Manage Your Periods in the Office : వర్కింగ్ చేసే మహిళలకు పీరియడ్ సమయంలో ఆఫీస్‌లో ఉండటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నొప్పి, అసౌకర్యం, అలసట వీటన్నింటి మధ్య పని చేయడం నిజమైన సవాల్ అని చెప్పవచ్చు. కానీ పీరియడ్స్ సడెన్​గా వచ్చినప్పుడు.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆఫీస్‌లో సులభంగా మేనేజ్ చేయవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో.. వాటిని ఫాలో అయితే వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

ముందే సిద్ధమైపోండి..

పీరియడ్స్ డేట్ దగ్గర పడుతున్నప్పుడే మీరు సిద్ధంగా ఉండాలి. ఆ సమయంలో ఆఫీస్ బ్యాగ్‌లో శానిటరీ ప్యాడ్స్ లేదా టాంపాన్స్ లేదా మెన్‌స్ట్రువల్ కప్ రెడీగా ఉంచుకోవాలి. పెయిన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే వైద్యుని సలహాతో.. పెయిన్‌కిల్లర్ తీసుకోవచ్చు. వెట్ వైప్స్, టిష్యూ పేపర్లు, పాలిథిన్ కవర్.. ప్యాడ్స్ డిస్పోజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అలాగే స్పేర్ ఇన్నర్‌వేర్ అదనంగా పెట్టుకుంటే మంచిది. డార్క్ కలర్ స్పేర్ డ్రెస్ పెట్టుకుంటే మరీ మంచిది. 

డ్రెస్సింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

నేవీ బ్లూ, బ్లాక్, డార్క్ గ్రీన్ వంటి రంగులు పీరియడ్స్ రోజుల్లో సేఫ్ చాయిస్​గా చెప్పవచ్చు. కంఫర్టబుల్ కాటన్ బట్టలు వేసుకోండి. వదులుగా, సౌకర్యంగా ఉండే దుస్తులు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. టైట్ బెల్ట్, టైట్ జీన్స్ అవాయిడ్ చేస్తే మంచిది. లేదంటే పీరియడ్లో కడుపు ఉబ్బరం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. పీరియడ్ అండర్‌వేర్ వాడితే ఈ రోజుల్లో లీకేజ్ భయం ఉండదు. 

Continues below advertisement

శానిటరీ ప్రొడక్ట్స్ 

ఆఫీస్‌లో ఏ ప్రొడక్ట్ వాడినా సరైన సమయానికి మార్చుకోవడం చాలా అవసరం. అంటే ప్యాడ్స్ ప్రతి 4 నుంచి 6 గంటలకు మార్చుకోండి. మీకు బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటే ప్రతి రెండుగంటలకు ఒకటి మార్చుకోవాలి. టాంపాన్స్ ప్రతి 4 నుంచి 8 గంటలకు మార్చుకోవాలి. 8 గంటలకు మించి వాడకండి. మెన్‌స్ట్రువల్ కప్ 8 నుంచి 12 గంటలు వాడవచ్చు. చాలా మందికి ఆఫీస్‌లో ఇది అనుకూలంగా ఉంటుంది.

నొప్పిని తగ్గించుకునేందుకు.. 

పీరియడ్ క్రాంప్స్ వల్ల వర్క్ చేయడం కష్టంగా ఉంటే.. హీట్ ప్యాచ్‌లు లేదా హాట్ వాటర్ ప్యాక్ కడుపుపై పెట్టుకుంటే.. నొప్పి తగ్గుతుంది. మార్కెట్లో చిన్న డిస్పోజబుల్ హీట్ ప్యాచ్‌లు దొరుకుతాయి. వాటిని డ్రెస్​ల లోపల అతికించుకోవచ్చు. వెనకకు వాలి కూర్చోకుండా నేరుగా కూర్చోండి. మోకాళ్ల కింద చిన్న దిండు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.

ప్రతి గంటకూ కొద్ది నిమిషాలు నిలబడి స్ట్రెచింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, నొప్పి తగ్గుతుంది. వైద్యుని సలహాతో ఇబుప్రొఫెన్ లేదా మెఫెనామిక్ తీసుకోవచ్చు. ఇవి క్రాంప్స్‌ తగ్గిస్తాయి. ఫుడ్, వాటర్ తీసుకోవాలి. డీహైడ్రేషన్ నొప్పిని తగ్గిస్తుంది. రోజుకు 2–3 లీటర్లు తాగాలి. అరటిపండు, డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఐరన్, శక్తిని అందిస్తాయి. గ్రీన్ టీ లేదా అల్లం టీ తాగితే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుతుంది. జంక్ ఫుడ్, కాఫీ, చాక్లెట్ తగ్గిస్తే మంచిది. లేదంటే క్రాంప్స్ పెరుగుతాయి. 

మానసిక ఆరోగ్యానికై.. 

పీరియడ్స్ రోజుల్లో హార్మోన్ మార్పుల వల్ల చిరాకు, మూడ్ స్వింగ్స్, అలసట వస్తాయి. కాబట్టి గంటకోసారి 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. డీప్ బ్రీతింగ్ తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగులతో విషయం షేర్ చేసుకోవడానికి ఆలోచించకండి. ఇది సహజమైన ప్రక్రియ. నొప్పి ఎక్కువగా ఉంటే.. లీవ్ తీసుకోవచ్చు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే.. 

నొప్పి ఎక్కువగా ఉంటే అది సాధారణం కాదు. రక్తస్రావం అధికంగా ఉంటే.. గంటకు ఒకటి కంటే ఎక్కువ ప్యాడ్స్ అవసరమైతే.. 7 రోజులకు మించి పీరియడ్స్ ఉంటే వైద్యుడిని సంప్రదించండి. వికారం, వాంతులు వస్తే.. ఎండోమెట్రియోసిస్, PCOS వంటి సమస్యల సంకేతాలు కావచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.