దానిమ్మ పండ్లు తినడం వల్ల చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చు. రక్తహీనత వంటి సమస్యలు కూడా దగ్గరికి రావు. రోగినిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇవి ముందుంటాయి. దానిమ్మ గింజలు ఒలుచుకుని తిన్నాక తొక్కలు బయటపడేస్తాం. కానీ ఆ తొక్కలను పలురకాలు ఉపయోగించుకోవచ్చు. వాటిలో అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి.  వాటిని ఎండబెట్టి పొడిలా చేసుకుని డబ్బాలో దాచుకోవాలి. ఆ పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే చాలా మంచిది. ఇంకా అనేక రకాలుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. 


1. కీళ్లనొప్పులతో బాధపడేవారికి దానిమ్మ తొక్కలు చాలా మేలు చేస్తాయి. వీటిని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తాగుతూ ఉంటే కీళ్లనొప్పులు, వాపుల్లాంటివి దరిచేరవు. కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నప్పుడు రోజూ తాగడం చాలా మంచిది. 
2. గాయాలు, పుండ్లకు కూడా దానిమ్మతొక్కలు ఔషధంలా పనిచేస్తాయి. వీటిని మెత్తని పేస్టులా చేసి గాయాలకు పెడితే త్వరగా మానిపోతాయి. 
3. పంటి సమస్యలు పోవాలంటే ఈ తొక్కల పొడిలో ఉప్పు, పుదీనా కలిపి దంతాలను రోజూ తోముకోవాలి. పసుపు వర్ణం పోయి తెల్లగా మారిపోతాయి. పంటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.
4.  మొటిమలు పోగొట్టే సత్తా కూడా దానిమ్మ తొక్కలకు ఉంది. వీటిని పొడి చేసి డబ్బాలో దాచుకోవాలి. రెండు రోజులకోసారి ఆ పొడిని నీళ్లలో కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు సమస్య తగ్గుతుంది. 
5. డయాబెటిస్, ఊబకాయం బారిన పడిని వారికి ఈ పొడి ఎంతో మేలు చేస్తుంది. నిద్ర పోయే ముందు నీళ్లలో దానిమ్మ తొక్కలను వేసి మరిగించి, ఆ నీటిని వడకట్టి తాగితే చాలా మంచిది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. గుండెకు కూడా ఎంతో మేలు. 
6. నోటి దుర్వాసన పోవాలంటే దానిమ్మ గింజల పొడిని నీటిలో వేసుకుని ఆ నీటితో నోరు పుక్కిలిస్తూ ఉండాలి. 
7. దానిమ్మ గింజల్లో ఉన్నట్టే దానిమ్మ పండులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6 పోషకాలు నిండుగా ఉంటాయి. అందుకే దానిమ్మ తొక్కలను పడేయకుండా పైన చెప్పిన విధంగా వాడుకోవాలి. 



గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.



Also Read: ధూమపానం వల్ల పెరిగిపోతున్న గుండె జబ్బులు, మానకపోతే పోటు వచ్చే అవకాశం


Also Read: వారానికోసారి సముద్రపు చేపలు తినాల్సిందే, ఈ సమస్యలున్న వారికి మరీ మంచిది