Eye Infections Monsoons : ఇతర సీజన్లతో పోల్చి చూస్తే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం చల్లబడటం, తేమ శాతం పెరగడంతో అనేక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అయితే ఈ కాలంలో కేవలం సీజనల్ వ్యాధులు మాత్రమే కాదు. కంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కళ్లు ఎర్రబడటం, మంట, వాపు, వంటి కంటి సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కంటి వైద్యుడిని సంప్రదించాలి.
వర్షాకాలంలో వచ్చే సాధారణ కంటి వ్యాధులు ఇవే:
కండ్లకలక (కంటి ఫ్లూ):
కండ్లకలక అనేది కనురెప్పల లోపలి భాగం, ఐబాల్ తెల్లని భాగాన్ని లైన్ చేసే సన్నని పొర వాపునకు దారితీసే ఇన్ఫెక్షన్. కండ్లకలక వచ్చినప్పుడు దురద, సరిగ్గా కనిపించకపోవడం, నీరు కారడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కనురెప్పలు ఎర్రగా మారుతాయి. వైరల్ కంజక్టివిటిస్ అనేది అంటువ్యాధి. జాగ్రత్తలు తీసుకోనట్లయితే ఈ ఇన్ఫెక్షన్ ఇతరులకు సులభంగా సోకే ప్రమాదం ఉంది.
పొడి కళ్ళు:
మీ కళ్లు కావాల్సినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేనప్పుడు కళ్లు పొడిగా మారుతాయి. దీనిని సజల ద్రవం అనికూడా పిలుస్తారు. దీనిని వైద్యపరి భాషలో కెరాటో⦿ కంజక్టివిటిస్ అని అంటారు. మొబైల్, కంప్యూటర్ స్క్రీన్‌ని ఎక్కువసేపు చూసినప్పుడు, చదివేటప్పుడు లేదా చూస్తున్నప్పుడు రెప్పలు వేయాలి. రెప్పలు వేయకుండా వాటిని అలాగే చూస్తుండిపోతే కళ్లు పొడిబారిపోతాయి.
కార్నియల్ అల్సర్:
కార్నియల్ అల్సర్ అనేది మీ కార్నియాలో ఏర్పడే పుండు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో నుంచి నీరు కారడం, కళ్లలో రక్తం తీవ్రమైన కంటి నొప్పి, చీము లేదా ఇతర కంటి నుంచి నీరు కారడం దీని లక్షణం. కార్నియల్ అల్సర్ దృష్టిలోపంతోపాటు అంధత్వానికి దారితీస్తుంది.
స్టై:
కనురెప్పల బేస్ దగ్గర ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చిన్న గ్రంధులను కలిగి ఉండే బ్యాక్టీరియా. అప్పుడప్పుడు కనురెప్పల పై భాగంలో లేదా కంటి లోపలి భాగంలో మొటిమల్లా ఎర్రటి చీము గడ్డలు ఏర్పడతాయి. వీటినే స్టై అంటారు. సరైన మందులు తీసుకుంటే రెండు రోజుల్లో ఈ సమస్య తగ్గుతుంది. ఈ సమయంలో కళ్లు మూసుకుంటాయి. బాగా నొప్పిగా ఉంటుంది.
ట్రాకోమా:
ట్రాకోమా బాక్టీరియం క్లామిడియా ట్రాకోమాటిస్ వల్ల వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.9 మిలియన్ల మంది అంధత్వానికి ఈ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది సోకిన వ్యక్తి కళ్ళు లేదా ముక్కుతో నేరుగా తాకడం లేదా తువ్వాలు, ఈగలు ద్వారా సంభవిస్తుంది.
వర్షాకాలంలో మీ కళ్ళను ఎలా రక్షించుకోవాలి?
⦿ మీ కళ్ళను తాకడానికి ముందు మీ చేతులను సరిగ్గా కడుక్కోవాలి.
⦿ మురికి చేతులతో మీ కళ్లను తాకకూడదు
⦿ మీ కళ్ళను చాలా తరచుగా రుద్దకూడదు.
⦿ మీ కాంటాక్ట్ లెన్స్‌లను షేర్ చేయవద్దు.
⦿ ఈత కొట్టేటప్పుడు లేదా గాలికి గురైనప్పుడు కంటి రక్షణ అద్దాలను ఉపయోగించండి.
⦿ వర్షాకాలంలో స్విమ్మింగ్ కు దూరంగా ఉండటం మేలు.
⦿ ప్రతిరోజూ పరిశుభ్రమైన నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. నిద్ర లేచినప్పుడు, కాంటాక్ట్ లెన్స్ లను తొలగించినప్పుడు చాలా మంది కళ్లను గట్టిగా రుద్దుతుంటారు.
⦿ ఇలా చేస్తే కార్నియా శాశ్వతంగా దెబ్బతింటుంది. కాబట్టి కళ్లను గట్టిగా రుద్దకూడదు.
Also Read : ఉదయం లేచిన వెంటనే ఆ సమస్యలున్నాయా? అయితే మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశముంది జాగ్రత్త