Patanjali Treatments for Chronic Diseases : దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారికి హరిద్వార్‌లోని 'పతంజలి నిరామయం(Patanjali Niramayam)' సానుకూలమైన ప్రదేశంగా చెప్తున్నారు. సాంప్రదాయ వైద్యం లేకుండా సహజమైన చికిత్సలతో, ఆయుర్వేదంతో తగ్గించుకోవాలనేవారికి ఇది బెస్ట్ అని చెప్తున్నారు. స్వామి రామ్​దేవ్, ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రం గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలు ఈ పతంజలి నిరామయం అంటే ఏమిటి? ఇక్కడ చేసే చికిత్సలు ఏంటి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పతంజలి నిరామయంలో ఏ వ్యాధులకు చికిత్స చేస్తారంటే..

పతంజలి నిరామయం కేంద్రంలో ప్రధానంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టారు. ఎక్కువమంది ఇబ్బంది పడే సమస్యలకు ఇక్కడ ఆయుర్వేదం, సహజమైన చికిత్సలు అందిస్తారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో చూసేద్దాం.

  • మధుమేహం
  • అధిక రక్తపోటు
  • కీళ్ల నొప్పులు
  • ఊబకాయం
  • కాలేయ సమస్యలు
  • మూత్రపిండాల సమస్యలు
  • నాడీ సంబంధిత రుగ్మతలు

ఈ సమస్యలకు పంచకర్మ, యోగా, సహజ చికిత్సల ద్వారా ట్రీట్మెంట్ అందిస్తారు. వీటి ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేసి.. డీటాక్స్ అవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. శిరోధార వంటి చికిత్సలు మనస్సును శాంతింపజేయడానికి సహాయపడతాయి. అయితే కటి బస్తీ, జాను బస్తీ వంటి చికిత్సల ద్వారా నడుము, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కంటి సంబంధిత సమస్యల కోసం.. అక్షి తర్పణ వంటి చికిత్సలు కూడా ఇక్కడ అందిస్తారు.

పతంజలి నిరామయంలోని సదుపాయాలివే

ప్రతి రోగికి ఒకేరకమైన చికిత్స అందించరు. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వారికి అనుకూలమైన చికిత్సా ప్రణాళిక ఇస్తారు. వైద్యులు ఆయుర్వేదాన్ని ఆధునిక సౌకర్యాలతో కలిపి నిర్దిష్ట ఆహారాలు, చికిత్సలను సిఫార్సు చేస్తారు. ఈ కేంద్రంలో సాత్విక భోజనం, సౌకర్యవంతమైన వసతిని కూడా అందిస్తుంది. ఇది త్వరగా కోలుకోవడానికి కావాల్సిన ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.

నాడీ సంబంధిత సమస్యలకై.. 

పతంజలి ప్రకారం.. నిరామయం ద్వారా పార్కిన్సన్, అల్జీమర్స్, స్ట్రోక్ వంటి సంక్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్సలను అందిస్తుంది. నాడీ పునరుద్ధరణ చికిత్సకై యోగాను ఉపయోగించి.. ఈ కేంద్రం నాడీ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుందట. బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లు, అల్ట్రాసౌండ్​తో సహా అధునాతన రోగనిర్ధారణ సౌకర్యాలతో.. రోగులను పర్యవేక్షిస్తూ చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చారు.

నిరామయం వెనుక ఉన్న తత్వశాస్త్రం ఏమిటంటే.. ఆరోగ్యం అనేది అందరికీ ప్రాథమిక మానవ హక్కు. కాబట్టి వైద్యం కోసం ప్రకృతి అవసరమున్న ప్రతిదాన్ని నిరామయం కేంద్రం అందిస్తుంది. ప్రపంచాన్ని వ్యాధి రహితంగా మార్చడమే తన లక్ష్యమని పతంజలి తెలిపింది. శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును కూడా మెరుగుపరచడమే లక్ష్యంగా నిరామయం ప్రారంభించినట్లు తెలిపింది. అందుకే దీర్ఘకాలిక వ్యాధులకు సహజంగా చికిత్స అందిస్తూ.. దుష్ప్రభావాలు లేని చికిత్సను ఇస్తున్నామని తెలిపింది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.