Low Carb Diet For Weight Loss : బరువు తగ్గాలనుకుంటే ముందుగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఫుడ్ పైనే. ఇది బరువు తగ్గడంలో, పెరగడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు తీసుకునే ఫుడ్‌లో అధిక ప్రోటీన్, కార్బ్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే మీరు తీసుకోవాల్సింది సమతుల్యమైన ఆహారం(Balanced Diet). దీనిలో భాగంగా మీరు తీసుకునే ప్రతి పోషకాన్ని తగిన నిష్పత్తిలో తీసుకోవాలి.
లో కార్బ్స్.. హై ప్రోటీన్ కలిగిన ఆహారం బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. కాబట్టి ఈ రకమైన డైట్ మధుమేహమున్నవారికి కూడా చాలా మంచిది. కార్బ్స్ తగ్గించడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మీ శరీరం మరింత గ్లూకోగాన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది. ఈ రకమైన డైట్‌ను మీరు రెగ్యూలర్‌గా తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా అధిక ప్రోటీన్ (High Protein) కలిగిన ఆహారం.. రెగ్యులర్ వ్యాయామాలు కూడా కొవ్వును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇది కండరాలకు శక్తిని అందిస్తుంది. అయితే కార్బ్స్ తక్కువగా ఉండి.. ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారాల గురించి.. అవి మీరు బరువు తగ్గడంలో ఏవిధంగా హెల్ప్ చేస్తాయో తెలుసుకుందాం.
వేయించిన శనగలు..
మీకు తెలుసా వేయించిన శనగలు పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు వెజ్ అయితే.. మీరు ప్రోటీన్కోసం వీటిని మీ డైట్లో కలిపి తీసుకోవచ్చు. స్నాక్స్‌గా వీటిని తీసుకోవడం వల్ల మీ కడుపు నిండుతుంది. ఇతర చిరుతిళ్ల జోలికి వెళ్లాల్సిన అవసరం రాదు. కాబట్టి వీటిని హాయిగా మీ డైట్లో చేర్చుకోండి.
సన్ ఫ్లవర్ సీడ్స్
పొద్దు తిరుగుడు పువ్వుల గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలనుకుంటే ఇవి మీకు మంచి ఎంపిక. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, కాపర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు స్నాక్స్‌గా లేదా ఫ్రూట్స్, వెజిటెబుల్ సలాడ్స్ మీద చల్లి తీసుకోవచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడమే కాకుండా.. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
సాల్మన్
సాల్మన్ ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పూర్తిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గించి.. మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది పొత్తికడుపు దగ్గర ఉన్న కొవ్వును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీరు హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటే మీకు సాల్మన్ ఫిష్ మంచి ఎంపిక. ఇది మీ కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గేలా చేస్తుంది.
పెరుగు
కొందరు పెరుగు తినడానికి ఇష్టపడరు కానీ.. మీరు పెరుగు తింటే బరువు తగ్గొచ్చు తెలుసా? గ్రీక్ యోగర్ట్ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీనిలో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీ కడుపు సమస్యలను దూరం చేసి హెల్తీ గట్ అందిస్తాయి. దీనిలో అధిక ప్రోటీన్.. తక్కువ కార్బ్స్ ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు.
ప్రోటీన్ ఎక్కువగా.. కార్బ్స్ తక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇవి మీరు ఎక్కువ సేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. తద్వారా మీరు ఎక్కువగా తినడాన్ని ఆపేయగలుగుతారు. చిరుతిళ్ల వైపు ధ్యాస మళ్లదు. కాబట్టి మీ డైట్లో ఇవి ఉండేలా ప్లాన్ చేసుకోండి. వీటికి తోడు రెగ్యూలర్ వ్యాయామాలు తోడైతే.. మీరు మరింత వేగంగా బరువు తగ్గుతారు.
Also Read : పిల్లల్లో ఇమ్మూనిటీని పెంచే అల్లం, క్యారెట్ సూప్.. రెసిపీ ఇదే
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.