క్కడ రోడ్ పక్కన ఓ చాట్ బండి ఆగి ఉంది. అక్కడ చాట్‌తోపాటు పానీపూరి, దహీవడా, పాపిడీ చాట్ ఇంకా చాలనే అమ్మేస్తున్నారు. ఆ బండి దగ్గర ఇద్దరు కుర్రాళ్లు సూటుబూటు వేసుకుని ఉన్నారు. అయితే, వారు ఆ బండి వద్దకు తినడానికి కస్టమర్లు కాదు. ఆ చాట్ బండి వారిదే. అవన్నీ వారే తయారు చేస్తున్నారు. అదేంటీ, ఫైవ్‌స్టార్ హోటళ్లు ఇప్పుడు రోడ్డు పక్కన కూడా స్టాల్స్ పెడుతున్నాయనే సందేహం అస్సలు వద్దు. ఎందుకంటే, వీరు తమ సేవింగ్ మనీతో ఏర్పాటు చేసుకున్న జీవన ఆధారం ఇది. 


అయినా, సూట్ అనేది వ్యాపార సమావేశాలు, కార్పొరేట్ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ఫైవ్‌స్టార్ హోటల్ సిబ్బంది మాత్రమే ధరించాలనే రూల్ ఏమీ లేదు. అందుకే, ఇద్దరు పంజాబీ యువకులు తమ డ్రెస్సింగ్ సెన్స్‌తో ఔరా అనిపిస్తున్నారు. రోడ్ సైడ్ బండికి హూందాతనాన్ని తీసుకొచ్చారు. పంజాబ్‌లోని మొహలీ రోడ్డుపై ఏర్పాటుచేసిన సింగ్ బ్రదర్స్ చాట్ బండిని చూస్తే ఎవరైనా సరే వహ్వా అంటారు. ఆహార్యం మాత్రమే కాదు, సింగ్ బ్రదర్స్ తయారుచేసే ఆహారం కూడా భలే పసందుగా ఉంటుంది. ‘ఐ లవ్ పంజాబ్’ పేరుతో నడుపుతున్న ఈ బండికి గురించి ‘హ్యారీ ఉప్పల్’ అనే యూట్యూబర్ తన చానెల్‌లో వివరించారు.


ఇంతకీ సూట్ ఎందుకు వేసుకున్నట్లు?: వీరు సూట్ వేసుకోవడానికి పెద్ద కారణం ఏమీ లేదు. ఎందుకంటే.. వీరు హోటల్ మేనేజ్మెంట్‌లో డిగ్రీని పూర్తి చేశారు. ఇంతకు ముందు వీరు ఓ స్టార్ హోటల్‌లో పనిచేశారు. కోవిడ్-19 వీరిపై కూడా ప్రభావం చూపింది. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. రోడ్డు పక్కన బండి పెడదామని ఎప్పుడో ఆలోచించారు. కానీ, ఇందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా ఈ బండి నడిపేవారు. ఇప్పుడు వారు.. ఆ బండికి హుందాతనాన్ని తీసుకొచ్చారు. సూటు, బూటు వేసుకుని వివిధ రకాల చాట్‌లు, పానీపూరీ వంటి పంజాబీ వెరైటీలన్నీ తయారు చేసి విక్రయిస్తున్నారు. ‘‘సూట్ అనేది హోటల్‌మెనేజ్‌మెంట్‌కు సైన్. ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అందుకే ఇలా తయారై బండి నడుపుతున్నాం. త్వరలోనే చాట్ బండిని షాప్‌కు మార్చనున్నాం. ప్రస్తుతం పనులు జరగనున్నాయి’’ అని తెలిపారు. 


Also Read: తిక్క జంట - ప్రతి మూడేళ్లకు విడాకులు, మళ్లీ ఒక్కటై పెళ్లి, ఇంటి పేరే తంట!


వీరి బండిపై చాట్, పాప్రీ చాట్, గోల్గప్పా, దహీ భల్లా వంటి ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఈ చెఫ్‌లు భవిష్యత్తులో మిలీనియర్లు అవుతారని అంటున్నారు. ‘‘వారు ఆ సూట్ ధరించడం వల్ల మరింత ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. అవకాశాల్లేవని ఆందోళన చెందే యువత.. వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని కామెంట్లు చేస్తున్నారు. 



Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..