Husband Sitaram ends life : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సీతారాం ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం తాను ఆఫీసుకు వెళ్లాక తన భార్య ప్రియుళ్లతో గడుపుతూ వీడియోలు తీసుకుంటోంది. ఆ వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు. ఈ పని చేస్తూ.. ఓ సూసైడ్ లెటర్ రాశారు. అందులోని అంశాలు కన్నీరు పెట్టించేలా ఉన్నాయి.
భార్యను ఏ లోటూ లేకుండా చూసుకున్న సీతారాం నమ్మిన భార్య మోసం చేస్తే ఆ బాధ వర్ణనాతీతం. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మంచి హోదాలో ఉన్న సీతారాం, తన భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. కానీ, ఆమె మాత్రం ప్రేమ అనే పదానికే అర్థం మార్చేసింది. ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా ముగ్గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని, పవిత్రమైన బంధాన్ని, నమ్మకాన్ని వమ్ము చేసింది.
"అసలు నీకు ఏం కావాలి రేణుక? ప్రేమా.. లేక శృంగారమా?"
సీతారం తన సూసైడ్ లెటర్‌లో ఒకే ఒక ప్రశ్న వేశాడు. అదేమిటంటే "అసలు నీకు ఏం కావాలి రేణుక? ప్రేమా.. లేక శృంగారమా?"
రేణుక కేవలం వివాహేతర సంబంధాలకే పరిమితం కాలేదు, తన ప్రియులతో గడిపిన ఏకాంత క్షణాలను వీడియోలు తీసుకునే స్థాయికి వెళ్ళింది. రేణుక ప్రియుల్లో ఒకడైన రమణ, ఆ ప్రైవేట్ వీడియోలను ఏకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. భార్య నిజస్వరూపం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో కనిపించడంతో, సీతారాం ఆత్మగౌరవం దెబ్బతిన్నది. సమాజంలో తలెత్తుకోలేక, భార్య నమ్మకద్రోహాన్ని భరించలేక ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ లో దూకి తనువు చాలించాడు.
19 పేజీల్లో తన మరణ వాంగ్మూలం రాసిన సీతారాం సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆయన రాసిన 19 పేజీల మరణ వాంగ్మూలాన్ని కీలక ఆధారంగా తీసుకున్నారు. ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్ లను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సీతారాం ఆఫీసులో ఉన్న సమయంలోనే రమణారెడ్డి తరచుగా ఇంటికి వచ్చి రేణుకతో గడిపేవాడని పోలీసుల విచారణలో తేలింది.
ఆత్మహత్యకు ముందు సీతారాం రాసిన లేఖలోని మాటలు సమాజంలోని మహిళలకు ఒక హెచ్చరికలా మిగిలాయి. ఏ అమ్మాయి కూడా ఇలాంటి పనులు చేసి ఒక కుటుంబానిని రోడ్డున పడేయవద్దు అంటూ ఆయన చేసిన వేదన, నేటి తరం వివాహేతర సంబంధాల వల్ల చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలకు నిదర్శనం.
2018లో మొదలైన వీరి పెళ్లి బంధం ఇప్పుడు ముగిసిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణుక చేసిన అరాచకాల వల్ల ఇప్పుడు ఆ పిల్లలు అనాథలయ్యారు. ఒక భర్తగా, తండ్రిగా ఓడిపోయిన సీతారాం.. ఒక మోసకారి భార్య వల్ల బలైపోయాడు.
