికి టేస్ట్ పెంచడంలో నిమ్మకాయ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కర్రీ వండుతున్నప్పుడు కారం ఎక్కువగా అనిపిస్తే.. దానిలో కాస్త నిమ్మరసాన్ని కలపండి. సమయానికి నిమ్మరసం ఇంట్లో లేకుంటే మీరు వెనిగర్​ లేదా తరిగిన టమోటాలు కూడా వేయొచ్చు. ఇవి పూర్తిగా సిట్రస్ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి కర్రీలోని అదనపు కారం, మసాలాలను తగ్గిస్తాయి. 


చాలా మంది బిర్యానీ తింటున్నప్పుడు.. చికెన్​ లేదా ఇతర నాన్​వెజ్​ పదార్థాలు తింటున్నప్పుడు.. స్పైసీ ఫుడ్ తింటున్నప్పుడు కచ్చితంగా నిమ్మరసాన్ని చల్లుకుంటారు. ఇది టేస్ట్​తో పాటు అధిక మసాలాల వల్ల కలిసే ఆరోగ్య సమస్యలను నిరోధిస్తుంది.
ఇతర కూరగాయాలు వేయండి..


మీ కర్రీలో కారం ఎక్కువైతే.. ఇంట్లో ఉండే కొన్ని కూరగాయలను తురిమి దానిలో వేయండి. ఇవి కారాన్ని, ఉప్పుని కంట్రోలే చేస్తాయి. అయితే పొట్లకాయవంటి, కాకరకాయ వంటి కూరగాయాలను మాత్రం వేయకుండా ఉంటేనే మంచిది. ఇది మీ డిష్​ రుచిని కరాబ్ చేస్తాయి.
ఈ చిట్కాలను ఫాలో అయితే మీ కర్రీని డస్ట్​బిన్​లో వేయాల్సిన అవసరం రాదు. కాబట్టి నెక్స్ట్ టైమ్​ ఇలాంటి పొరపాటు జరిగితే ఈ సింపుల్ టిప్స్​తో మీ డిష్​ని టేస్టీగా మార్చేసుకోండి.


Also Read : బీర్​ తాగితే బొజ్జ కాదు, బుద్ది పెరుగుతుందట - కానీ, చిన్నట్విస్ట్!