Skin Conditions Google Lens : స్మార్ట్ ఫోన్ మనకి తెలియని విషయాలు ఎన్నో చెప్తుంది. కొత్త విషయాలు, వింతలు.. రోజూ జరిగే వార్తలు ఇలా ఒకటా రెండా.. పొద్దున్న లేచినప్పటి నుంచి.. సాయంత్రం పడుకునేవరకు దాదాపు ప్రతి పని దానితోనే ఉంటుంది. ఆఖరికి రోజంతా లేజీగా ఉండడంలో కూడా ఇదే ముఖ్యపాత్ర పోషిస్తుంది. మనకి వచ్చే ప్రతి డౌట్‌ని తీర్చడానికి గూగుల్ (Google) తల్లి ఏలాగో ఉంది. అయితే గూగుల్ లెన్స్ కూడా ఎన్నో విషయాలు డిస్కవర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మరో బెనిఫిట్ ఉంది తెలుసా?
Google Lensలో మీరు మీ చర్మం ఫోటోలను తీస్తే.. దాని కండీషన్ ఎలా ఉందో చెప్పేస్తుందట. సాధారణంగా చర్మంపై వచ్చే దద్దుర్లు, మచ్చలను ఎలా వచ్చాయో.. ఎందుకు వచ్చాయో చెప్పడం చాలా కష్టం. ఇలాంటి సందిగ్ధంలోనే మీరు ఉన్నారా? అయితే మీరు వెంటనే మీ చర్మంపై ఉన్న మచ్చను లేదా దద్దుర్లు లేదా ర్యాష్ (Skin Rash)ను ఫోటో తీయండి. దీనిని గూగుల్ లెన్స్ సాయంతో.. దాని గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. మీ పెదవిపై ఓ పింపుల్, లేదా శరీరంపై ఎక్కడైనా వాపు వచ్చినప్పుడు దాని గురించి ఎలా తెలుసుకోవాలా అని గూగుల్‌కి చెప్పలేని పరిస్థితుల్లో మీరు జస్ట్ ఫోటో క్లిక్ చేసి గూగుల్ లెన్స్ సాయంతో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
దద్దర్లు, ర్యాష్, పుట్టు మచ్చలను చిత్రాన్ని తీసి.. దానిని గూగుల్ లెన్స్ యాప్ (Google Lens App)లో అప్లోడ్ చేయవచ్చు. ఇలా చేసినప్పుడు గూగుల్ లెన్స్ ఆ ఫోటోకి సరిపోలే సమాచారాన్ని అందిస్తుంది. ఇది తలపై జుట్టు రాలడం వంటి విషయాలను గుర్తించడంలో కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడం చాలా సులభం. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఇది కేవలం చర్మ పరిస్థితులను విశ్లేషించడమే కాదు.. దీనిలో ఏ ఫోటోని అప్లోడ్ చేసినా.. దానికి సంబంధించిన సమాచారం మీకు దొరుకుతుంది.
ఉదాహరణకు మీకో డ్రెస్ నచ్చిందనుకో.. దానిని ఫోటో తీసి లెన్స్‌లో అప్లోడ్ చేస్తే చాలు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం.. ఎక్కడ దొరుకుతుందో.. దాని విలువ.. దానిలో వెరైటీలు ఏమున్నాయో.. వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా మీరు ఎన్నో వాటి గురించి తెలుసుకోవచ్చు. పిల్లలకు నేర్పవచ్చు. టెక్నాలజీ పెరగడంతో అభివృద్ధి వస్తుందంటే తప్పు.. దాని గురించి తెలుసుకోవడంతోనే నిజమైన అభివృద్ధి కలుగుతుంది. సో మీ హెల్త్ గురించిన విషయాలు తెలుసుకోవడం కోసం టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవచ్చు.
Also Read : బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఫుడ్స్ కచ్చితంగా తినండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.