Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ

ఆ దీవి చూడటానికి ఎంత బావుంటుందో, అందులోని మట్టి తింటే మరీ బావుంటుంది.

Continues below advertisement

సప్తవర్ణాల దీవి... ఆ దీవిలో కనిపించని రంగు లేదు. చూసేందుకు బావుంటుందనుకుంటే పొరపాటే, ఆ మట్టి తీసి నోట్లో వేసుకుంటే మరీ రుచి. నమ్మశక్యంగా లేదా?  కానీ ఇది నిజం. ఈ దీవి పేరు హెర్ముజ్ ఐలాండ్. సప్తవర్ణాల్లో ఉంటుంది కాబట్టి ‘రెయిన్ బో ఐలాండ్’ అని కూడా పిలుస్తారు. ఆ దీవిని కాస్త దూరం నుంచి చూస్తే రంగురంగుల్లో తెరలుతెరలుగా కనిపిస్తుంది. ఆ దీవిలో నివసించే ఎంతో మంది ఆ రంగుల మట్టే జీవనాధారం. 

Continues below advertisement

ఎక్కడుంది?
ఇరాన్ దేశానికి 8 కి.మీ దూరంలో పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో ఉంటుంది ఈ దీవి. దాదాపు 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఈ దీవి. ఇదెంత ప్రత్యేకమంటే దాదాపు 70కి పైగా ఖనిజాలు కేవలం ఈ ఒక్క దీవిలోనే గుర్తించారు పరిశోధకులు. ఎన్ని కోట్ల ఏళ్ల క్రితమే అగ్నిపర్వతాల నుంచి వచ్చిన అవక్షేపాలన్నీ కలిపి ఇలా రంగురంగులుగా మారాయని చెబుతారు శాస్త్రవేత్తలు.ఇది చూసేందుకు చాలా అందంగా, ఆకర్షణీయంగా అంతే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎర్రటి బీచులు, ఉప్పు గుహలు, రంగురంగుల గుట్టలతో ఆ దీవిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. 

ఎర్ర మట్టి ఎంతో స్పెషల్
ఇక్కడ దొరికే ఎర్రమట్టికి చాలా ప్రత్యేకమైనది. దీన్ని గెలాక్ అంటారు. స్థానికులు వంటకాల్లో ఈ మట్టిని వాడతారు. ఈ మట్టిని మసాలా ఉపయోగిస్తారు. దీంతో సూరఖ్ అనే సాస్ ని తయారు చేస్తారు. ఆ సాస్‌ని బ్రెడ్ తో తింటారు. ఈ మట్టిని ఇంకా చాలా రకాలు వినియోగిస్తారు. బ్యూటీ ఉత్పత్తుల్లో కూడా ఈ మట్టిని వాడుతారు. అందుకే అక్కడ ఎంతో మంది జీవనోపాధి ఈ మట్టే. 

అక్కడ సముద్ర తీరంలో వచ్చే అలలు కూడా కూడా ఎర్రరంగు పులుముకుంటాయి. కొండలు కూడా ఎర్రగా కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న గుహను చూస్తే పదేపదే చూడాలనిస్తుంది. ఇంద్రధనుస్సు రంగుల్లో చారల్లా ఉంటుంది. ఇక్కడ దొరికే రాళ్లు కూడా రంగురంగుల్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు రాళ్లు, మట్టి,ఉప్పు పెళ్లలు అన్నీ ఏరుకుని తీసుకువెళతారు. 

Also read: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?

Also read: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola