Flaxseeds for weight loss : బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా? అయితే మీ ఆహారంలో అవిసెగింజలను చేర్చుకోండి. ఇది మీరు శక్తివంతంగా, వేగంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. పోషకాలు అధికంగా ఉండే అవిసె గింజలు బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. మీ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి మీరు అవిసెగింజలను కొన్ని మార్గాల్లో మీ డైట్​లో చేర్చుకోవచ్చు. టీ, స్మూతీ, నూనె వంటి రూపాల్లో దీనిని మీరు రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. 


ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్


ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్ తాగితే దీని ప్రయోజనాలు ఎక్కువగా పొందవచ్చు. నిద్ర లేచిన వెంటనే ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్ ట్రై చేయవచ్చు. దీనికోసం మీరు మూడు టేబుల్ స్పూన్ల అవిసెగింజలు, కప్పు నీరు తీసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో కప్పు నీటిని తీసుకుని దానిలో అవిసె గింజలు వేయండి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి.. ఖాళీ కడుపుతో తాగండి. వారానికి రెండు లేదా మూడు సార్లు దీనిని చేయవచ్చు. అయితే ఇది బరువును వేగంగా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 


ఫ్లాక్స్ సీడ్స్​ టీ..


అవిసెగింజలను మీ టీలో చేర్చుకోండి. ఇది మీరు బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అయితే దీనిని ఏవిధంగా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చుద్దాం. అవిసెగింజల పొడి 1 టేబుల్​ స్పూన్, కొంచెం దాల్చిన చెక్క, రుచికి తగినంత తేనె, ఒకటిన్నర కప్పుల నీరు ఉంటే చాలు దీనిని తయారు చేసుకోవచ్చు. 


ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై టీ గిన్నె పెట్టండి. నీళ్లు వేసి 3 నిముషాలు మరగనివ్వండి. దానిలో దాల్చిన చెక్క, అవిసె గింజల పొడిని వేసి బాగా కలపి మరగినివ్వండి. మధ్యలో దానిని కలుపుతూ ఉండాలి. స్టౌవ్ ఆపేసి వడకట్టి దానిలో తేనె వేసి కలపండి. అంతే బరువును కంట్రోల్ చేసే ఫ్లాక్స్ సీడ్స్ టీ రెడీ. 


అవిసె గింజలతో స్మూతీ


మీరు బ్రేక్​ఫాస్ట్​గా అవిసె గింజలతో తయారు చేసిన స్మూతీని ట్రై చేయవచ్చు. మీ రోజును ఆరోగ్యకరమైన మార్గంలో తీసుకెళ్లుందుకు ఇది ఉపయోగపడుతుంది. మీ స్మూతీలో అవిసెగింజలు చేర్చుకోవడం వల్ల మీరు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. పైగా ఇది మీ శరీరంలో పోషకాలను తీసుకోవడం పెంచడానికి హెల్ప్ చేస్తుంది. 


నీరు కప్పు, అవిసె గింజలు రెండు టేబుల్ స్పూన్లు, బచ్చలికూర 1 కప్పు, స్ట్రాబెర్రీలు 1 కప్పు, అరటిపండు- 1 కప్పు తీసుకోవాలి. ఈ అన్నిపదార్థాలను బ్లెండర్​లో వేసి తీసుకోవాలి. స్మూతీల వచ్చేవరకు దీనిని బ్లెండ్ చేయాలి. ఇది బరువు తగ్గడంలోనే కాకుండా.. జుట్టు, చర్మ సంరక్షణలో కూడా మీకు హెల్ప్ చేస్తుంది. 


పెరుగుతో ఫ్లాక్స్ సీడ్స్


బరువు తగ్గడానికి అవిసె గింజలు ఎలా పనిచేస్తాయో తెలుసు. అయితే దానిని పెరుగులో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. పెరుగులో ప్రోటీన్ రిచ్ సోర్స్ ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చూస్తుంది. బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. గిన్నె తీసుకుని దానిలో అవిసె గింజలు పొడి, పెరుగు వేసి బాగా కలపండి. దీనిని ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.


ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్


అవిసె గింజల నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ప్రధానంగా ఉంటుంది. శరీరంలోపలికి ఈ యాసిడ్ వెళ్లినప్పుడు అది అసంతృప్త కొవ్వు ఆమ్లాలను ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. మీ వంటల్లో ఇతర నూనెలను సైడ్ చేసి ఫ్లాక్స్​ సీడ్స్ ఆయిల్​ని హ్యాపీగా ఉపయోగించవచ్చు.


Also Read : వింటర్​లో అల్లం వెల్లుల్లి సూప్​ తాగితే.. ఇమ్యూనిటీ వీర లెవల్​లో వస్తుందట



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.