రసమలై స్వీటు ఎంతో మంది ఫేవరేట్. నోట్లో పెడితే చాలు ఆ తీయదనానికి రెండు, మూడు వరుస పెట్టి తినేస్తాం. దీన్ని తినడం వల్ల అందే పోషకాలు కూడా అధికమే. రసమలై తయారీలో అధికంగా వాడేది పాలే. కాబట్టి పాలలోని సుగుణాలన్నీ ఈ స్వీటులో కూడా ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.  ఎముకలు, దంతాలు, కండరాలు ధృఢంగా మారుతాయి. పిల్లలకు కూడా ఈ స్వీటు బాగా నచ్చేస్తుంది. 

కావాల్సిన పదార్థాలుపాలు - రెండు లీటర్లు (లీటరు, లీటరుగా విడదీసి గిన్నెల్లో పోసుకోండి)నిమ్మరసం - రెండు టేబుల్ స్పూన్లు పంచదార - ఒకటిన్నర కప్పునీళ్లు - సరిపడినన్నియాలకుల పొడి - అర టీస్పూనుకుంకుమ పువ్వు - రెండు రేకలుబాదం పప్పులు - ఆరు పలుకులుపిస్తాలు - ఆరు పలుకులుజీడిపప్పులు - ఆరు పలుకులు

తయారీ ఇలా1. ముందుగా పాలను ఒక గిన్నెలో లీటరు, మరో గిన్నెలో లీటరుగా విడదీసుకోవాలి. ఒక లీటర్ పాలు పనీర్ చేయడానికి, మరో లీటర్ పాలు రబ్డీ (రసమలై స్వీటు తేలియడే జ్యూసు) చేయడానికి వినియోగించాలి. 2. ఒక లీటరు పాలు స్టామ్ మీద పెట్టి మరిగించాలి. అవి వేడెక్కాక నిమ్మరసం చల్లితే  విరిగి పోతాయి. ఇంకా కాసేపు మరిగిస్తే పనీర్ తేలుతుంది. నీటిని వడకట్టి పనీర్‌ను పక్కనపెట్టుకోవాలి. పనీర్ లోని నీటిని కూడా వస్త్రంలో వేడి పిండేయాలి. 3. ఆ పనీర్‌ను రసమలై స్వీటు ఆకారంలో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. 4. గ్లాసు నీళ్లలో పంచదార వేసి పాకం తీసుకోవాలి. అందులో ఒత్తుకున్న పనీర్ బాల్స్ వేయాలి. 5. ఇప్పుడు రబ్డీ కోసం ఒక పాత్రను తీసుకోవాలి. అందులో పాలు వేసి మరిగించాలి. 6. మీగడ కట్టగానే దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్లీ పాలు మరిగించాలి. నాలుగైదుసార్లు మీగడను తీసి పక్కన పెట్టుకోవాలి. 7. పాలు రంగు మారేలా మరిగిపోతాయి. అందులో పంచదార, యాలకుల పొడి, కుంకుమప్పు వేసి మళ్లీ కాసేపు మరిగించాలి. 8. స్టవ్ కట్టేసి రబ్డీ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి రెండు మూడు గంటల పాటూ ఉంచాలి. 9. ముందుగా చేసుకున్న పనీర్ బాల్స్ పై ఈ రబ్డీ మిశ్రమాన్ని పోసేయాలి.10. బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరుక్కుని పైన చల్లుకోవాలి. అంతే రసమలై సిద్ధమైనట్టే.11. వేసవిలో చల్లచల్లని రసమలై తింటుంటే చాలా బావుంటుంది. 

Also read: అప్పట్లో తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టేవారు, ఎందుకు? సైన్సు ఏం చెబుతోంది?

Read Also: ఆ తెగలో విచిత్రమైన ఆచారం, అమ్మాయి పుడితే వేశ్యగా మారుస్తారు