Healthy Snacks for Kids : ఎదిగే పిల్లలకు కాల్షియం చాలా అవసరం. ఇది ఎముకలను దృఢంగా చేసి.. మంచి ఎదుగుదలను ప్రోత్సాహిస్తుంది. అయితే హెల్తీ ఫుడ్స్ పెడితే పిల్లలు వాటిని తినరు. కానీ ఆరోగ్య ప్రయోజనాలను అందించే టేస్టీ మఫిన్స్​ను ఇంట్లోనే తయారు చేసి.. వారికి తినిపించవచ్చు. మరి ఈ టేస్టీ మఫిన్స్ లేదా కప్​ కేక్స్​​ను ఏవిధంగా తయారు చేయాలి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మఫిన్స్ మృదువుగా, టేస్టీగా వస్తాయి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


రాగిపిండి - 1 కప్పు


ఓట్స్ పౌడర్ - పావు కప్పు


బార్లీ పౌడర్  - అర కప్పు


పెరుగు - 100 గ్రాములు 


పాలు - 60 గ్రాములు


వెనిలా ఎసెన్స్ - 1 టీస్పూన్ 


బెల్లం - 125 గ్రాములు 


వెన్న - 75 గ్రాములు 


బేకింగ్ పౌడర్ - పావు టీస్పూన్ 


బేకింగ్ సోడా - ఒకటిన్నర టీస్పూన్ 


ఉప్పు - పావు టీస్పూన్ 


కోకో పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు 


జాంతన్ గమ్ - 1 టీస్పూన్ 


నీరు - వంటకు సరిపడేంత


బాదం - 10 


తయారీ విధానం 


ముందుగా మిక్సీ జార్​లో రాగిపిండి, బార్లీ పౌడర్, ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. వాటిని బాగా కలిసేలా మిక్సీ పట్టించాలి. పిండిని మిక్సీ చేయడం అనుకుంటున్నారా? అయితే మఫిన్స్ మెత్తగా టేస్టీగా రావాలంటే ఈ ప్రాసెస్ చేయాలి. రాగి పిండి, ఓట్స్ పౌడర్, బార్లీ పౌడర్ కాస్త బరకగా ఉంటాయి. కాబట్టి వీటిని మిక్సీ చేసి.. మైదాపిండి అంత మెత్తగా అయ్యేలా వీటిని మిక్సీ జార్​లో వేసి మిక్సీ చేయాలి. కేక్స్ మరింత బాగా రావాలంటే దానిని జల్లెడకూడా చేసి పిండిని సిద్ధం చేసుకోవచ్చు. 


ఇప్పుడు మిక్సింగ్ బౌల్​ తీసుకుని.. దానిలో పెరుగు వేయాలి. అనంతరం వెనిలా ఎసెన్స్ వేయాలి. బెల్లం పొడి, పాలు వేసి బాగా కలపాలి. బెల్లం ఈ మిశ్రమంలో బాగా కలిసేలా దానిని మిక్స్ చేసుకోవాలి. దానిలో బటర్ కూడా వేసి.. దానిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం పాలల్లో బాగా కలిసిపోయిన తర్వాత.. ముందుగా తయారుచేసి పెట్టుకున్న రాగిపౌడర్​ను దీనిలో వేయాలి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. దానిలో జాంతన్ గమ్ కూడా వేసి పిండిని కలపాలి. ఇలా చేయడం వల్ల మఫిన్స్ బాగా వస్తాయి. 


ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో నీటిని వేయాలి. నీటిని వేసిన తర్వాత పిండిని బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల గమ్ ఉండలుగా పేరుకుపోకుండా.. మిశ్రమం మొత్తంలో కలిసి.. మఫిన్స్ మృదువుగా వస్తాయి. ఇప్పుడు మఫిన్స్ ట్రే తీసుకోండి. వాటిలో మఫిన్స్ లైనర్​లు ప్లేస్ చేయాలి. తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వాటిలో వేయాలి. కప్పుకి మూడు వంతులు వేస్తే సరిపోతుంది. పూర్తిగా వేస్తే మఫిన్స్ బయటకు పొంగిపోతాయి. 



మఫిన్స్ ట్రేలో పిండి వేసిన వెంటనే.. దానిలో బాదం పలుకులను వేయాలి. అనంతరం ట్రేను నెలకు చిన్నగా టాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల గాలి చేరదు. ఇప్పుడు ఓవెన్​ను 200 డిగ్రీలు ప్రీహీట్ చేసుకోవాలి. అనంతరం 170 డిగ్రీలలో 40 నిమిషాలు వీటిని బేక్ చేయాలి. అంతే టేస్టీ మిల్లెట్స్ మఫిన్స్ రెడీ. ఇవి మంచి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం మాత్రమే కాకుండా.. వివిధ విటమిన్లు, ఖనిజాలు, ఐరన్​ ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్​లు మీకు ఎనర్జీనిస్తాయి. ఇవి కంటిచూపును మెరుగుపరిచి.. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. కాబట్టి వీటిని పెద్దల నుంచి.. పిల్లలవరకు అందరూ హాయిగా తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. 


Also Read : గులాబ్ జామూన్ పొడితో ఇలా కేక్ చేసేయండి.. సండే స్పెషల్ సింపుల్ స్వీట్ రెసిపీ