DIY Lip Masks : వివిధ కారణాలతో డార్క్ అయిపోయిన మీ పెదాల సౌందర్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఇంట్లో కొన్ని DIY లిప్ మాస్క్‌లు తయారు చేసుకోవచ్చు. ఇవి మీకు మృదువైన, మెరిసే పెదాలను మీకు అందిస్తాయి. పైగా వీటిని సహజమైన పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. కెమికల్స్ ఉపయోగిస్తే మీ పెదాలు పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోవచ్చు. సహజమైన పదార్థాలతో ఈ సమస్య ఉండదు.
ఈ DIYలలో ఉపయోగించే సహజమైన పదార్థాలు మీ పెదాలను ఎక్స్ఫోలియేట్ చేసి హైడ్రేట్ చేస్తాయి. అంతేకాకుండా డార్క్‌నెస్‌ను పోగొట్టి పెదాలకు మంచి పోషణను అందిస్తాయి. ఎండిపోయిన, పగిలిన పెదవులకు ఇవి చెక్ పెడతాయి. అయితే ఇంట్లోనే ఉండే పదార్థాలతో లిప్ మాస్క్‌లు ఎలా తయారు చేయాలో ఏ కాంబినేషన్స్ మీరు ట్రై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరాతో
మీరు మీ పెదాలకు మంచి గ్లో, పోషణ ఇవ్వాలనుకుంటే కలబంద, పంచదార లిప్మాస్క్ను ట్రై చేయవచ్చు. రెండు టీ స్పూన్ల అలోవెరా జెల్, ఒక టీస్పూన్ పంచదారను కలిపి పెదాలకు అప్లై చేయండి. ఈ స్ర్కబ్‌తో పెదాలను బాగా మసాజ్ చేయండి. ఇది డైగా మారిన పెదాలను, టాన్ అయిన పెదాలను ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అంతేకాకుండా మంచి హైడ్రేషన్‌ను అందిస్తుంది. స్క్రబ్ చేసిన తర్వాత 15 నిమిషాలు మాస్క్‌ని అలానే ఉంచేయండి. అనంతరం వాష్ చేసుకుంటే మీరు ఫలితాలు చూస్తారు. మృదువైన, హైడ్రేటెడ్ పెదాలు పొదాల కోసం రెగ్యూలర్‌గా దీనిని ఉపయోగించవచ్చు.
కొబ్బరి నూనెతో
పెదాలపై ఉన్న టాన్ పోగొట్టడానికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది. కొబ్బరినూనె, పంచదారతో చేసిన స్క్రబ్ లిప్స్‌పై ఉన్న మృతకణాలను పోగొడుతుంది. ఎఫెక్టివ్ ఎక్స్ఫోలియేషన్ కోసం.. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను ఒక టీస్పూన్ పంచదారతో కలపండి. కొబ్బరి నూనె ఆర్గానిక్ అయితే ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఈ మిశ్రమాన్ని పెదాలపై సున్నితంగా స్క్రబ్ చేయండి. తేలికగా తయారు చేసుకోగలిగే ఈ మాస్క్ మీకు మృదువైన, టాన్ ఫ్రీ పెదాలను అందిస్తుంది. అంతేకాకుండా హైడ్రేట్ చేసి.. పెదాలకు మంచి రంగునిస్తుంది.
స్ట్రాబెర్రీతో
మీ పెదాలు పింక్ కలర్లో పొడిబారకుండా హైడ్రెటెడ్‌గా కనిపించాలంటే మీరు స్ట్రాబెర్రీ, తేనె, ఆలివ్ ఆయిల్‌తో తయారు చేసిన మాస్క్‌ను ట్రై చేయవచ్చు. ఈ లిప్ మాస్క్ కోసం స్ట్రాబెర్రీని మెత్తగా గ్రైండ్ చేసి దానిలో ఓ టీస్పూన్ తేనె, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు పెదాలకు అప్లై చేసి కడిగేయాలి. ఇది పెదాలకు మంచి పోషణను అందిస్తుంది. స్ట్రాబెర్రీలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పెదాలపై టాన్‌ను తొలగించి సహజమైన రంగును అందిస్తాయి.
నిమ్మరసంతో..
పెదాలను సహజంగా ఎక్స్ఫోలియేట్ చేయడంలో నిమ్మరసం, తేనె, చక్కెర బాగా పనిచేస్తాయి. రెండు టీ స్పూన్ల తేనెలో ఓ టీ స్పూన్ పంచదార, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలు మీ పెదాలపై ఈ మిశ్రమంతో సున్నితంగా మసాజ్ చేయండి. అనంతరం ఓ 5 నిముషాలు ఆ మాస్క్‌ను అలాగే ఉండనివ్వండి. ఇది పెదాలపై ఉన్న మృతకణాలను తొలగించి.. సహజమైన రంగుతో మృదువైన పెదాలను మీకు అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సహజమైన లిప్ మాస్క్‌లను ట్రై చేసి.. మెరిసే, అందమైన పెదాలను పొందేయండి.
Also Read : సంక్రాంతికి ఈ డ్రెస్‌లు సెలక్ట్ చేసుకుంటే పండుగంతా మీ దగ్గరే ఉంటుంది