Vegetarian Meals for Weight Loss : శాఖాహారులకు మంచి హెల్తీ ఫుడ్ దొరకదు.. ప్రోటీన్​కు మంచి సోర్స్ ఉండదు అనుకుంటారు కానీ.. వెజ్​లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఏమి తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన ఉంటే చాలు. ముఖ్యంగా వెజిటెబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయానాలు తేల్చాయి. అయితే నాన్​వెజ్​ నుంచి వెజ్​కు మారేవారికి వీటిని తీసుకోవడం మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే వారు టేస్ట్​కోసం కొన్ని పదార్థాలు కలిపి తీసుకుంటారు. టేస్ట్​ను అందించే ఫుడ్స్​ శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇవి మీరు బరువు పెరగడంతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులను పెంపొందించడంలో సహాయం చేస్తాయి. కాబట్టి వెజ్​ ఫుడ్​లో ఆరోగ్యానికి హాని చేసే షుగర్స్ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.  


మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ


మెరుగైన ఆరోగ్యం కోసం చాలా మంది నాన్ వెజ్​ నుంచి వెజ్​కు మారుతున్నారు. మొక్కల ఆధారిత ఫుడ్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్​కు కూడా వెజ్​లో మంచి సోర్స్ దొరుకుతుంది. బీన్స్, టోపు, సోయా వంటి శాకాహార ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల గుండె సంబంధింత వ్యాధులు తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భరాల్లో అసలు అవి మీ దరికొచ్చే అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు. అయితే శాకాహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలతో పాటు.. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట. కానీ ప్రోసెసింగ్ చేసిన ఫుడ్స్, స్వీట్స్, సిరప్స్, తేనే వంటి వాటిని తీసుకోవడం వల్ల మధుమేహ సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు.


ఆ ఫుడ్స్​ని కచ్చితంగా దూరం పెట్టండి


తినే ఆహారం నుంచి చక్కెరలను వేరు చేయడం కాస్త కష్టమే. కానీ మీరు షుగర్​ ఉన్న ఫుడ్స్​ను తగ్గించుకోవాలని.. ట్రై చేస్తే తెలియకుండానే వాటిని మీరు దూరం పెట్టేస్తారు. కాబట్టి కొన్ని ఆహారాల పట్ల క్రేవింగ్స్​ తగ్గించుకోవాలి. స్వీట్స్, డిజెర్ట్స్ వంటి వాటిని దూరం పెట్టొచ్చు కానీ.. వాటిలో షుగర్ ఉంటుందనే విషయం తెలియకుండా చాలామంది వాటిని తినేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని దూరం పెట్టండి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి... యోగర్ట్స్, చాక్లెట్ సోయా, వెనిలా సోయా, ఓట్స్​ లేదా బాదం పాలు వంటి ఫ్లేవర్డ్ మిల్క్స్. ఇవి నాన్​ డైరీ అని హాయిగా తినేస్తాము కానీ.. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. షుగర్ పీనట్ బటర్, ఎనర్జీ బార్స్, మసాలాలు, వెజ్ సలాడ్స్​ కోసం ఉపయోగించే క్రీమ్స్, పాస్తా సాస్, కెచప్స్, బార్బెక్యూ సాస్, చిప్స్, ఫ్లేవర్డ్ పాప్​ కార్న్​లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం తెలియక చాలామంది వీటిని తీసుకుంటారు. మీరు తీసుకునే సలాడ్స్​లో ఫ్లేవర్​ను పెంచుకునేందుకు సాస్​, క్రీమ్​లకు బదులుగా.. నిమ్మకాయ, వెల్లుల్లిని చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవచ్చు. 


మీరు మీ డైట్​నుంచి ఆరోగ్యాన్ని ఇబ్బందులకు గురి చేసే చక్కెరలు దూరం చేసుకోవాలనుకుంటే మీ డైట్​లో పండ్లు, తృణధాన్యాలు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలో శరీరానికి మేలు చేసే సహజమైన చక్కెరలు ఉంటాయి. అలాగే ప్రోటీన్ ఫుడ్​ కూడా మిమ్మల్ని స్వీట్ క్రేవింగ్స్ నుంచి దూరం చేస్తాయి. అప్పుడే మీరు హెల్తీ వెయిట్ పొందుతారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 


Also Read : గూగుల్​ లెన్స్​తో మీరు ఈ విషయం తెలుసుకోవచ్చు తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.