20 Kgs Weight Loss Transformation by Prudhvi : కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. చాలామందికి బరువు తగ్గాలనే కోరిక మళ్లీ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ చాలామంది విష్​ లిస్ట్​లో ఒకటి ఉంటుంది. అలానే ఓ వ్యక్తి కూడా ఫిట్​నెస్ విషయంలో స్ట్రిక్ట్​గా ఉండాలనుకున్నాడు. 6 నెలలు కష్టపడి 14 విషయాలు ఫాలో అవుతూ 20 కేజీలు తగ్గాడు. అతనే పృథ్వీ చౌదరి. ప్రాజెక్ట్ ప్రోగామ్ మేనేజ్​మెంట్ కన్సల్టెంట్​గా చేస్తోన్న పృధ్వీ తన వెయిట్​లాస్ జర్నీ గురించి.. సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 

Continues below advertisement

బరువు తగ్గడానికి హెల్ప్ చేసిన 14 గోల్డెన్ రూల్స్.. 

బరువు తగ్గాలని కోరిక ఉంటే సరిపోదు. కానీకోసం శారీరకంగా, మానసికంగా కొన్ని కమిట్మెంట్స్, ఓపిక, నిబద్ధత ఉండాలన్నారు పృధ్వీ. అయితే తన 20 కేజీల వెయిట్​లాస్ జర్నీలో 14 విషయాలు కచ్చితంగా ఫాలో అయ్యాడట. అవేంటంటే.. 

1. నో షుగర్ - 6 నెలలు స్వీట్స్​కి పూర్తిగా దూరంగా ఉన్నాడట. అయితే Monk fruit స్వీటనర్​ని రిప్లేస్​మెంట్​గా తీసుకునేవాడట. ఇది క్రేవింగ్స్​ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసిందని తెలిపారు. 

Continues below advertisement

2. నో మైదా - మైదాతో తయారు చేసిన బిస్కెట్లు, ఇతర వేయించిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపారు. 

3. బిర్యానీకి బై - ఈ ఆరు నెలలు బిర్యానీ, స్వీట్స్, ఐస్​ క్రీమ్ జోలికి వెళ్లలేదని చెప్పాడు. 

4. కార్డియో - ప్రతిరోజూ 45 నిమిషాలు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ 45 నిమిషాలు చేసేవారట. 

5. ప్రోటీన్ - ప్రతి భోజనంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండేలా చూసుకునేవారట. తన బరువును బట్టి.. ఒక్కో కేజీకి 1.5 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకునేవారట. 

6. నీళ్లు - శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉండేందుకు రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగేవారట. 

7. స్నాక్స్ - బయట దొరికే చిరుతిళ్లకు బదులుగా.. 500 గ్రాముల పండ్లు తీసుకునేవారట. 

8. డ్రై ఫ్రూట్స్ - రోజుకు రెండు వాల్​నట్స్, 5 బాదం తీసుకునేవారట. ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్​గా వీటిని ఫ్రూట్స్​ని తినేవారట. 

9. భోజన సమయాలు - మధ్యాహ్న భోజనం 12.30కి, రాత్రి భోజనం 7లోపు ముగించేవారట. 

10. నిద్ర సమయం - రోజూ రాత్రి 9.30కి పడుకుంటే.. ఉదయం 5.30కి లేచేవారట. 

11. బ్రేక్​ఫాస్ట్ - ఉదయాన్నే రెండు దోశలు లేదా మూడు ఇడ్లీలు తినేవారట. వాటితో పాటు మూడు ఎగ్ వైట్స్, 125ml పాలు లేదా కాఫీ షుగర్ లేకుండా తీసుకునేవారట. 

12. లంచ్ - 120 గ్రాముల అన్నం, వెజ్ లేదా నాన్​వెజ్ కర్రీ. అలాగే 100 గ్రాముల పెరుగు మధ్యాహ్న భోజనంలో తీసుకునేవారట. 

13. 250 గ్రాముల తందూరి లేదా గ్రిల్ చేసిన చికెన్ తీసుకునేవారట. 

14. కెలరీ ట్రాకింగ్  చేసేవారట.

ఇవన్నీ తాను బరువు తగ్గడంలో హెల్ప్ చేశాయంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. పృథ్వీ ఫాలో అయింది రొటీన్​లో చిన్న చిన్న మార్పులే. కానీ వాటిని సమయానికి ఫాలో అవుతూ.. లైఫ్​స్టైల్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల భారీ రిజల్ట్స్ చూశారు. మీరు కూడా 2026లో ఫిట్​నెస్ మీ గోల్ అనుకుంటే.. ఈ తరహా లైఫ్​స్టైల్ ప్లాన్ చేసుకోవచ్చు. అన్నీ ఇవే ఫాలో అవ్వాలని లేదు. మీ హెల్త్, మీ బరువు, మీ వర్క్​ లైఫ్​కి తగ్గట్లుగా దీనిని మార్చుకోవచ్చు.