Easy Lunch Recipes : అన్నం మిగిలిపోయినా.. లేదంటే కర్రీ వండుకునే సమయం లేకపోయినా ఎగ్ పులావ్​(Egg Pulao Recipe)ని హ్యాపీగా చేసుకోవచ్చు. దీనిని చేయడం చాలా తేలిక. లంచ్ బాక్స్​కోసమే కాకుండా.. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ టేస్టీ రెసిపీని ఇంట్లో సింపుల్​గా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


గుడ్లు - 5 (ఉడకబెట్టినవి)


నెయ్యి - 2 టేబుల్స్ స్పూన్లు 


జీలకర్ర - 1 టీస్పూన్ 


బిర్యానీ ఆకు - 1 


లవంగాలు - 4


యాలకులు - 4 


ఉల్లిపాయ - 1 


అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టేబుల్ స్పూన్ 


పచ్చిమిర్చి - 3


జీలకర్ర పొడి - అర టీస్పూన్ 


ఉప్పు - రుచికి తగినంత 


కారం - అర టీస్పూన్


పసుపు - అర టీస్పూన్ 


గరం మసాల - అర టీస్పూన్ 


అన్నం - 1 కప్పు 


కొత్తిమీర - గార్నీష్​కి తగినంత 


తయారీ విధానం 


ముందుగా స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో గుడ్లు వేయాలి. అవి పూర్తిగా ఉడికిన తర్వాత గుడ్లపైన ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం తీసుకుని వాటిని కడిగి రైస్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ వండుకోవాలనుకుంటే ముందుగా రైస్​ను కడిగి 30నిమిషాలు నానబెట్టాలి. అనంతరం రైస్ వండుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఓ 90 శాతం ఉడికితే సరిపోతుంది. ఈ అన్నాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. 


ఉల్లిపాయలను సన్నగా, పొడుగ్గా తురుముకోవాలి. పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా సన్నగా తురుముకుని వంట ప్రారంభించాలి. ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో జీలకర్ర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేయాలి. వాటిని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. 



ఇలా వేయించుకున్న మసాలాలో సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. దాదాపు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించుకోవాలి. అనంతరం పసుపు, ఉప్పు, గరం మసాల వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు వేయిస్తూనే ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత కచ్చితంగా అడుగుపట్టకుండా తిప్పుతూనే ఉండాలి. వాటిలో ఉడికించుకున్న ఎగ్స్ వేసుకుని మసాలా వాటికి పట్టేలా వేయించుకోవాలి. 


ఇప్పుడు కడాయిలో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్​ వేసుకుని పూర్తిగా రైస్ మసాలాలో కలిసేలా కలపాలి. ఇలా కలిపిన రైస్​ని ఓ 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి గార్నిష్ చేయొచ్చు. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు లేదంటే లంచ్ బాక్స్​ కోసం కర్రీ చేసుకునే టైమ్ లేదనుకునప్పుడు ఈ ఎగ్ పులావ్​ని చేసుకోవచ్చు. మీకు పుదీనా ఇష్టముంటే దానితో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మంచి రుచిని ఇస్తుంది. అలాగే కట్ చేసిన ఎగ్స్ ఈ రెసిపీలో ఉపయోగించకపోవడమే మంచిది. 


Also Read : క్రిస్పీ పెసర పునుగులు.. చాలా సింపుల్​గా ఈవెనింగ్ స్నాక్స్​ని చేసేయండిలా