Raw Banana Powder for Health : అరటిపండును చాలామంది ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అలాగే పచ్చి అరటి కాయలను కొందరు కూరలు చేసుకోవడం లేదా చిప్స్ చేసుకోవడం వంటివి చేస్తారు. అయితే మీకు తెలుసా పచ్చి అరటికాయను పిండిగా చేసి.. వివిధ అవసరాల కోసం దానిని ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో ఈ బిజినెస్​కి మంచి డిమాండ్ ఏర్పడింది. అసలు ఈ పచ్చి అరటి పిండి అంటే ఏంటి? దానిని ఎలా తయారు చేస్తారు? దానివల్ల కలిగే లాభాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement


పచ్చి అరటి పిండి తయారీ.. 


పచ్చి అరటికాయలను పొడి చేసి దీనిని తయారు చేస్తారు. మంచి నాణ్యతగా ఉన్న పచ్చి అరటిపళ్లను ఎంచుకుని వాటిపై తొక్కను తీస్తారు. అనంతరం అరటికాయలను సన్నగా కోసి.. రంగు, నాణ్యత కోసం సోడియం మెటాబైసల్ఫైట్​తో బ్లాంచింగ్ చేస్తారు. అనంతరం హీట్ పంప్ డ్రెయర్​తో ఎండబెట్టి.. మెత్తగా గ్రైండ్ చేస్తారు. దీనిని ఎక్కువకాలం నిల్వ చేసుకోవచ్చు.


పచ్చి అరటి పిండి వినియోగం.. 


ఇలా తయారు చేసిన పచ్చి అరటి పౌడర్​లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. గ్లూటెన్ ఫ్రీ డైట్ ఫాలో అయ్యేవారికి ఇది మంచి ఆప్షన్. అలాగే బేకరీ ఫుడ్స్​తో పాటు కాస్మోటెక్, ఫార్మాస్యూటికల్స్​లో కూడా ఉపయోగిస్తారు. 


పచ్చి అరటి పిండి ఉపయోగాలు..


ప్రపంచ వ్యాప్తంగా బనానా పౌడర్​కి మంచి డిమాండ్ ఉంది. ఎక్కువగా పిల్లలకు తినిపిస్తారు. దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో పాటు.. సులభంగా జీర్ణమవుతుంది కాబట్టి పిల్లలకు మంచిది. పెద్దలు స్మూతీలు, షేక్​లలో తీసుకోవచ్చు. ఇది రోజంతా ఎనర్జీటిక్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. గ్లూటన్ ఫ్రీ బేకింగ్ ఫుడ్స్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. కేక్​లు, మఫిన్, పాన్​కేక్​లు మంచి రుచిని అందిస్తాయి. 


బరువు తగ్గడంలో కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. దీనిలోని స్టార్చ్ ఎక్కువకాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. వర్క్​అవుట్ చేసేవాళ్లు ఎనర్జీకోసం దీనిని సప్లిమెంట్​గా తీసుకుంటారు. ప్రీ వర్క్​అవుట్​లో భాగంగా దీనిని తీసుకోవచ్చు. 


ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే.. 


బనానా పౌడర్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే స్టార్చ్ ఉంటుంది. ఇది గట్​ హెల్త్​కి చాలా మేలు చేయడంతో పాటు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో పాటు ఫైబర్ కలిసి బ్లడ్​లోని షుగర్​ లెవెల్స్​ని రెగ్యులేట్ చేస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉండేవారు కూడా దీనిని తమ డైట్​లో చేర్చుకోవచ్చు. 


కాంప్లెక్స్ కార్బ్స్​తో నిండిన బనానా పౌడర్​లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం ఎనర్జిటిక్​గా ఉండేలా చేస్తాయి. దీనిలోని ప్రోబయోటిక్స్ గట్ హెల్త్​ని మెరుగుపరుస్తాయి. పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. కాబట్టి దీనిని రెగ్యులర్​గా తీసుకుంటే మంచి ఫలితాలే ఉంటాయి. 


ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే.. దీనిని దేశ, విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ బిజినెస్ ఇండియాలో కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. తక్కువ బడ్జెట్​తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారికి బనానా పౌడర్ బిజినెస్ మంచి లాభాలు తెచ్చే అవకాశముంది. 





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.