Benefits of Marriage : ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్, డివోర్స్ వంటి విషయాలు పెళ్లిపట్ల భయాలు కలిగిస్తున్నాయి. అందుకే యువత పెళ్లి అంటేనే అమ్మో అంటుంది. పైగా వివాహ ప్రాముఖ్యతను చెప్పేవారు కూడా కరువైపోయారు. దీంతో దానిపట్ల తెలియకుండానే ఓ విరుద్ధభావం పెరిగిపోతుంది. నిజమే కొందరికి వివాహ బంధం కష్టంగా ఉండొచ్చు. దానికి వివిధ కారణాలు కూడా ఉండొచ్చు. కానీ పెళ్లి చేసుకోకుండానే దానిపట్ల విముఖత చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే సొసైటీలో వివాహ బంధంలో హ్యాపీగా ఉంటున్నవారు కూడా ఉన్నారు.
కొన్ని బంధాలు మనకి పుట్టుకతోనే వస్తే.. మరికొన్ని బంధాలు మనతో ముడిపడి వస్తాయి. అలాంటి బంధాలు పెళ్లితోనే వస్తాయి. ఎవరో తెలియని వాళ్లని కూడా పెళ్లితో దగ్గర చేస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఏడేడు జన్మాలది అంటూ ఉంటారు. మరి అలాంటి బంధాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించకపోతే ఎలా? వివాహబంధంలోకి అడుగు పెడితే మీ జీవిత ఎలా ఉంటుందో అనే భయాలను పక్కన పెట్టి.. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆలోచిస్తే పెళ్లి గొప్పతనం, ప్రాముఖ్యత మీకు అర్థమవుతాయి.
వివాహం, ఆలుమగల బంధం కేవలం మానసికంగానే కాదు.. శారీరకంగానూ గొప్పది. సరిగ్గా చెప్పాలంటే దీనిని భావోద్వేగ కలయిక అని చెప్పవచ్చు. స్త్రీ పురుషులు అప్పటివరకు వేరుగా ఉన్నా.. వివాహ బంధంతో ఒకటి అవుతారు. అదే వారి జీవితానికి సంపూర్ణత్వాన్ని తీసుకువస్తుంది. జీవితకాలం ఒకరితోనే తమ జీవితాన్ని పంచుకుంటూ.. పార్టనర్, పిల్లలకు నిస్వార్థంగా సేవ చేయాలనిపించే ఏకైక బంధం పెళ్లి.
కుటుంబాన్ని ఇద్దరూ కలిసి లీడ్ చేయొచ్చు. కష్ట సుఖాలను పంచుకుంటూ.. ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు. ఒంటరిగా ఎంత సంతోషంగా ఉన్నా.. సంతోషాన్ని, బాధను షేర్ చేసుకోవడానికి ఓ రిలేషన్ కావాలి. దానిలో ఎలాంటి స్వార్థం, ద్వేషం ఉండకూడదు. పార్టనర్మీకో మంచి దోస్తి అయితే మీ మ్యారేజ్ రిలేషన్ చాలా బాగుంటుంది.
మనసు, శరీర కాంక్షలు నెరవేర్చడం ప్రతి దేహానికి అవసరం. అయితే కోరికలు ఎక్కడ పడితే అక్కడ.. ఎవరితో పడితో వాళ్లతో తీర్చుకునేవి కాదు. ఇంకెవరితో చేసిన అది తప్పుగానే పరిగణిస్తారు. కానీ వివాహబంధానికి ప్రతి ఒక్కరు గౌరవమిస్తారు. ఇది మీరు, మీ భాగస్వామి శారీరకంగా, మానసికంగా, పరిపూర్ణంగా స్వీకరించే ప్రేమను ఇస్తుంది.
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు తమ ఖర్చులను పంచుకోవడానికి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఆదాయపరంగా ఉండే ప్రెజర్ అంతా ఇంతా కాదు. దానిని మీరు ఇద్దరూ కలిసి వివాహాబంధంతో దూరం చేసుకోవచ్చు. ఇది మీరు ఇద్దరూ ఆర్థికంగా బలంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.
పేరెంటింగ్ అనేది ఆనందాన్ని ఇచ్చే సవాళ్లతో కూడిన బంధం. కానీ పిల్లలు అభివృద్ధి చెందాలంటే దానికి తల్లిదండ్రులు పునాదులు అని చెప్పాలి. వీరి బంధం కరెక్ట్‌గా ఉంటే.. పిల్లలు మంచి వాతావరణంలో పెరగడం అనేది సమాజానికి చాలా మంచిది. వారు శారీరక, భావోద్వేగ, విద్యాపరమైన శ్రేయస్సుకు తల్లిదండ్రులు చాలా అవాసరం. పెళ్లి అనేది ఎవరూ వదులకోని బలమైన సంబంధం. దీనిలో విడిపోవడం కంటే కలిసి ఉండేందుకు ఎక్కువ ప్రయత్నం చేయాలి. మీ భావోద్వేగాలు, భావాలు పంచుకోవడానికి.. మీ జీవితంలో ప్రతి విషయాన్ని చర్చించుకోవడంలో ఎప్పుడూ వెనుకాడకూడదు. ఇది భర్తీ చేయలేని ఏకత్వ అనుభూతిని మీకు అందిస్తుంది.
Also Read : హెయిర్‌ఫాల్‌ను కంట్రోల్ చేసి.. జుట్టు పెరుగదలను ప్రోత్సాహించే సింపుల్ చిట్కాలు