Simple Tips For Healthy Hair : జుట్టు రాలడమనేది చాలామందిలో జరుగుతుంది. మరికొందరిలో అదో సమస్య అని చెప్పవచ్చు. వివిధ కారణాల వల్ల హెయిర్​ఫాల్ ఎక్కువగా అవుతుంది. దీనివల్ల జుట్టు ఊడిపోయి.. బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాలు ఫాలో అయితే జుట్టు రాలడం సమస్య కంట్రోల్ అవ్వడమే కాకుండా రీగ్రోత్​కు హెల్ప్ చేస్తాయి. పైగా ఈ సహజమైన పద్ధతులు ఫాలో అవ్వడం కూడా చాలా తేలక. మీ జుట్టును తిరిగి పెంచడంలో సహజంగా హెల్ప్ చేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


మసాజ్


స్ట్రెస్​ వల్ల జుట్టు రాలిపోతుందని మీకు తెలుసా? అయితే మీరు కచ్చితంగా మీ స్కాల్ప్​కు మంచి మసాజ్ ఇవ్వండి. ఇది స్ట్రెస్ తగ్గించడమే కాకుండా జుట్టురాలడాన్ని కంట్రోల్​ చేసి పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. జుట్టుకు ఆయిల్ పెట్టి చిన్న చిన్న సర్కిల్​గా గోళ్లతో కాకుండా వేళ్లతో సున్నితంగా రెగ్యూలర్​గా మసాజ్ చేస్తే ఫలితాలు మీరే చూడొచ్చు. మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్​లో రక్త ప్రసరణ పెరిగి.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. 


కొబ్బరి నూనె


జుట్టు పోషణలో దీనికి మించిన ఇంటి చిట్కా మరొకటి ఉండదు. కొబ్బరినూనెలోని లారిక్ యాసిడ్​ అనే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి స్కాల్ప్​లోపలికి చొచ్చుకుపోయి.. జుట్టుకు లోపలి నుంచి రక్షణ అందిస్తాయి. కాబట్టి కొబ్బరి నూనె మీ తలస్నానానికి ముందు అప్లై చేసి మంచి మసాజ్ ఇవ్వండి. 


ఉల్లిపాయ రసం


ఉల్లిపాయ రసం వాసనను మీరు భరించగలిగితే.. మీ జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరచి.. హెయిర్ ఫోలికల్ డెవలప్​మెంట్​లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. 


అలోవెరా 


అలోవెరాను ఎన్నో ఏళ్లుగా జుట్టు సంరక్షణలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది స్కాల్ప్​కు మంచి పోషణను అందించి.. జుట్టును కండిషనింగ్ చేస్తుంది. చుండ్రును కంట్రోల్ చేసి జుట్టు కుదుళ్లను హెల్తీగా చేస్తుంది. కాబట్టి మీరు స్వచ్ఛమైన కలబంద గుజ్జును మీ హెయిర్ కేర్ రోటీన్​లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. 


రోజ్మేరీ 


ఈ మధ్యకాలంలో హెయిర్​ కేర్​లో దీనిపేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సాహించి జుట్టు రాలడాన్ని నివారిస్తుందని పలువురు నిపుణులు చెప్తున్నారు. రోజ్మేరీ ఆయిల్ లేదా వాటర్ రెండూ కూడా జుట్టు సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే రోజ్మేరీ ఆయిల్​ని ఆర్గాన్ ఆయిల్ లేదా జోజోబా ఆయిల్ వంటి వాటిలో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. షాంపూ లేదా కండీషనర్​లో కూడా ఈ ఆయిల్ మిక్స్ చేసి ఉపయోగించవచ్చు. 


ఫిష్ ఆయిల్ 


కొన్నిసార్లు జుట్టు సంరక్షణ కోసం లోపలి నుంచి ట్రీట్​మెంట్ ఇవ్వాలి. కొన్ని సప్లిమెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. దానిలో భాగంగా మీరు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు సాంద్రతను పెంచి.. రాలడాన్ని కంట్రోల్ చేస్తాయి. అయితే వీటిని తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుని సలహా తీసుకోవాలి. 


తలస్నానం తర్వాత..


షాంపూ చేసిన తర్వాత హెయిర్​కు మాయిశ్చరైజింగ్ అందించడానికి కచ్చితంగా కండీషనర్ అప్లై చేయండి. ఇది జుట్టు చివర్లు చిట్లకుండా హెల్ప్ చేస్తుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు మైక్రోఫైబర్ టవల్​తో కవర్ చేయాలి. తడిజుట్టును దువ్వకూడదు. చిక్కులను విడిపించుకునేందుకు సీరమ్ లేదా డిటాంగ్లర్​ ఉపయోగించవచ్చు. హీటింగ్ ప్రొడెక్ట్స్​ను వీలైనంత దూరం చేయాలి. 


ఫుడ్ విషయంలో 


బయట నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లోపలి నుంచి పోషణ అందితేనే సమస్య కంట్రోల్​లో ఉంటుంది. కాబట్టి ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు కలిగిన ఫుడ్ తీసుకోండి. తక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది. కొన్ని విటమిన్లు, సప్లిమెంట్లు తీసుకునే ముందు వైద్యుని కచ్చితంగా సంప్రదించండి. 


Also Read : నల్లని పెదాలకు పింక్ గ్లోని అందించే సహజమైన DIY మాస్క్​లు ఇవే