Kids Favourite Plum Pudding Recipe : కేక్స్, బ్రౌనీలు, పుడ్డింగ్స్.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. వాటిని రుచిని మాత్రం మరువలేము. పిల్లలనుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ ఆహారాలు తినాలంటే బయట బేకరీకి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. అయితే వీటిని చాలా సింపుల్​గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకు టేస్టీ బ్రేక్​ఫాస్ట్ అందించాలనుకున్నా.. లేదంటే ఏదైనా స్పెషల్ డే రోజు అయినా సరే మీరు టేస్టీ ప్లమ్ పుడ్డింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు.


ఈ ప్లమ్​ పుడ్డింగ్​ని మరింత టేస్టీగా.. ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి ఇక్కడో రెసిపీ ఉంది. దీనిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, యాపిల్స్ ఉపయోగిస్తాము. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. కాబట్టి పిల్లలు ఇష్టపడే ఆహారంలో హెల్తీ ఫుడ్స్​ని కూడా కలిపి తినిపించేయవచ్చు. మరి ఈ ప్లమ్​ పుడ్డింగ్​ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


బటర్ - 250 గ్రాములు


పంచదార - 150 గ్రాములు


యాపిల్ - 1 (ముక్కలుగా కోసి పెట్టుకోవాలి)


కేక్ క్రంబ్స్ - 100 గ్రాములు


మైదా పిండి - 60 గ్రాములు


బేకింగ్ పౌడర్ - 4 గ్రాములు


గుడ్లు - 4


క్రీమ్ - 60 గ్రామలు


నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ - 600 గ్రాములు


స్వీట్ కలర్ - కొంచెం


తయారీ విధానం


ప్లమ్ పుడ్డింగ్ వండే విధానం ప్రారంభించే ముందు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలి. జీడిపప్పు, పిస్తా, అంజీర్, బాదం, కిస్​మిస్ వంటి నట్స్​ను మీరు రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి. ప్లమ్​ పుడ్డింగ్ తయారు చేయడానికి ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. దానిలో వెన్న, పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు దానిలో గుడ్లు పగులగొట్టి.. ఒకదాని తర్వాత.. మరొకటి వేస్తూ బాగా మిక్స్ చేయాలి. మీరు స్పూన్​తో లేదా మిక్సర్​ ఉపయోగించి ఈ మిశ్రమాన్ని కలుపవచ్చు. ఈ మిశ్రమం క్రీమ్ వలె మారేవరకు బాగా కలుపుతూనే ఉండాలి. 


తయారు చేసుకున్న క్రీమ్​ మిశ్రమంలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలిపిన తర్వాత.. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్​ను ముక్కలుగా కట్ చేసి.. ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు క్రీమ్​, యాపిల్ ముక్కలు వేసి కలపాలి. దీనిలో స్వీట్ కలర్ కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని పుడ్డింగ్ మౌల్డ్​లో పెట్టి దానిపై అల్యూమినియం కాగితంతో చుట్టాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమం బయటకు రాదు. ఇప్పుడు ట్రేలో నీరు వేసి.. 150 డిగ్రీల సెంటీ గ్రేడ్.. - 35 వద్ద ఓవెన్​లో దీనిని ఉడికించండి. 


పుడ్డింగ్ అయ్యేవరకు దానిని ఓవెన్​లో ఉంచండి. ఉడికిందో లేదో తెలుసుకునేందుకు పుడ్డింగ్​లో టూత్​పిక్​ని గుచ్చి చూడండి. పిండి అతుక్కుంటే మరింత సమయం ఉడికించాలని.. లేకుండా వెంటనే దించేయొచ్చని అర్థం. దీనిని వేడిగా తినొచ్చు. లేదంటే ఫ్రిజ్​లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత కూడా తినొచ్చు. దీనిని కస్టర్డ్ సాస్​తో తింటి మరింత రుచిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సింపుల్​ రెసిపీని ఇంట్లో తయారు చేసి పెట్టేయండి. 


Also Read : మీరు వెజిటేరియన్స్ అయితే ఆ ఫుడ్స్​తో జాగ్రత్త