Drinking Beer Might Improve Your Memory : కాలేజ్ పోరగాళ్ల నుంచి.. పెద్దవారి వరకు.. ఎక్కువగా తాగేది బీర్. ముఖ్యంగా టీనేజ్‌లో ఉండేవారు బీర్ తాగేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అది తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది కాబట్టి. బాధ వచ్చినా.. సంతోషమొచ్చినా.. భయం వేసినా.. బ్రేకప్ అయినా.. ఇలా ఒకటా.. రెండా ఏ కారణంతోనైనా బీర్ తాగేవారు చాలామందే ఉన్నారు. బీర్ తాగడం కోసం కారణాలు వెతుక్కునే వారు కూడా చాలామందే ఉన్నారు. కానీ కొందరు బీర్ తాగడం వల్ల బొజ్జ వస్తుందనుకుంటారు. ఇది కొంత వరకు నిజమే అయినా.. తాజాగా జరిపిన ఓ అధ్యయనం మాత్రం బీర్ తాగేవారికి.. బీర్ తాగకుండానే కిక్ ఎక్కించే విషయాన్ని తెలిపింది.
విద్యార్థులపై అధ్యయనం..
వాస్తవానికి బీర్ మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో (University of Mexico Study).. 1652 మంది విద్యార్థులపై ఓ అధ్యయనం చేసింది. దీనిలో భాగంగా విద్యార్థుకున్న మద్యపాన అలవాట్ల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. వారి ఆలోచనా తీరు, స్వల్పకాలిక జ్ఞాపకశక్తిపై కొన్ని టెస్ట్‌లు నిర్వహించారు. అయితే దీనిలో ఇంట్రెస్టింగ్ విషయాలు (Intresting Facts) బయటపడ్డాయి.
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే
అస్సలు ఆల్కహాల్ తీసుకోనివారు, వైన్ తాగేవారు, స్పిరిట్ తాగేవారి కంటే.. బీర్ తాగేవారిలో శబ్ధ, పని, జ్ఞాపకశక్తిలో మరింత మెరుగ్గా, ఖచ్చితంగా, వేగవంతంగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. వైన్ తాగేవారు అత్యుత్తమ పని తీరు కనబరుస్తారు అనుకుంటే.. ఊహాలకు అందని విధంగా బీర్ తాగేవారు రెస్పాండ్ అయ్యారని తెలిపారు.
అతిగా తాగారనుకో..
అబ్బా.. ఇదేదో బాగుందే.. అరే మావా నువ్వెళ్లి స్టఫ్ తీసుకురా.. నేను బీర్ తెస్తాను అని.. పీతల్లా తాగేస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే బీర్‌ను లిమిట్లో తాగినవారు మాత్రమే మెరుగైన జ్ఞాపకశక్తిని కనబరిచినట్లు ఈ అధ్యనం తెలిపింది. పురుషులు లేదా స్త్రీలు తమ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవాలి.. లేదా ప్రయోజనం చేకూర్చుకోవాలనుకుంటే.. మొత్తం వారానికి 100 గ్రాముల ఆల్కహాల్ మాత్రమే తీసుకోవాలంటున్నారు. మితమైన మద్యపానం మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందిస్తుందని పరిశోధకులు తెలిపారు.
డాక్టర్లు ఇచ్చే మెడిసన్ ఎక్కువగా వాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. బీర్లు ఎక్కువ తాగితే అలాంటి, అంతకంటే ఎక్కువ దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఏదైనా లిమిట్లో తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు పొందవచ్చు. కాబట్టి ఆరోగ్యప్రయోజనాల కోసం బీర్ తాగాలనుకుంటే లిమిటెడ్‌గా తీసుకోవాలని అంటున్నారు. ఉంది కదా అని ఎక్కువ తాగేస్తే మాత్రం శారీరక, మానసిక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Also Read : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.